Prabhas: ‘కే’క పెట్టించే కాంబినేషన్.. సెట్స్ పైకి వచ్చేసింది.. డార్లింగ్ స్పీడు తగ్గేదేలే!
ప్రభాస్ తన కొత్త సినిమాను సెట్స్ మీదకు తెచ్చేశాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ప్రాజెక్ట్ కే షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభం అయింది.
ప్రభాస్ ఇటీవలే ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్’ షూటింగ్‌ను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. వెంటనే కొద్ది పాటి గ్యాప్‌తోనే ప్రాజెక్ట్ కే షూటింగ్‌ను కూడా ప్రారంభించాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శనివారం హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. ఈ విషయాన్ని ప్రాజెక్ట్ కే టీం అధికారికంగా ప్రకటించింది. ప్రభాస్‌తో పాటు హీరోయిన్ దీపికా పడుకోన్ కూడా ఈ షూటింగ్‌లో పాల్గొంది. ప్రపంచంలోనే అతి పెద్ద కెమెరాతో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నట్లు టీం ట్వీటర్‌తో తెలిపింది.
‘ఎవడే సుబ్రమణ్యం’, ‘మహానటి’ ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వేర్వేరు ఇండస్ట్రీల నుంచి ప్రముఖ నటులను ఇందులో మిగతా పాత్రలకు తీసుకోనున్నారు. ఒక్కసారి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తే అప్‌డేట్స్ ఇస్తూనే ఉంటామని దర్శకుడు నాగ్ అశ్విన్ గతంలోనే తెలిపారు.
ప్రస్తుతం దేశంలోనే ప్రభాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్‌గా ఉన్నారు. ఏ హీరోకీ లేనంత మార్కెట్, ఏ హీరోకి లేనంత బడ్జెట్, పారితోషికం ప్రభాస్‌ను వెతుక్కుంటూ వస్తున్నాయి. రాధేశ్యామ్ 2022 జనవరి 14వ తేదీన విడుదల కానుంది. సలార్ 2022 ఏప్రిల్ 14వ తేదీన విడుదల కావాల్సి ఉండగా.. దాన్ని వాయిదా వేశారు. ఆదిపురుష్ 2022 ఆగస్టు 11వ తేదీన ఇండిపెండెన్స్ డే వీకెండ్ స్పెషల్‌గా రానుంది. సలార్ 2022లోనే వస్తుందా.. 2023కు వెళుతుందా అనే విషయం తెలియరాలేదు.
దీన్ని బట్టి చూస్తే.. 2022లో రెండు సినిమాలు, 2023లో రెండు సినిమాలను ప్రభాస్ విడుదల చేసే అవకాశం ఉంది. అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమాను ఇప్పటికే ప్రకటించారు. బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఒక అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమాలో ప్రభాస్ నటించనున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి.
సాహో ఆడియో రిలీజ్ ఫంక్షన్‌లో సంవత్సరానికి రెండు సినిమాల్లో నటిస్తానని ప్రభాస్ ఫ్యాన్స్‌కి మాటిచ్చారు. 2022 నుంచి 2024 వరకు ప్రభాస్ ఈ మాటను నిలబెట్టుకునే అవకాశం ఉంది. అది కూడా చుట్టేస్తున్నట్లు కాకుండా తన స్థాయికి తగ్గ కథలనే ప్రభాస్ ఎంచుకుంటూ ఉండటం అభిమానుల్లో జోష్‌ను నింపుతుంది.
Also Read: 'పుష్ప' బిజినెస్.. రూ.250 కోట్లకు పైమాటే..
Also Read: 'సుడిగాలి' సుధీర్‌కు ఓ షో పోయింది! మరో షోలో మాత్రం...
Also Read: ఫన్నీ వీడియో: బ్రహ్మీతో ‘ఊ అంటావా..’ స్పూఫ్ సాంగ్.. దేవీశ్రీ ప్రసాద్ స్పందన ఇది!
Also Read: ప్రేక్షకులు థియేటర్లకు రావడం కోసమే ఎన్టీఆర్, చరణ్! ఆ తర్వాత... - రాజమౌళి ఏమన్నారంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి