Lokesh Kanagaraj DC : హీరోగా లోకేశ్ కనగరాజ్ - రొమాంటిక్ యాక్షన్ డ్రామా DC సెన్సార్ రివ్యూ... న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
DC Release Date : కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న మూవీ DC. తాజాగా ఈ వయలెంట్ యాక్షన్ డ్రామా సెన్సార్ పనులు పూర్తయ్యాయి.

Lokesh Kanagaraj's Action Thriller DC Censor Review : కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ రొమాంటిక్ యాక్షన్ వయలెంట్ థ్రిల్లర్ 'DC'తో హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. మాస్ లుక్‌లో లోకేశ్ అదరగొట్టగా... సినిమాలో వయలెన్స్ కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తయ్యాయి.
వయలెంట్ మూవీ సెన్సార్ రివ్యూ
రొమాంటిక్ యాక్షన్ డ్రామా 'DC'కు సెన్సార్ బోర్డు 'A' సర్టిఫికెట్ ఇష్యూ చేసింది. అంటే ఈ సినిమా పెద్దలకు మాత్రమే. యాక్షన్, వయలెన్స్‌తో పాటు రొమాంటిక్ అంశాలు కూడా ఎక్కువగానే ఉన్నట్లు సమాచారం. దీంతో పాటే కొత్త రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. జులై 31నే సినిమా రిలీజ్ అవుతుందని భావించినా... ఆగస్ట్ 7కి వాయిదా వేశారు. ఫస్ట్ గ్లింప్స్‌తోనే స్టోరీపై ఇంట్రెస్ట్ క్రియేట్ కాగా... స్టోరీపై మరింత అంచనాలు నెలకొన్నాయి.
Also Read : Ragini 3 : బోల్డ్ హారర్ థ్రిల్లర్‌లో మిల్కీ బ్యూటీ - ఫస్ట్ డే షూటింగ్... 12 ఏళ్ల తర్వాత...
ఈ మూవీలో లోకేశ్ సరసన వామికా గబ్బీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. దేవదాస్ పాత్రలో మాస్ లుక్‌లో లోకేశ్ కనిపిస్తుండగా... చంద్ర పాత్రలో వామికా కనిపించనున్నారు. సంజన ఏకే పార్వతిగా నటిస్తున్నారు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తుండగా... సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు.
#DC is certified 'A' 🔥
— Sun Pictures (@sunpictures) July 16, 2026
Releasing in theatres worldwide from August 7 ! @Dir_Lokesh @ArunMatheswaran @anirudhofficial #WamiqaGabbi @isanjkayy @mukesh_DOP #PrasannaGK #KannanS @PC_stunts @kabilanchelliah @kuchirayar73 #DCFromAugust7 pic.twitter.com/BzqbZNZEu6
Also Read : Fauzi Release Date: ఫౌజీ రిలీజ్ డేట్... డిసెంబర్‌లో థియేటర్లలోకి ప్రభాస్ సినిమా
ట్రెండింగ్ వార్తలు























