Unstoppable 2: ‘అన్‌స్టాపబుల్-2’లో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ - ఇదిగో హింట్ ఇచ్చేశారు
పవర్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్. త్వరలోనే ‘అన్‌స్టాపబుల్-2’లో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌లు పాల్గోనున్నట్లు ‘ఆహా’ కన్ఫర్మ్ చేసింది.
బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్’కు ఎంత క్రేజ్ లభించిందో తెలిసిందే. తాజాగా ‘అన్‌స్టాపబుల్-2’ కూడా డబుల్ ధమాకా మోగిస్తోంది. మరికొద్ది రోజుల్లో టాలీవుడ్ హీరోలు ప్రభాస్, గోపీ చంద్‌లు ఈ షోలు సందడి చేయనున్నారు. ఇప్పటికే ప్రభాస్, గోపీచంద్‌లో గ్లింప్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తు్న్నాయి. ప్రభాస్ అభిమానులు ప్రోమో గురించి చాలా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అయితే, అది రిలీజ్ అవ్వడానికి ముందే.. మరో అప్‌డేట్‌ను వదిలింది ‘ఆహా’. అయితే, విషయాన్ని ముందుగా రివీల్ చేయకుండా.. చిన్న హింట్ ఇచ్చి వదిలేసింది.
బాలకృష్ణ గత ఎపిసోడ్‌లో త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఫోన్లో మాట్లాడుతూ.. ‘‘అన్‌స్టాపబుల్‌కు ఎప్పుడు వస్తున్నావ్?’’ అని ప్రశ్నించారు. ‘‘మీరు ఓకే అంటే వెంటనే వచ్చేస్తా’’ అని త్రివిక్రమ్ సమాధానం ఇచ్చారు. దీంతో బాలయ్య ‘‘ఎవరితో రావాలో తెలుసుగా..’’ అని పరోక్షంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకొచ్చారు. ఎందుకంటే.. త్రివిక్రమ్ - పవన్ కళ్యాణ్‌కు ఉన్న బాండ్ గురించి అందరికీ తెలిసిందే. పవన్‌కు త్రివిక్రమ్ ఎప్పుడూ వెన్నంటి ఉంటారని టాక్.
త్వరలోనే పవర్, త్రివిక్రమ్‌లు ‘అన్‌స్టాపబుల్-2’కు రానున్నారనే విషయాన్ని చెప్పేందుకు ఆహా.. ఆ ఫోన్ క్లిప్‌తో హింట్ ఇచ్చింది. దీంతో పవర్ స్టార్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. బాలయ్యను, పవన్ కళ్యాణ్‌ను ఒకే వేదిక మీద చూడొచ్చంటూ తెగ సంబరపడిపోతున్నారు. ప్రభాస్, గోపీ చంద్‌ల ఎపిసోడ్ ప్రసారం కాగానే.. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్‌లతో షూటింగ్ మొదలుకానున్నట్లు తెలుస్తోంది. దీనిపై ‘ఆహా’ క్లారిటీగా మరో ప్రోమో వదిలేవరకు ఉత్కంఠ కొనసాగనుంది. అయితే, నిర్మాత నాగవంశీ కూడా దీనిపై హింట్ ఇస్తూ ఓ ట్వీట్ చేశారు. డిసెంబరు 27న బాణాసంచాలు పేల్చేేందుకు సిద్ధమైపోండి అని పేర్కొన్నారు. దీంతో పవన్-త్రివిక్రమ్‌ల ఎపిసోడ్ డిసెంబరు 27న స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నట్లు స్పష్టమవుతోంది.
Get Ready for a smashing blast of Fireworks this 27th December 🔥🎇
— Naga Vamsi (@vamsi84) December 15, 2022
Stay Tuned to @ahavideoIN ✨
Also Read: ‘అదీ ఒంగోలియన్స్ అంటే’ - గోపీచంద్‌పై బాలయ్య కామెంట్ - అన్‌స్టాపబుల్ కొత్త గ్లింప్స్ చూశారా?
View this post on Instagram
తాజాగా విడుదలైన మరో ప్రోమోలో గోపీచంద్ ఎంట్రీ ఇవ్వగానే ప్రభాస్ ఆప్యాయంగా హగ్ చేసుకుంటాడు. గోపీచంద్ కూర్చోగానే బాలయ్య అడిగిన ఏదో ప్రశ్నకు ‘‘అది 2008లో కాదు అనుకుంట..’’ అని రిప్లై ఇవ్వగానే ప్రభాస్ పక్కనుంచి ‘ఒరేయ్’ అని గట్టిగా అరుస్తాడు. ఆ తర్వాత ఏదో ప్రశ్నకు పక్కకి తిరిగి సిగరెట్లు కాలుస్తున్నట్లు సైగల రూపంలో చూపిస్తాడు. చివర్లో బాలయ్య ‘అదీ ఒంగోలియన్స్ అంటే’ అనడంతో ప్రోమో కట్ అవుతుంది. డిసెంబర్ 30వ తేదీన ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుందని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాలను ‘ఆహా’ ఇంకా ప్రకటించలేదు.
View this post on Instagram