News
News
X

Prabhas: హాస్పిటల్‌లో ప్రభాస్ - అసలేమైంది?

ప్రభాస్ హాస్పిటల్ లో నడుస్తూ వెళ్తోన్న ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

FOLLOW US: 

గ్లోబల్ స్టార్ ప్రభాస్(Prabhas)కి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ప్రభాస్ హాస్పిటల్ లో నడిచి వెళ్తున్నట్లుగా కనిపించారు. ఈ వీడియోను చూసిన అభిమానులు ప్రభాస్ కి ఏమైందంటూ కామెంట్స్ చేస్తున్నారు. 'బాహుబలి' సినిమా సమయంలో ప్రభాస్ కాలికి గాయమైనట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. దానికోసం ఆయన యూరప్ కి వెళ్లి సర్జరీ కూడా చేయించుకున్నారని సమాచారం. 

ఇప్పుడు మళ్లీ అదే గాయం ఆయన్ని ఇబ్బంది పెడుతుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ ఇందులో నిజమెంత అనేది క్లారిటీ లేదు. వరుస షూటింగ్స్ లో పాల్గొనడంతో ప్రభాస్ ఆరోగ్యం పాడై ఉంటుందా..? అని అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఫ్యాన్స్ మాత్రం కృష్ణంరాజు ఆరోగ్యం బాలేకపోవడంతో హాస్పిటల్ లో ఉంచారని.. ఆయన్ను చూడడానికి ప్రభాస్ వెళ్లి ఉంటారని అంటున్నారు. ఇలా సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. 

ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే.. 'ఆదిపురుష్' సినిమాను పూర్తి చేసిన ఆయన ఇప్పుడు 'సలార్', 'ప్రాజెక్ట్ K' సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. మధ్యలో 'సాహో', 'రాధేశ్యామ్' రూపంలో పెద్ద ప్లాప్స్ వచ్చినా.. ప్రభాస్ రేంజ్ మాత్రం తగ్గలేదు. ఆయన నటిస్తోన్న సినిమాల గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాగశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ప్రాజెక్ట్ K'లో దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటిస్తోంది.

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తున్నారు. అశ్వనీదత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మధ్యకాలంలో భారీ బడ్జెట్ సినిమాలను రెండేసి భాగాలుగా చిత్రీకరించి రిలీజ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు 'ప్రాజెక్ట్ K' కూడా అదే రూట్ లో నడవనుంది. కథ పరంగా చూసుకుంటే ఈ సినిమా స్పాన్ చాలా ఎక్కువ. అందుకే పార్ట్ 2 తీయాలని భావిస్తున్నారట దర్శకనిర్మాతలు. ఈ విషయాన్ని 'ప్రాజెక్ట్ K' పతాక సన్నివేశాల్లో చెప్పబోతున్నారట. 

ఈ సినిమాలో ప్రభాస్ సూపర్ హీరోగా కనిపిస్తారని సమాచారం. 'ఆదిపురుష్'లో శ్రీరాముడిగా కనిపించనున్న ప్రభాస్ 'ప్రాజెక్ట్ K' కోసం సూపర్ హీరో అవతారమెత్తనున్నారు. ఈ విషయాన్ని పరోక్షంగా వెల్లడించింది చిత్రబృందం. ప్రభాస్ పుట్టినరోజు నాడు సూపర్ హీరో అని మెన్షన్ చేస్తూ అతడికి విషెస్ చెప్పింది. 'ప్రాజెక్ట్ K' ఇండియన్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లబోతుందని నిర్మాత అశ్వనీదత్ రీసెంట్ గా చెప్పారు. డిసెంబర్ నాటికి షూటింగ్ పూర్తవుతుందని.. 9 నెలలు గ్రాఫిక్స్ కోసం కేటాయించామని తెలిపారు. హాలీవుడ్ అవెంజర్స్ రేంజ్ లో 'ప్రాజెక్ట్ K' ఉంటుందని అన్నారు. ఈ సినిమాతో చైనా, అమెరికా మార్కెట్ ని టార్గెట్ చేస్తామని చెప్పుకొచ్చారు.

Also Read : టాక్‌తో సంబంధం లేకుండా 'బ్రహ్మాస్త్ర' కలెక్షన్స్ - తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్స్

Also Read : 'ఒకే ఒక జీవితం' రివ్యూ : టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ & మదర్ సెంటిమెంట్ శర్వాకు హిట్ ఇచ్చాయా?

Published at : 10 Sep 2022 06:12 PM (IST) Tags: Project K Salaar Adipurush Prabhas Prabhas hospital video

సంబంధిత కథనాలు

JD Lakshmi Narayana : నటుడిగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ, సినిమాల్లో తొలి అడుగు

JD Lakshmi Narayana : నటుడిగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ, సినిమాల్లో తొలి అడుగు

SSMB28: మహేష్, త్రివిక్రమ్ సినిమా - ప్రచారంలో కొత్త టైటిల్స్!

SSMB28: మహేష్, త్రివిక్రమ్ సినిమా - ప్రచారంలో కొత్త టైటిల్స్!

NBK107: దసరా స్పెషల్ - బాలయ్య సినిమా టైటిల్ అనౌన్స్మెంట్!

NBK107: దసరా స్పెషల్ - బాలయ్య సినిమా టైటిల్ అనౌన్స్మెంట్!

Hanuman Teaser: రాముడి కోసం ‘హనుమాన్’ వెనక్కి - రిలీజ్‌లనే కాదు టీజర్లనూ వాయిదా వేస్తారా?

Hanuman Teaser: రాముడి కోసం ‘హనుమాన్’ వెనక్కి - రిలీజ్‌లనే కాదు టీజర్లనూ వాయిదా వేస్తారా?

Allari Naresh: అల్లరి నరేష్ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ రిలీజ్ డేట్ ఫిక్స్!

Allari Naresh: అల్లరి నరేష్ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’  రిలీజ్ డేట్ ఫిక్స్!

టాప్ స్టోరీస్

TRS MP Santosh Issue : ఎంపీ సంతోష్ రావు కనిపించడం లేదని సిరిసిల్లలో కంప్లైంట్ - అసలేం జరిగిందంటే ?

TRS MP Santosh Issue :  ఎంపీ సంతోష్ రావు కనిపించడం లేదని సిరిసిల్లలో కంప్లైంట్ -  అసలేం జరిగిందంటే ?

Krishnam Raju : మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సభ, ప్రభాస్ ను చూసేందుకు భారీగా తరలివచ్చిన ఫ్యాన్స్

Krishnam Raju : మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సభ, ప్రభాస్ ను చూసేందుకు భారీగా తరలివచ్చిన ఫ్యాన్స్

Airbags Mandatory: కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉండాల్సిందే, ఈ రూల్ వర్తించేది అప్పటి నుంచే

Airbags Mandatory: కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉండాల్సిందే, ఈ రూల్ వర్తించేది అప్పటి నుంచే

Jasprit Bumrah Ruled Out: అయ్యో బుమ్రా - నువ్వు కూడానా - టీమిండియాకు పెద్ద షాక్!

Jasprit Bumrah Ruled Out: అయ్యో బుమ్రా - నువ్వు కూడానా - టీమిండియాకు పెద్ద షాక్!