News
News
X

Dj Tillu 2: అయ్యో రాధిక, నువ్వు లేని ‘డీజే టిల్లు’నా? సీక్వెల్‌లో ఆమె కనిపించదా?

‘డీజే టిల్లు’లో రాధికగా తన అలరించిన నేహా శెట్టి, సీక్వెల్‌లో కనిపించదట. ఆమె స్థానంలో అనుపమ పరమేశ్వరన్ నటించనుందట.

FOLLOW US: 

చిన్న సినిమాగా విడుదలై.. పెద్ద విజయాన్ని అందుకున్న మూవీ ‘డీజే టిల్లు’. కరోనా తర్వాత ‘జాతి రత్నాలు’ సినిమా జనాలను మళ్లీ సినిమా థియేటర్లకు రప్పిస్తే.. ‘డీజే టిల్లు’ సినిమా ఆ జనాలకు ఓ రేంజిలో కిక్ ఇచ్చింది. యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నటించిన ఈ సినిమా సూపర్ డూపట్ హిట్ అందుకుంది. ఈ సినిమా సిద్దుకు మంచి పేరు తీసుకొచ్చింది. అంతకు ముందుకు సిద్దూ కొన్ని సినిమాల్లో నటించినా.. పెద్దగా గుర్తింపు రాలేదు. డీజే టిల్లుతో వారెవ్వా అనిపించాడు. ఈ సినిమాలో ఆయన నటనకు జనాలు ఫిదా అయ్యారు. కొంచెం అమాయకత్వం.. మరికొంత హాస్యం కలగలిపిన యాక్టింగ్ తో అదుర్స్ అనిపించాడు. ముఖ్యంగా ఆయన మాట, యాస తీరుకు జనాలు అబ్బుర పడ్డారు. 

విమల్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘డీజే టిల్లు’ సినిమా.. బాక్సా ఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టింది. కరోనా తర్వాత థియేటర్లలో విడుదలై పెద్ద విజయాన్ని అందుకున్న సినిమాగా నిలిచింది. సిద్దూ యాక్టింగ్ కు తోడు ఆయన మాట తీరు ఆకట్టుకున్నాయి. డీజే టిల్లు‌కు వచ్చి క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని.. దానికి సీక్వెల్ తీయనున్నట్లు దర్శకుడు ప్రకటించాడు. సినీ ప్రియులు సైతం సీక్వెల్ మూవీ కోసం ఆసక్తి చూపిస్తున్నారు. రాబోయే సినిమా మరింత కామెడీతో ఉండబోతున్నట్లు టాక్ నడుస్తుంది. దర్శకుడు సైతం ఇప్పటికే సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. సినిమాను త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నాలు మొదలుపెట్టారట. 
 
ప్రస్తుతం ‘డీజే టిల్లు’కు సంబంధించి ఓ ఆసక్తికర విషయం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమాలో సిద్దూకి జోడీగా నేహా శెట్టి నటించింది. రాధిక క్యారెక్టర్ లో ఒదిగిపోయి నటించింది ఈ ముద్దుగుమ్మ. రాధికా.. అంటూ హీరో పిలిచే పిలుపు జనాల్లో మస్తు కామెడీని నింపింది. సీక్వెల్ సినిమాలో మాత్రం నేహాను తప్పించినట్లు తెలుస్తోంది. ఈ ముద్దుగుమ్మ స్థానంలో మరో క్రేజీ బ్యూటీని తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇంతకీ ఆ క్రేజీ బ్యూటీ మరెవరో కాదు.. మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. 

అనుపమ కూడా ఈ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇప్పటి వరకు సాంప్రదాయ పాత్రల్లో మాత్రమే నటించిన అనుపమ.. రాను రాను కాస్త గ్లామర్ డోస్ పెంచింది. ఆమె నటించిన సినిమా ‘రౌడీ బాయ్స్’లో హద్దులు దాటి ఆశ్చర్యపరిచింది. మొత్తంగా డీజే టిల్లు సీక్వెల్ నుంచి రాధిక ఔట్ అయినట్లే టాక్ వస్తుంది. త్వరలోనే హీరోయిన్ మార్పుకు సంబంధించి సినిమా యూనిట్ అఫీషియల్ ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. అనుపమా నటించిన ‘కార్తీకేయ 2’ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇంకా ఆమె చేతిలో ‘18 పేజెస్’, ‘బటర్ ఫ్లై’ సినిమాలు ఉన్నాయి. ‘డీజే టిల్లు’ సీక్వెల్‌లో ఛాన్సు లభిస్తే అనుపమా మరింత బిజీగా మారిపోనుంది. 

Also Read : ఆమిర్‌పై కోపం హృతిక్ రోషన్ మీదకు - ఒక్క ట్వీట్ ఎంత పని చేసిందో చూశారా?

Also Read : స్క్రీన్లు తక్కువ, కలెక్షన్లు ఎక్కువ - తొలి రోజే 25 శాతం రికవరీ చేసిన 'కార్తికేయ 2'.

Published at : 15 Aug 2022 05:07 PM (IST) Tags: Anupama Parameswaran Neha Shetty DJ Tillu Siddu Jonnalagadda DJ Tillu Sequel

సంబంధిత కథనాలు

Guppedantha Manasu October 6th Update: అప్పుడే ప్రేమ అంతలోనే కోపం, రిషిధార గమ్యం ఏంటో మరి!

Guppedantha Manasu October 6th Update: అప్పుడే ప్రేమ అంతలోనే కోపం, రిషిధార గమ్యం ఏంటో మరి!

Karthika Deepam October 6th Update: అడుగడుగునా నిలదీస్తున్న కార్తీక్ - మోనితకి మొదలైన కౌంట్ డౌన్, టెన్షన్లో దీప!

Karthika Deepam October 6th Update: అడుగడుగునా నిలదీస్తున్న కార్తీక్ - మోనితకి మొదలైన కౌంట్ డౌన్, టెన్షన్లో దీప!

Devatha October 6th Update: మాధవ్ ప్లాన్ సక్సెస్, ప్రకృతి వైద్యశాలకి సత్య- నర్స్ చెంప పగలగొట్టిన రుక్మిణి

Devatha  October 6th Update: మాధవ్ ప్లాన్ సక్సెస్, ప్రకృతి వైద్యశాలకి సత్య- నర్స్ చెంప పగలగొట్టిన రుక్మిణి

RRR For Oscars : ఆస్కార్స్‌కు 'ఆర్ఆర్ఆర్' - తొలి అడుగు పడింది!

RRR For Oscars : ఆస్కార్స్‌కు 'ఆర్ఆర్ఆర్' - తొలి అడుగు పడింది!

Ennenno Janmalabandham October 6th: మాళవిక, ఖైలాష్ ని ఉతికి ఎండగట్టిన సులోచన- కుమిలి కుమిలి ఏడ్చిన మాలిని

Ennenno Janmalabandham October 6th: మాళవిక, ఖైలాష్ ని ఉతికి ఎండగట్టిన సులోచన- కుమిలి కుమిలి ఏడ్చిన మాలిని

టాప్ స్టోరీస్

తెలంగాణ ప్రజలను గెలిపించినట్టే దేశ ప్రజలను గెలిపిస్తాం: సీఎం కేసీఆర్

తెలంగాణ ప్రజలను గెలిపించినట్టే దేశ ప్రజలను గెలిపిస్తాం: సీఎం కేసీఆర్

ఉన్న ప్రతిపక్షాలకే ఆదరణ లేదు- వచ్చే బీఆర్‌ఎస్‌ ఏం చేస్తుంది: ఏపీ మంత్రులు

ఉన్న ప్రతిపక్షాలకే ఆదరణ లేదు- వచ్చే బీఆర్‌ఎస్‌ ఏం చేస్తుంది: ఏపీ మంత్రులు

Weather Latest Update: నేడు ఈ జిల్లాలకు వర్షం ఎలర్ట్! ఈ రెండ్రోజులు దంచికొట్టనున్న వానలు

Weather Latest Update: నేడు ఈ జిల్లాలకు వర్షం ఎలర్ట్! ఈ రెండ్రోజులు దంచికొట్టనున్న వానలు

Bigg Boss 6 Telugu Episode 32: సూర్య అంటే ఇష్టం, తన క్రష్ అని చెప్పేసిన ఇనయా, మరి సూర్యకు?

Bigg Boss 6 Telugu Episode 32: సూర్య అంటే ఇష్టం, తన క్రష్ అని చెప్పేసిన ఇనయా, మరి సూర్యకు?