Pawan Kalyan : ఇంట్లో గొడవ అయితే భార్యకు పవన్ కళ్యాణ్ సారీ చెబుతాడా? లేదా?
Unstoppable PSPK Episode 2: 'అన్‌స్టాపబుల్ 2'లో బాలకృష్ణ కొన్ని ప్రశ్నలు అడిగారు. పవన్ కళ్యాణ్ ఆన్సర్స్ రాశారు. ఫ్యాన్స్ ఏం అనుకుంటున్నారో ముందు తెలుసుకుని, తర్వాత పవన్ రాసింది చూశారు.
Unstoppable 2 Final Episode Highlights : 'అన్‌స్టాపబుల్ 2'లో పవన్ కళ్యాణ్ చేత బాలకృష్ణ కొత్త ఆట ఆడించారు. ఆయన కొన్ని ప్రశ్నలు అడిగారు. పవన్ ఆన్సర్స్ రాశారు. అయితే... పవర్ స్టార్ ఫ్యాన్స్ ఏం అనుకుంటున్నారో ముందుగా బాలయ్య తెలుసుకుని, తర్వాత పవన్ రాసింది చూశారు. రెండు ప్రశ్నల విషయంలో మినహా మిగతా విషయాల్లో పవన్ చెప్పిన సమాధానాలు, అభిమానుల అభిప్రాయాలూ ఒకే విధంగా ఉన్నాయి.
బాలకృష్ణ ఏం ప్రశ్నలు అడిగారు? అందుకు పవన్ కళ్యాణ్ ఏం సమాధానాలు ఇచ్చారు? పవర్ స్టార్ ఫ్యాన్స్ ఏమని చెప్పారు? వంటివి చూస్తే...
పవన్ హిందీ సినిమా చేయాలి!
బాలకృష్ణ : PSPK (పవర్ స్టార్ పవన్ కళ్యాణ్) హిందీ సినిమా చేయాలని నీ ఫ్యాన్స్ అనుకుంటున్నారా? అనుకోవడం లేదా?
ఫ్యాన్స్ : ఎస్... అవును! (పవన్ హిందీ సినిమా చేయాలని కోరుకుంటున్నారు)
పవన్ కళ్యాణ్ : నో (అని రాశారు)
క్రిష్ : 'హరి హర వీర మల్లు' హిందీలో కూడా విడుదల అవుతుందండీ!
యాక్షన్ ఎక్కువ చేయాలని!
బాలకృష్ణ : పవర్ స్టార్ లవ్ స్టోరీస్ కంటే యాక్షన్ స్టోరీస్ ఎక్కువ చేయాలని ఫ్యాన్స్ అనుకుంటున్నారు!
ఫ్యాన్స్ : 50 - 50 (యాక్షన్ స్టోరీస్ చేయాలని ఓటు వేసిన అభిమానులు ఒకరు ఎక్కువ)
బాలకృష్ణ : అంటే... యాక్షన్ లవ్ స్టోరీస్ చేయాలని! ఆన్సర్ ఏంటి భయ్యా?
పవన్ కళ్యాణ్ : ఎస్... యాక్షన్ లవ్ స్టోరీస్ చేయాలని!
ఇంట్లో గొడవలు అయితే?
బాలకృష్ణ : ఈ ప్రశ్న అభిమానులకు... ఇంట్లో గొడవ అయితే ముందు భయ్యా (పవన్ కళ్యాణ్) సారీ చెబుతాడు! అవునా? కదా?
ఫ్యాన్స్ : నో!
క్రిష్ : నా ఉద్దేశం అయితే 'అవును'. కానీ, ఇక్కడ ఫ్యాన్స్ మాత్రం ఆయన ఎవరికి సారీ చెప్పినా ఒప్పుకునేలా లేరు.
పవన్ కళ్యాణ్ : గొడవలు రాకుండా చూసుకుంటాం! సారీలు అవసరం రాకుండా!
బాలకృష్ణ : నాకు కూడా ఇంట్లో గొడవలు రావు భయ్యా! (నవ్వులు) ఎందుకు అంటే... మా ఆవిడ ఏమండీ అనగానే 'ఎస్' అంటాను. చెప్పకుండా 'ఎస్' అంటారేంటి? అని అడుగుతుంది. ఏదైనా 'ఎస్' అనాలి కదా అని అంటుంటా!
మల్టీస్టారర్ చేయడానికి రెడీ! - పవన్
బాలకృష్ణ : నీ అభిమానులకు, నా అభిమానులకు ఒక ప్రశ్న... భయ్యా (పవన్ కళ్యాణ్), బాలయ్య మల్టీస్టారర్ చేయాలి!
ఫ్యాన్స్ : 100 శాతం 'ఎస్'
పవన్ కళ్యాణ్ : ఎస్
క్రిష్ : కథ రెడీ! చెప్పవచ్చా?
బాలకృష్ణ : ఓ పని చేద్దాం! 2024లో చేద్దాం! మామూలుగా ఉండదు.
Also Read : ఆ గొడవ లేదన్న బాలకృష్ణ, అలా కష్టమన్న పవన్ కళ్యాణ్
బాలకృష్ణ : భయ్యా సినిమాలు మానేసి ప్రజాసేవకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి! ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు?
ఫ్యాన్స్ : ఎక్కువ మంది 'నో' చెప్పారు.
పవన్ కళ్యాణ్ : ఎస్
క్రిష్ : రెండూ చేయాలి.
బాలకృష్ణ : మనిషి అనేవాడు ఒక పడవ మీద వెళతాడు. హీరో అనేవాడు రెండు పడవల మీద నడిచి వెళ్లగలడు. నువ్వు (పవన్ కళ్యాణ్) హీరోవి... అటు ప్రజాసేవ, ఇటు ఫీచర్ ఫిల్మ్స్ రెండు పడవల మీద నడుచుకుంటూ వెళతావ్. అదిరిపోద్ది.
పవన్ కళ్యాణ్ ప్రజాసేవకు మాత్రమే అంకింతం కాకూడదని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ప్రజాసేవతో పాటు సినిమాలు కూడా చేయాలనేది ఆయన ఫ్యాన్స్ కోరిక. పవన్ ఫ్యాన్స్ అలా అంటున్నారని అనుకోవడం లేదు. అదే విధంగా ఆయన హిందీ సినిమా కూడా చేయాలని ఆశిస్తున్నారు. 'హరి హర వీర మల్లు'తో ఆ కోరిక నెరవేరుతోంది. ఆ సినిమా హిందీలో కూడా విడుదల అవుతుందని క్రిష్ తెలిపారు.
Also Read : 'వేద' రివ్యూ : హీరోయిన్లూ ఫైట్ చేస్తే - శివన్న సినిమా ఎలా ఉందంటే?