Neha Shetty: నేహా శెట్టికి మరో ఆఫర్ - పవన్ కళ్యాణ్ దర్శకుడి కొత్త సినిమాలో!
Neha Shetty upcoming Telugu movies: 'డీజే టిల్లు' సినిమాతో తెలుగులో పాపులర్ అయిన హీరోయిన్ నేహా శెట్టి. ఇప్పుడు ఆమె మరో కొత్త సినిమాకు సంతకం చేశారు. పవన్ కళ్యాణ్ దర్శకుడి కొత్త సినిమా చేస్తున్నారు.
![Neha Shetty: నేహా శెట్టికి మరో ఆఫర్ - పవన్ కళ్యాణ్ దర్శకుడి కొత్త సినిమాలో! Neha Shetty signs Bellamkonda Srinivas Tyson Naidu movie Neha Shetty: నేహా శెట్టికి మరో ఆఫర్ - పవన్ కళ్యాణ్ దర్శకుడి కొత్త సినిమాలో!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/04/46fec387f6eeef8d83d73bc63999061b1707019462268313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Neha Shetty to romance Bellamkonda Sai Sreenivas in Tyson Naidu: 'డీజే టిల్లు' కంటే ముందు నేహా శెట్టి తెలుగులో సినిమాలు చేశారు. అయితే... అందులో రాధిక పాత్ర ఆమెను పాపులర్ చేసింది. ఆ తర్వాత 'బెదురులంక 2012', 'రూల్స్ రంజన్', 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాలు చేశారు. వాట్ నెక్స్ట్? అంటే... ఇప్పుడు ఓ కొత్త సినిమాకు సంతకం చేశారని తెలిసింది.
'టైసన్ నాయుడు'తో నేహా శెట్టి రొమాన్స్!
Tyson Naidu Telugu Movie: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న కొత్త సినిమా 'టైసన్ నాయుడు'. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట భారీ నిర్మాణ వ్యయంతో తెరకెక్కిస్తున్నారు. హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 10వ చిత్రమిది. ఇందులో ఆయనకు జోడీగా నటించే అవకాశం నేహా శెట్టిని వరించిందని తెలిసింది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు ఇంపార్టెన్స్ ఉండటంతో పాటు ఇంతకు ముందు తాను చేసిన పాత్రలకు భిన్నంగా ఉండటంతో కథ విన్న వెంటనే నేహా శెట్టి ఓకే చేశారట.
పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' తర్వాత!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'భీమ్లా నాయక్' గుర్తు ఉందిగా! సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు. ఆ సినిమా తర్వాత ఆయన తీస్తున్న సినిమా 'టైసన్ నాయుడు'. ఆయన దర్శకత్వంలో అటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ఇటు నేహా శెట్టి... ఇద్దరికీ మొదటి సినిమా ఇది.
Also Read: నాగలాపురం నాగమ్మగా లక్ష్మీ మంచు - ఐదు భాషల్లో ఫాంటసీ ఫిల్మ్!
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నుంచి ప్రేక్షకులు ఆశించే అంశాలతో సాగర్ కె చంద్ర 'టైసన్ నాయుడు'ను రూపొందిస్తున్నట్లు కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన గ్లింప్స్ చూస్తే అర్థం అవుతోంది. ''సార్... బాగా బలిసిన దున్నపోతు రంకెలు వేస్తూ మీ ముందుకు వచ్చింది. మీరు గాల్లో ఎగురుతూ ఒక బ్లైండ్ క్లిక్ ఇచ్చారు. అప్పుడు ఏం జరుగుతుంది?'' అని ఒకరు ప్రశ్నిస్తే... ''దున్నపోతు చచ్చిపోతుంది'' అని ట్రైనింగ్ ఇస్తున్న వ్యక్తి సమాధానం చెబుతారు. ఆ డైలాగ్ వైరల్ అయ్యేలా ఉంది.
Also Read: బ్రహ్మానందం కమెడియన్ కాదు... అంతకు మించి! హాస్య బ్రహ్మ నటనతో ఏడిపించిన పాత్రలు ఏవో తెలుసా?
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సాగర్ కె చంద్ర 'టైసన్ నాయుడు' సినిమాకు భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. విజయ్, వెంకట్, రియల్ సతీష్ మాస్టర్లు యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.
Also Read: స్టార్ హీరోలకు హిట్లు ఇచ్చిన బ్రహ్మానందం - ఆయన లేని ఈ సినిమాలను ఊహించుకోగలమా?
ఈ చిత్రానికి ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్: విజయ్ - వెంకట్ - 'రియల్' సతీష్, కళా దర్శకుడు: అవినాష్ కొల్లా, కిరణ్ కుమార్, ఛాయాగ్రహణం: ముకేశ్ గణేష్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: హరీష్ కట్టా, సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియో, నిర్మాణ సంస్థ: 14 రీల్స్ ప్లస్, నిర్మాతలు: రామ్ ఆచంట - గోపి ఆచంట, రచన - దర్శకత్వం: సాగర్ కె చంద్ర.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)