TG Vishwa Prasad: నెలకో సినిమా చొప్పున ఈ ఏడాది 15 సినిమాలు రిలీజ్ చేస్తాం: నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్
నెలకో సినిమా చొప్పున ఈ ఏడాది 15 చిత్రాలను విడుదల చేయబోతున్నట్లు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ వెల్లడించారు. ఈ ఏడాది 50 సినిమాల మైల్ స్టోన్ అందుకోబోతున్నట్లు తెలిపారు.
Eagle movie producer TG Vishwa Prasad Interview: వరుస సినిమాలతో మంచి జోష్ లో ఉన్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ ఏడాది మరింత జోరు పెంచింది. 2024లో ఏకంగా 15 సినిమాలు విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. ఈ సినిమాల్లో కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉండగా, దాదాపు 6 సినిమాలు నిర్మాణ దశలో ఉన్నట్లు వెల్లడించింది. ఇవి కాకుండా ఈటీవీ విన్ ఓటీటీ కోసం మరికొన్ని చిత్రాలు నిర్మాణం అవుతున్నట్లు తెలిపింది. దాదాపు నాలుగు సినిమాలు అమెరికాలో చేస్తున్నట్లు వెల్లడించారు. తమ సంస్థ నుంచి ప్రతి నెలకో సినిమా విడుదలకానుందని, ఈ ఏడాది 50 చిత్రాల మైలు రాయిని అందుకుంటామని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ తెలిపారు.
ఫిబ్రవరి 9న ‘ఈగల్’ ప్రపంచ వ్యాప్తంగా విడుదల
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం మీద నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తాజా చిత్రం ‘ఈగల్’. మాస్ మహారాజా రవితేజ హీరోగా యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. కార్తీక్ ఘట్టమనేని ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు మంచి స్పందన లభించింది. ఫిబ్రవరి 9న ‘ఈగల్’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ 'ఈగల్' మూవీకి సంబంధించిన కీలక విషయాలు వెల్లడించారు.
‘ఈగల్’ క్లాసిక్ స్టయిలీష్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్: విశ్వప్రసాద్
తమ సంస్థ నుంచి రవితేజ హీరోగా వచ్చిన 'ధమాకా' మాస్ ఎంటర్ టైనర్ ఐతే, ‘ఈగల్’ క్లాసిక్ స్టయిలీష్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందినట్లు విశ్వ ప్రసాద్ తెలిపారు. ‘ఈగల్’ కంటెంట్ అద్భుతంగా వుంటుందన్నారు. ఆడియన్స్ ని అలరించే చాలా మంచి ఎలిమెంట్స్ వున్నాయన్నారు. కచ్చితంగా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని చెప్పారు. రవితేజ ఈ చిత్రంలో కొత్తగా కనిపించబోతున్నట్లు చెప్పిన ఆయన, కథ, మెసేజ్, యాక్షన్, సాంగ్స్ అన్నీ ప్రేక్షకులను అలరిస్తాయన్నారు. రవితేజతో తమకు ఉన్న మంచి రిలేషన్ షిప్ కారణంగానే ఆయనతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నట్లు చెప్పారు. అటు దర్శకుడు కార్తిక్ ఘట్టమనేనితో ఎప్పటి నుంచో తమ సంస్థకు మంచి అనుబంధం ఉందన్నారు. ‘ధమాకా’ టైమ్ లోనే ‘ఈగల్’ ప్రాజెక్టును ప్లాన్ చేసినట్లు చెప్పారు. తమ నిర్మాణంలో మరో సినిమా చేయబోతున్నట్లు తెలిపారు.
‘రాజాసాబ్’ రిలీజ్ ఎప్పుడనేది త్వరలో చెప్తాం: విశ్వప్రసాద్
ఇండస్ట్రీ మేలు కోసమే ‘ఈగల్’ రిలీజ్ ను వాయిదా వేసుకున్నట్లు విశ్వప్రసాద్ తెలిపారు. ట్రేడ్ విషయంలో అప్పుడు తాము సెకెండ్ ఉండగా, ఇప్పుడు నెంబర్ వన్ గా ఉన్నట్లు తెలిపారు మిగతా చిత్రాలు వేటి రీచ్ వాటికి ఉంటుందన్నారు. అటు ప్రభాస్ ‘రాజాసాబ్’ రిలీజ్ ఎప్పుడనేది త్వరలో చెప్తామన్నారు. ఇక తమకు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఓపెన్ చేసే ఆలోచనలేదని చెప్పిన ఆయన, ఓటీటీలకు కంటెంట్ ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తామని విశ్వప్రసాద్ తెలిపారు.
Read Also: నేహా శెట్టికి మరో ఆఫర్ - పవన్ కళ్యాణ్ దర్శకుడి కొత్త సినిమాలో!