![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
PSPK28 First Look: బ్లాక్ బాస్టర్ కాంబినేషన్.. పవర్ స్టార్ 'భవదీయుడు భగత్ సింగ్' ఫస్ట్ లుక్ అదిరిందిగా
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్ అంటే ఫ్యాన్స్ కి పండగే పండగ. గబ్బర్ సింగ్ లాంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత వీరిద్దరూ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
![PSPK28 First Look: బ్లాక్ బాస్టర్ కాంబినేషన్.. పవర్ స్టార్ 'భవదీయుడు భగత్ సింగ్' ఫస్ట్ లుక్ అదిరిందిగా power star pawan kalyan bhavadeeyudu bhagat singh first look released PSPK28 First Look: బ్లాక్ బాస్టర్ కాంబినేషన్.. పవర్ స్టార్ 'భవదీయుడు భగత్ సింగ్' ఫస్ట్ లుక్ అదిరిందిగా](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/09/da271ed2b6359fcc901c68d814894fd3_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్లో మూవీ వస్తుందని ఎప్పటినుంచో.. వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. గబ్బర్ సింగ్ లాంటి సినిమాను మరోసారి తీయాలి అంటూ.. పవన్ ఫ్యాన్స్ హరీశ్ శంకర్ కు రిక్వెస్ట్ లు పెడుతుంటారు. ఇప్పుడు ఆ కల నెరవేరింది. పవన్, హరీశ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ‘PSPK 28’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన పవర్ ప్యాక్డ్ అప్డేట్ అంటూ నిన్నటి నుంచే ఫ్యాన్స్ ను మేకర్స్ ఊరించారు. ఈరోజు సినిమా అప్ డేట్ రానే వచ్చింది.
తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్, టైటిల్ ను రివీల్ చేస్తూ పోస్టర్ వదిలారు. “భవదీయుడు భగత్ సింగ్” అనే టైటిల్ ను ఖరారు చేస్తూ విడుదల చేసిన పోస్టర్ లో పవన్ కల్యాణ్ స్టైలిష్ గా కన్పిస్తున్నారు. ప్రీ లుక్, ప్రీ పోస్టర్లతో ఇప్పటికే హల్ చల్ చేసేశారు. పవన్ బర్త్ డే రోజు అదిరిపోయే అప్డేట్ ఇస్తారని అంతా భావించారు. టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ విడుదల చేస్తారని అభిమానులు అనుకున్నారు.
We all need your …
— Harish Shankar .S (@harish2you) September 9, 2021
Blessings & Best wishes…. 🙏🙏@PawanKalyan @ThisIsDSP @DoP_Bose #AnandSai @MythriOfficial @venupro
Let’s rock again….. #BhavadeeyuduBhagatSingh pic.twitter.com/T5reLKI5P9
భవదీయుడు భగత్ సింగ్ అంటూ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ విడుదలచేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. భగత్ సింగ్ అంటే తనకు చాలా ఇష్టమని పవన్ ఇది వరకు ఎన్నో సార్లు చెప్పారు. అలాంటిది ఏకంగా భవదీయుడు భగత్ సింగ్ అంటూ టైటిల్ పెట్టడం చూస్తే.. ఈ సారి పవన్ కల్యాణ్ ను హరీష్ శంకర్ వేరే లెవెల్‌లో చూపించేందుకు రెడీ అవుతున్నట్టు అర్థమవుతోంది.
ఇండియా గేట్ ముందు స్పోర్ట్స్ బైక్ మీద కూర్చుని పవన్ ఒక చేతిలో టీ, మరో చేతిలో మెగాఫోన్ తో కన్పించిన లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. దర్శకుడు హరీష్ శంకర్ ఫస్ట్ లుక్ తోనే మెగాభిమానుల మనసు దోచేసుకున్నాడు.
Ekdam first class…Apt title for the Powerful image of shri @PawanKalyan garu…I can see your love for the language dear @harish2you garu
— RamajogaiahSastry (@ramjowrites) September 9, 2021
Wishing the very best to you and team @MythriOfficial 👍👍👍 https://t.co/aSfJXN5kGK
Also Read: Ravi Teja: ఈడీ విచారణకు హాజరైన హీరో రవితేజ.. బ్యాంక్ లావాదేవీలపై ఆరా
Also Read: Bigg Boss 5 Telugu : కూతురు బతికుండగానే శ్మశానం బుక్ చేశా.. ఎమోషనల్ అయిన ప్రియా..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)