అన్వేషించండి

Ravi Teja: ఈడీ విచారణకు హాజరైన హీరో రవితేజ.. బ్యాంక్ లావాదేవీలపై ఆరా

టాలీవుడ్ డ్రగ్ కేసులో ఈ రోజు నటుడు రవితేజను ఈడీ విచారిస్తోంది. కెల్విన్ ఇచ్చిన సమాచారంతో ఈడీ ప్రశ్నల వర్షం కురిపించే అవకాశాలున్నాయి.

ఈడీ విచారణలో భాగంగా టాలీవుడ్ సెలబ్రిటీలను ఈడీ విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హీరో రవితేజ గురువారం ఈడీ ముందుకు హజరయ్యాడు. బుధవారం నటుడు రానాను ఈడీ సుమారు ఏడు గంటల సేపు విచారించింది. రానా బ్యాంక్ లావాదేవీలను పరిశీలించింది. ఈ రోజు రవితేజ బ్యాంక్ లావాదేవీలను కూడా ఈడీ పరిశీలించనుంది. మరోవైపు కెల్విన్‌ను కూడా ఈడీ మరోసారి విచారించే అవకాశాలున్నాయి. 
 
డ్రగ్స్ కేసుకి సంబంధించి మంగళవారం కెల్విన్, కుదూస్‌లను ఈడీ అధికారులు ఏడు గంటలకు పైగా విచారించారు. 2017లో టాలీవుడ్ డ్రగ్స్ కేసులో 30 మందికి పైగా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అందులో కీలకంగా కెల్విన్, వహీద్, ఖుద్దూస్, జీషాన్‌లను గతంలోనే విచారించి వారి బ్యాంక్ ఖాతాలను ఈడీ పరిశీలించింది. విదేశాలకు భారీగా డబ్బు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. సెలబ్రిటీల బ్యాంక్ ఖాతాల నుంచి కెల్విన్, ఖుధూస్, వహీద్, జీషాన్ అకౌంట్లకు నగదు బదిలీ జరిగినట్లు తేలింది. మంగళవారం నటుడు నందును విచారిస్తున్న సమయంలోనే ఈడీ అధికారులు కెల్విన్‌ను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం రానా విచారణలో కీలక పరిణామాలు చోటుచేసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెల్విన్ ఇచ్చే సమాచారం ఆధారంగానే రానాను ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈడీ చేతిలో కెల్విన్ కాల్ డేటా ఉంది. గురవారం రవితేజను ఈడీ విచారించనుంది. ఈ కేసుతో రానాకు సంబంధం ఉందా లేదా అనేది ఈడీ విచారణ తర్వాతే తేలనుంది. 

ఆ పార్టీ.. కొంపముంచిందా?: 2016లో హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో నటుడు నవదీప్ పార్టనర్‌గా ప్రారంభించిన ‘ఎఫ్-క్లబ్’ చూట్టూ ఈ డర్టీ పిక్చర్ కథ నడుస్తోంది. ఆ రోజు నవదీప్ ఆహ్వానం మేరకు ఆ క్లబ్‌లో పార్టీకి హాజరైన తారలే ఎక్సైజ్ అధికారుల విచారణను ఎదుర్కొన్నారు. తాజాగా ఈడీ విచారణకు సైతం హాజరువుతున్నారు. ఆ పార్టీలో డ్రగ్స్ అక్రమ సరఫరా నిందితుడు కాల్విన్ మస్కరేన్హాస్ సినీ ప్రముఖులను కలిశాడని తెలిసింది. అతడి వద్ద కొందరు డ్రగ్స్ కొనుగోలు చేసి సరఫరా చేసినట్లు సమాచారం. ఈ విషయం బయటకు పొక్కడంతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) 12 మంది సినీ ప్రముఖులను విచారించింది. ఆ క్లబ్ ద్వారా భారీ ఎత్తున డ్రగ్స్ సరఫరా జరిగినట్లు అనుమానం. ఈ నేపథ్యంలో అధికారులు క్లబ్‌ను సీల్ చేశారు. విచారణలో భాగంగా ఎఫ్ క్లబ్‌లోని సీసీటీవీ కెమేరా వీడియోలను కూడా పరిశీలిస్తున్నారు. 

వీరిలో పూరీ జగన్నాథ్, చార్మి, రవితేజ, సుబ్బరాజు, ముమైత్ ఖాన్, నవదీప్ తదితరులు ఉన్నారు. విచారణలో భాగంగా అధికారులు వారి గోళ్లు, రక్తం, వెంట్రుకలు తదితర శాంపిళ్లు సేకరించి పరీక్షలకు పంపారు. ఈ కేసు విచారణ సుమారు రెండేళ్లు సాగింది. అయితే, ఈ విచారణకు హజరైన సినీ ప్రముఖుల పేర్లు చార్జిషీట్‌లో నమోదు చేయలేదు. పైగా ఈ డ్రగ్స్ కేసును ఎదుర్కొంటున్న 62 మంది బాధితులని పేర్కొనడంతో రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. మనీ లాండరింగ్ చట్టం కింద మరోసారి డ్రగ్స్ కేసును విచారణ మొదలుపెట్టింది. ఈ సందర్భంగా ఈడీ 12 మందికి నోటీసులు పంపింది. అయితే అప్పట్లో సిట్ విచారణలో లేని రకుల్ ప్రీత్, రాణాలను ఈసారి ఈడీ విచారిస్తోంది. గతేడాది బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(NCB) విచారణకు హాజరైంది. ఆమెతోపాటు బాలీవుడు నటులు దీపికా పదుకొనే, రకుల్ ప్రీత్ సింగ్, సారా అలి ఖాన్, శ్రద్ధా కపూర్, అర్జున్ కపూర్లను కూడా ఎన్‌సీబీ విచారించింది.  
  
కెల్విన్ ఏం చెప్పాడు?: కెల్విన్ అప్రూవర్‌గా మారడంతో ఈడీ పని సులభమైంది. గతంలో ఎక్సైజ్ శాఖ కూడా కెల్విన్‌ను విచారించింది. కానీ, అప్పట్లో ఏ వివరాలు కెల్విన్ చెప్పలేదు. ఎక్సైజ్ శాఖ డ్రగ్స్ కేసు ఆధారంగా ఈడీ ఆరు నెలల కిందట కెల్విన్ మీద కేసు నమోదు చేసింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఈడీ అతడిని 12 సార్లు ప్రశ్నించారు. అతడి అకౌంట్లను ఫ్రీజ్ చేయడంతో అప్రూవర్‌గా మారాడు. ఈ సందర్భంగా ఈడీకి పలు కీలక వివరాలను అందించాడు. వాటి ఆధారంగానే ఈడీ తాజాగా 12 మందికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ కొనుగోలులో భాగంగా విదేశాలకు భారీగా నగదు బదిలీ జరిగినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖుల అకౌంట్లను ఈడీ పరిశీలిస్తోంది.   

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Telugu 10 : టాప్ ట్రెండింగ్‌లో బిగ్ బాస్ తెలుగు 10 - టాలీవుడ్ ఎంటర్టైన్మెంట్‌లో ఫస్ట్ ప్లేస్
టాప్ ట్రెండింగ్‌లో బిగ్ బాస్ తెలుగు 10 - టాలీవుడ్ ఎంటర్టైన్మెంట్‌లో ఫస్ట్ ప్లేస్
Podarillu Serial Today Sep 14th: మాధవ్‌ పెళ్లి చెడగొట్టడానికి తమ్ముళ్ల ప్రయత్నాలు... నారాయణ ప్లాన్‌కు అడ్డుపడిన గాయత్రి
పొదరిల్లు: మాధవ్‌ పెళ్లి చెడగొట్టడానికి తమ్ముళ్ల ప్రయత్నాలు... నారాయణ ప్లాన్‌కు అడ్డుపడిన గాయత్రి
Nuvvu leka Neanu Lenu Serial Today Sep14th:దమయంతికి స్ట్రాంగ్‌ వార్నింగ్ ఇచ్చిన రామలింగం...రాధ, విక్కీలది దొంగ పెళ్లని రామచంద్రానికి తెలిసిపోయిందా...?
నువ్వులేక నేను లేను: దమయంతికి స్ట్రాంగ్‌ వార్నింగ్ ఇచ్చిన రామలింగం...రాధ, విక్కీలది దొంగ పెళ్లని రామచంద్రానికి తెలిసిపోయిందా...?
This Week OTT Movies : వినాయక చవితి స్పెషల్ వీక్... ఒకే రోజు 10 మూవీస్ స్ట్రీమింగ్ - ఈ వారం ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే
వినాయక చవితి స్పెషల్ వీక్... ఒకే రోజు 10 మూవీస్ స్ట్రీమింగ్ - ఈ వారం ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: అల్వాల్‌లో ఇంటర్ విద్యార్థినిపై 8 మంది అత్యాచారం.. మత్తు ఇచ్చి దారుణాలు- POCSO కేసు నమోదు
అల్వాల్‌లో ఇంటర్ విద్యార్థినిపై 8 మంది అత్యాచారం.. మత్తు ఇచ్చి దారుణాలు- POCSO కేసు నమోదు
Andhra Pradesh Rains: ఏపీలో 12 జిల్లాల్లో విస్తారంగా వర్షాలు.. పిడుగులు పడతాయని, అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్!
ఏపీలో 12 జిల్లాల్లో విస్తారంగా వర్షాలు.. పిడుగులు పడతాయని, అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్!
Rashmika Mandanna : బేబీ బంప్‌తో రష్మిక లుక్... భర్త విజయ్‌కు హగ్ - రణబాలి సెట్‌లో క్యూట్ మూమెంట్
బేబీ బంప్‌తో రష్మిక లుక్... భర్త విజయ్‌కు హగ్ - రణబాలి సెట్‌లో క్యూట్ మూమెంట్
Konda Surekha: పదవి నుంచి తొలగించినందుకు బాధగా లేదు, మళ్లీ మంత్రిని అవుతాను: కొండా సురేఖ ధీమా
పదవి నుంచి తొలగించినందుకు బాధగా లేదు, మళ్లీ మంత్రిని అవుతాను: కొండా సురేఖ ధీమా
Kagaznagar Crime News: ఐదేళ్ల చిన్నారిపై మేనమామ అత్యాచారం, కాగజ్‌నగర్‌లో ఉద్రిక్తత- నిందితుడి అరెస్ట్
ఐదేళ్ల చిన్నారిపై మేనమామ అత్యాచారం, కాగజ్‌నగర్‌లో ఉద్రిక్తత- నిందితుడి అరెస్ట్
Buses To Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్, బాలాపూర్‌ గణేష్ దర్శనానికి RTC ప్రత్యేక బస్సులు
ఖైరతాబాద్ గణేష్, బాలాపూర్‌ గణేష్ దర్శనానికి RTC ప్రత్యేక బస్సులు
AP TET Results: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డ్ ఇలా డౌన్ లోడ్ చేసుకోండి
ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డ్ ఇలా డౌన్ లోడ్ చేసుకోండి
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: బ్లాక్‌ కీ దక్కించుకొని పవర్ పోగొట్టుకుందెవరు? ఎలిమినేషన్ జరిగిందా! రేపటి నుంచి రెండో అవతారం!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: బ్లాక్‌ కీ దక్కించుకొని పవర్ పోగొట్టుకుందెవరు? ఎలిమినేషన్ జరిగిందా! రేపటి నుంచి రెండో అవతారం!
Embed widget