Karthikeya 2 Box Office Collection Day 1 : స్క్రీన్లు తక్కువ, కలెక్షన్లు ఎక్కువ - తొలి రోజే 25 శాతం రికవరీ చేసిన 'కార్తికేయ 2'.
యువ హీరో నిఖిల్ లేటెస్ట్ సినిమా 'కార్తికేయ 2'కు హిట్ టాక్ లభించింది. అయితే... ఆశించిన సంఖ్యలో సినిమాకు స్క్రీన్లు లభించలేదు. అయినా ఫస్ట్ డే మంచి కలెక్షన్స్ సాధించింది.
![Karthikeya 2 Box Office Collection Day 1 : స్క్రీన్లు తక్కువ, కలెక్షన్లు ఎక్కువ - తొలి రోజే 25 శాతం రికవరీ చేసిన 'కార్తికేయ 2'. Karthikeya 2 Box Office Collection Day 1 Nikhil Siddharth Anupama Parameswaran Chandoo Mondeti's Karthikeya 2 collects Rs 8.50 crores gross worldwide on day 1 Karthikeya 2 Box Office Collection Day 1 : స్క్రీన్లు తక్కువ, కలెక్షన్లు ఎక్కువ - తొలి రోజే 25 శాతం రికవరీ చేసిన 'కార్తికేయ 2'.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/14/625d64dd17d31f7037a1eaf0455c02191660458799068313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
నిఖిల్ సిద్దార్థ్ (Nikhil Siddharth) కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ సినిమా 'కార్తికేయ 2' (Karthikeya 2 Movie). పలుమార్లు వాయిదాలు పడిన తర్వాత ఈ శనివారం థియేటర్లలోకి వచ్చింది. సినిమా అయితే విడుదలైంది. కానీ, ఆశించిన సంఖ్యలో థియేటర్లు లభించలేదు. పరిమిత సంఖ్యలో విడుదల అయినప్పటికీ... మంచి వసూళ్లు సాధించింది.
Karthikeya 2 First Day Collection Worldwide: 'కార్తికేయ 2' సినిమాకు తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 8.50 కోట్ల గ్రాస్ లభించింది. ఖర్చులు గట్రా తీసేయగా... రూ. 5.05 కోట్ల షేర్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాల ఖబర్. నిఖిల్‌కు ఇది మంచి ఓపెనింగ్ అని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా మంచి వసూళ్లు సాధించింది.
ఏరియాల వారీగా తెలుగు రాష్ట్రాల్లో 'కార్తికేయ 2' వసూళ్లు చూస్తే...
నైజాం : రూ. 1.24 కోట్లు
ఉత్తరాంధ్ర : రూ. 45 లక్షలు
సీడెడ్ : రూ. 40 లక్షలు
నెల్లూరు : రూ. 17 లక్షలు
గుంటూరు : రూ. 44 లక్షలు
కృష్ణా జిల్లా : రూ. 27 లక్షలు
తూర్పు గోదావరి : రూ. 33 లక్షలు
పశ్చిమ గోదావరి : రూ. 20 లక్షలు
తెలుగు రాష్ట్రాల్లో 'కార్తికేయ 2' తొలి రోజు రూ. 5.30 కోట్ల గ్రాస్ (రూ. 3.50 కోట్ల షేర్) వసూలు చేసింది. రెస్టాఫ్ ఇండియా, కర్ణాటకలో రూ. 25 లక్షలు కలెక్ట్ చేసింది. ఓవర్సీస్ మార్కెట్‌లో వసూళ్లు రూ. 1.30 కోట్లు ఉన్నాయి. టోటల్ ఫస్ట్ డే గ్రాస్ 8.50 కోట్ల రూపాయలు అని ట్రేడ్ టాక్.
తొలి రోజే 25 శాతం రికవరీ
'కార్తికేయ 2' సినిమా తొలి రోజే బడ్జెట్ లో 25 శాతం రికవరీ చేసినట్లు యూనిట్ సన్నిహిత వర్గాల నుంచి అందించిన సమాచారం. ఈ వారం విడుదలైన మరో రెండు సినిమాలకు నెగిటివ్ టాక్ రావడంతో నిఖిల్ సినిమాకు హెల్ప్ అవుతోంది. శనివారం రాత్రి కొన్ని ఏరియాల్లో ఎక్స్ట్రా స్క్రీన్లు, థియేటర్లు యాడ్ చేశారట. సో, ఈ సినిమా శనివారం విడుదలైనా... ఆదివారం, సోమవారం (ఇండిపెండెన్స్ డే హాలిడే) సెలవులు కావడంతో మొదటి మూడు రోజుల్లో మంచి వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది.
చందూ మొండేటి (Chandoo Mondeti) 'కార్తికేయ 2'లో నిఖిల్ సరసన అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) కథానాయికగా నటించారు. శ్రీనివాస రెడ్డి (Srinivasa Reddy) 'వైవా' హర్ష చెముడు (Harsha Chemudu) హీరో హీరోయిన్లతో పాటు ట్రావెల్ చేసే పాత్రలలో కనిపించారు. ఆదిత్యా మీనన్, తులసి, ప్రవీణ్, సత్య తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.
Also Read : కార్తికేయ 2 రివ్యూ : ద్వారకా నగరం - శ్రీకృష్ణుడు దాచిన రహస్యం - నిఖిల్ సినిమా ఎలా ఉందంటే?
ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించారు. తెలుగుతో పాటు హిందీలోనూ విడుదల చేశారు. ఉత్తరాది ప్రేక్షకుల నుంచి కూడా సినిమాకు మంచి స్పందన లభిస్తోంది.
Also Read : హాలీవుడ్ హీరోలతో పోటీ - ఎన్టీఆర్‌కు ఆస్కార్?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)