Unstoppable PSPK Episode 2 : బాలకృష్ణ ఫ్లాపులు - మెగా బ్రదర్స్ చర్చలు
'అన్‌స్టాపబుల్ 2'కి ఎండ్ కార్డ్ వేశారు. అతిథిగా వచ్చిన పవన్ కళ్యాణ్... బాలకృష్ణ వ్యక్తిత్వం గురించి గొప్పగా చెప్పారు. అంతే కాదు... ఆయన ఫ్లాపుల్లో ఉన్నప్పుడు తమ ఇంట్లో జరిగిన డిస్కషన్ బయటపెట్టారు.
![Unstoppable PSPK Episode 2 : బాలకృష్ణ ఫ్లాపులు - మెగా బ్రదర్స్ చర్చలు Pawan Kalyan reveals Mega Brothers discussion On Balakrishna Flops Unstoppable 2 PSPK Highlights Unstoppable PSPK Episode 2 : బాలకృష్ణ ఫ్లాపులు - మెగా బ్రదర్స్ చర్చలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/09/f7fc44069859c5f658283cdd554714821675967324814313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ప్రతి కథానాయకుడు, నటుడు... తన ప్రయాణంలో జయాపజయాలు చూడటం సహజమే. ఫ్లాపులు ప్రతి ఒక్కరికీ ఎదురు అవుతాయి. నటుడి కష్టం విలువ తెలుసు కాబట్టి ఎవరికీ ఫ్లాపులు రావాలని తాను గానీ, తన సోదరులు గానీ కోరుకోమని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పేర్కొన్నారు.
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హోస్ట్ చేస్తున్న 'ఆహా' ఓటీటీ ఎక్స్‌క్లూజివ్ టాక్ షో 'అన్‌స్టాపబుల్' సెకండ్ సీజన్ ఫైనల్ ఎపిసోడ్‌కు పవన్ కళ్యాణ్ అతిథిగా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఎపిసోడ్ రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండో పార్ట్ గురువారం రాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అందులో బాలకృష్ణ వ్యక్తిత్వం గురించి పవన్ కళ్యాణ్ గొప్పగా చెప్పారు. అంతే కాదు... ఆయన ఫ్లాపుల్లో ఉన్నప్పుడు తమ ఇంట్లో జరిగిన డిస్కషన్ కూడా ఆయన బయట పెట్టారు.
బాలకృష్ణకు విజయాలు రావాలని...
సినిమా అనేది ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలగజేసేదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఎవరు నటించినా... తాము అందరి సినిమాలు బావుండాలని కోరుకుంటామని చెప్పారు. 'అన్‌స్టాపబుల్ 2' ముగింపు సందర్భంగా తమ ఇంట్లో అందరం బాలకృష్ణ గారికి విజయాలు రావాలని కోరుకున్నట్లు తెలిపారు. ఒకానొక సమయంలో బాలకృష్ణ మీద నాగబాబు చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. సమయం, సందర్భం బట్టి కొన్నిసార్లు ఆ విధంగా మాట్లాడి ఉండొచ్చు. అయితే, ఈ షోలో పవన్ కళ్యాణ్ చెప్పిన వివరాల ప్రకారం బాలకృష్ణకు విజయాలు రావాలని నాగబాబు కోరుకున్నారు.
సాటి నటుడి కష్టాలు తెలుసు - పవన్
Unstoppable PSPK Episode 2 Highlights : ''ఇప్పటి వరకు ఇది ఎవరికీ తెలియదు. ఒక సీజన్, సమయంలో మీ (బాలకృష్ణ) సినిమాలు సరిగా ఆడనప్పుడు మా ఇంట్లో మేం కోరుకున్నాం అంటే... బాలకృష్ణ గారి సినిమాలు మంచి హిట్స్ అవ్వాలని! మా నాగబాబుతో సహా మేమంతా అదే కోరుకున్నాం. అసలు, ఈ అంశాన్ని మా నాగబాబు ఎత్తాడు... 'ఆయన సినిమాలు బాగా హిట్ అవ్వాలిరా' అని! మేమంతా నటన నుంచి వచ్చినవాళ్ళం, ఆ వాతావరణంలో పెరిగిన వాళ్ళం కాబట్టి సాటి నటుడి తాలూకూ కష్టాలు, జయాలు, అపజయాలు సమానంగా తీసుకోగలం! అందుకే, మాకు లోపల ఎవరి మధ్య పోటీతత్వం ఉంటుంది తప్ప ఈర్ష్య ద్వేషాలు ఉండవు. చిత్ర పరిశ్రమలో రాజకీయ పరంగా విభిన్నమైన ఆలోచనా విధానాలు ఉండొచ్చు. మేం ఒకసారి వేరు అవ్వొచ్చు. కలవచ్చు, కలవకపోవచ్చు. కనీస సంస్కారం ఏమిటంటే... ఇలా కూర్చుని మనసు విప్పి మాట్లాడుకునే వేదికలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అటువంటి వేదికకు సరితూగే వ్యక్తి బాలకృష్ణ గారు'' అని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆయనకు బాలకృష్ణ థాంక్స్ చెప్పారు.
Also Read : ఇంట్లో గొడవ అయితే భార్యకు పవన్ కళ్యాణ్ సారీ చెబుతాడా? లేదా?
బయట ఒకటి... లోపల ఒకటి కాకుండా!
బాలకృష్ణ మనసులో ఒకటి, బయట ఒకటి ఉండదని పవన్ కళ్యాణ్ తెలిపారు. 'ఈ షో (అన్‌స్టాపబుల్ 2)కి పిలవక ముందు నా గురించి ఏం అనుకున్నావ్? ఈ షో అయిపోయిన తర్వాత ఏమనుకున్నావ్?' అని బాలకృష్ణ ప్రశ్నించగా... ''ఆయన ముక్కుసూటి వ్యక్తిత్వం, కల్మషం లేని ఆలోచనా విధానం, మంచో చెడో గుండెల్లో నుంచి మాటలు వచ్చేస్తాయ్! ఈ షోకి రాక ముందు నాకు ఎలాంటి భావన ఉందో... కలిసిన తర్వాత కూడా నాకు అదే భావన ఉంది. అది కాకుండా అదనంగా ఆయన వ్యక్తిత్వం వెనుక ఒక ప్రేమ మూర్తి ఉన్నాడు. ఒక మంచితనం ఉంది'' అని పవన్ చెప్పారు.
Also Read : ఆ గొడవ లేదన్న బాలకృష్ణ, అలా కష్టమన్న పవన్ కళ్యాణ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)