Chiranjeevi about Pawan Kalyan: పవన్ కల్యాణ్ న్యాయం కోసమే పోరాడతాడు - చిరంజీవి
తమ్ముడు పవన్ కల్యాణ్‌కు అన్నయ్య చిరంజీవి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. పవన్ ఏం మాట్లాడినా న్యాయం కోసమే మాట్లాడతాడని ఆయన చెప్పుకొచ్చారు.
రాజకీయంగా మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దారులు వేరు కావచ్చు. కానీ, నైతిక మద్దతు విషయంలో అన్నదమ్ములు ఇద్దరూ ఒకరికి మరొకరు అండగా ఉంటారని పలు సందర్భాల్లో తేటతెల్లం అయ్యింది. చిరంజీవి, పవన్‌కు మధ్య మనస్పర్థలు అనే పుకార్లకు చిరంజీవి పుట్టినరోజు నాడు తెర పడింది. అన్నయ్య, వదినలతో పవన్ ఎంత సన్నిహితంగా ఉంటారనేది చిరు ఇంట మెగాస్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్ వీడియోలో తెలిసింది. ప్రస్తుతానికి వస్తే... తమ్ముడికి అండగా, తమ్ముడికి నైతికంగా మద్దతుగా నిలిచేలా మెగాస్టార్ మాట్లాడారు.
మెగా అభిమానులతో చిరంజీవి సమావేశం అయ్యారు. ఆక్సిజన్ బ్యాంక్ గురించి మాట్లాడారు. ఆ సమయంలో పవన్ కల్యాణ్ గురించి చిరంజీవి మాట్లాడుతూ "కల్యాణ్ బాబు ఏదైనా ఒక విషయం మీద స్పందిస్తే... కరెక్ట్ అనిపిస్తుంది. తను కూడా న్యాయం కోసం పోరాడతాడు. న్యాయం కోసం మాట్లాడతాడు. నేను కూడా అదే న్యాయం కోసం మాట్లాడతా. మన సిన్సియారిటీ, మన నిజాయతీ, మన సంయమనం, మన ఓపిక... ఇవే మనకు విజయాన్ని చేకూర్చి పెడతాయి. ఆ విషయంలో నేను ఎవరి చేత మాట అనిపించుకోలేను" అని చిరంజీవి వ్యాఖ్యానించారు.
కళ్యాణ్ బాబు ఏ విషయం మీద అయినా తన స్పందన సబబే ఉంటుంది..
— Twood Trolls™ (@TwoodTrolls) January 3, 2022
న్యాయం కోసమే మాట్లాడతాడు..@KChiruTweets Garu about @PawanKalyan pic.twitter.com/3MCkXelBYd
Also Read: ఇండస్ట్రీ పెద్దగా నేను ఉండను.. ఆ స్థానం నాకొద్దు.. మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్..
సినీ కార్మికులకు ఆదివారం హెల్త్ కార్డుల పంపిణీ చేసిన సమావేశంలో చిరంజీవి ఇండస్ట్రీకి పెద్దగా కాకుండా... బాధ్యత కల బిడ్డగా ఉంటానని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై పరిశ్రమలో చర్చ జరుగుతోంది. పెద్దగా ఎందుకు అనొద్దన్నారని డిస్కషన్స్ మొదలు అయ్యాయి.
Also Read: బాసూ... క్లాస్‌గా మెగాస్టార్ మాస్ స్టెప్పేస్తే? ఫుల్ సాంగ్ వచ్చేసింది... చూశారా?
Also Read: 'రాధే శ్యామ్' నిర్మాతలకు కొత్త తలనొప్పి... రోజుకు ఓసారి ఆ మాట చెప్పాల్సిందేనా?
Also Read: త్రివిక్రమ్ క్లాప్‌తో సినిమా మొదలు... బుధవారం నుంచి క్లాసులు!
Also Read: కృష్ణుడే సత్యభామ కాళ్లు పట్టుకున్నాడు... బాలకృషుడు ఓ లెక్కా!?
Also Read: లెఫ్ట్ హ్యాండ్ రెడీ.. వాళ్లు ఎదురుపడితే దబిడిదిబిడే.. వార్నింగ్ ఇచ్చిన బాలయ్య..
Also Read: The Boss: రామ్ గోపాల్ వర్మ బాబాగా మారితే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి