అన్వేషించండి

Unstoppable Gopichand Glimpse: ‘అదీ ఒంగోలియన్స్ అంటే’ - గోపీచంద్‌పై బాలయ్య కామెంట్ - అన్‌స్టాపబుల్ కొత్త గ్లింప్స్ చూశారా?

బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకు ప్రభాస్, గోపీచంద్ వచ్చారు. గోపీచంద్ ప్రోమోను గురువారం విడుదల చేశారు.

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ‘ఆహా’ ఓటీటీ యాప్‌లో టెలికాస్ట్ అవుతున్న ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ టాక్ షోకు ప్రభాస్, గోపీచంద్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్‌కు సంబంధించిన ప్రోమోను ఇప్పటికే విడుదల చేయగా, ఇప్పుడు గోపీచంద్ ప్రోమో కూడా వచ్చేసింది.  ఇప్పటివరకు అన్‌స్టాపబుల్‌లో వచ్చిన క్రేజీ ఎపిసోడ్లలో ఇది కూడా ఒకటి.

ఈ ప్రోమోలో గోపీచంద్ ఎంట్రీ ఇవ్వగానే ప్రభాస్ ఆప్యాయంగా హగ్ చేసుకుంటాడు. గోపీచంద్ కూర్చోగానే బాలయ్య అడిగిన ఏదో ప్రశ్నకు ‘అది 2008లో కాదు అనుకుంట...’ అని రిప్లై ఇవ్వగానే ప్రభాస్ పక్కనుంచి ‘ఒరేయ్’ అని గట్టిగా అరుస్తాడు. ఆ తర్వాత ఏదో ప్రశ్నకు పక్కకి తిరిగి సిగరెట్లు కాలుస్తున్నట్లు సైగల రూపంలో చూపిస్తాడు. చివర్లో బాలయ్య ‘అదీ ఒంగోలియన్స్‌ అంటే’ అనడంతో ప్రోమో కట్ అవుతుంది. డిసెంబర్ 30వ తేదీన ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుందని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాలను ఆహా ఇంకా ప్రకటించలేదు.

గతంలో అన్‌స్టాపబుల్ షోలో ప్రభాస్ ఉన్న కొన్ని ఫొటోలు, ఒక వీడియో ఆన్‌లైన్‌లో లీకైంది. ఈ వీడియోలో ప్రభాస్ డ్రెస్సింగ్‌పై బాలయ్య కామెంట్ చేశారు. ‘నీ షర్టులు అన్నీ 3XL, 4XL యేనా అని’ అని బాలకృష్ణ అడిగినప్పుడు ‘నాకు షూలు దొరకడం కష్టం. షూ సైజ్ 13’ అని ప్రభాస్ సమాధానం ఇస్తారు. దానికి బాలకృష్ణ ఫన్నీగా ‘వెంకటేశ్వర స్వామి పాదం అంటారు దాన్ని.’ అని కామెంట్ చేశాడు.

త్వరలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కూడా ఒక ఎపిసోడ్‌కు రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సీజన్ మొదటి ఎపిసోడ్‌కు ఏపీ ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ రాగా, ఆ తర్వాత అడివి శేష్, శర్వానంద్ ఒక ఎపిసోడ్‌కు, విష్వక్సేన్, సిద్ధు జొన్నలగడ్డ ఒక ఎపిసోడ్‌కు, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, రాధిక వచ్చారు.

బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘వీర సింహా రెడ్డి’ సంక్రాంతి సందర్బంగా జనవరి 13వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ తర్వాతి సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. ఈ సినిమాకు ‘బ్రో ఐ డోంట్ కేర్’ అనే టైటిల్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇక ప్రభాస్ చేతిలో ప్రస్తుతం చాలా సినిమాలు ఉన్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ కే’, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’, మారుతి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్నాయి. ‘ఆదిపురుష్’ కూడా వచ్చే సంవత్సరం విడుదల కానుంది. గోపీచంద్ ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ahavideoin (@ahavideoin)

టాప్ హెడ్ లైన్స్

This Week Theatrical Movies : ఈ వారం థియేట్రికల్ రిలీజెస్ - ఎపిక్ To మహేంద్రగిరి వారాహి... ఇవి డోంట్ మిస్
ఈ వారం థియేట్రికల్ రిలీజెస్ - ఎపిక్ To మహేంద్రగిరి వారాహి... ఇవి డోంట్ మిస్
Bigg Boss 10 Contestants Remunerations : బిగ్ బాస్ 10 కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్స్ - హయ్యెస్ట్ ఎవరికో తెలుసా?
బిగ్ బాస్ 10 కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్స్ - హయ్యెస్ట్ ఎవరికో తెలుసా?
Podarillu Serial Today September 7th: పొదరిల్లు సీరియల్: జయంతిని కలిసిన మహా, చక్రి! శైలు పెద్దితో మాట్లాడిన విషయం కేశవకి తెలుస్తుందా!
పొదరిల్లు సీరియల్: జయంతిని కలిసిన మహా, చక్రి! శైలు పెద్దితో మాట్లాడిన విషయం కేశవకి తెలుస్తుందా!
Mandaadi Trailer: మందాడి ట్రైలర్ రివ్యూ... సముద్రమంత ప్రమాదం - నమ్మకద్రోహి చేతిలో కొడుకు - సుహాస్ విలనిజం బావుందా?
మందాడి ట్రైలర్ రివ్యూ... సముద్రమంత ప్రమాదం - నమ్మకద్రోహి చేతిలో కొడుకు - సుహాస్ విలనిజం బావుందా?

వీడియోలు

Ishan Kishan Century Duleep Trophy Final | సెలెక్టర్లకు గట్టి కౌంటర్ ఇచ్చిన ఇషాన్ కిషన్
Vaibhav Suryavanshi Duleep Trophy Final Knock | దులీప్ ట్రోఫీ ఫైనల్లో వైభవ్ విధ్వంసం
PCB Takes Custody Of Team Phones | పాకిస్తాన్ ప్లేయర్స్ ఫోన్లు సీజ్
Gundenininda Gudigantalu Serial September 7 | వరలక్ష్మీ వ్రతంలో రోహిణికి ట్విస్ట్
Cybercab Autonomous Robotaxi USA Public Rides | అమెరికాలో సైబర్ క్యాబ్ రైడ్స్ హల్‌చల్.. డ్రైవర్ కాదు స్టీరింగే లేని టెస్లా కార్ల విప్లవం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLA Sunitha Laxma Reddy: పోలీసులు చీర పట్టి లాగారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కంటతడి
పోలీసులు చీర పట్టి లాగారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కంటతడి
Asia Cup Deadlock: ఆసియాక‌ప్ లో మరోసారి ట్రోఫీ రగడ మొదలయ్యే చాన్స్.. ఫైనల్‌కు మొహ్సిన్ నఖ్వీ హాజరుతో నయా టెన్ష‌న్
ఆసియాక‌ప్ లో మరోసారి ట్రోఫీ రగడ మొదలయ్యే చాన్స్.. ఫైనల్‌కు మొహ్సిన్ నఖ్వీ హాజరుతో నయా టెన్ష‌న్
AP Local Body Elections: ఏపీ లోకల్ పోల్స్ ప్రభుత్వ పాలనకు రిఫరెండం - అధికార, ప్రతిపక్షాలు అంగీకరిస్తాయా?
ఏపీ లోకల్ పోల్స్ ప్రభుత్వ పాలనకు రిఫరెండం - అధికార, ప్రతిపక్షాలు అంగీకరిస్తాయా?
Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్ 10'కు నాగార్జున రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? కింగ్‌కు కోట్లలో ఇస్తున్న స్టార్ మా
'బిగ్ బాస్ 10'కు నాగార్జున రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? కింగ్‌కు కోట్లలో ఇస్తున్న స్టార్ మా
Konda Surekha Political Future: బీఆర్ఎస్‌లోకి ఆహ్వానం ఉండదు - బీజేపీలో ఇమడలేరు - కొండా దంపతులకు దారేది?
బీఆర్ఎస్‌లోకి ఆహ్వానం ఉండదు - బీజేపీలో ఇమడలేరు - కొండా దంపతులకు దారేది?
TVS Jupiter 110 డ్యూయల్ టోన్ ఎడిషన్.. కొనేముందు ఈ 8 విషయాలు తెలుసుకోండి!
కొత్తగా డ్యూయల్ టోన్ రంగులే కాదు.. TVS Jupiter 110లో ఇవి కూడా ప్రత్యేకతలే!
Bigg Boss 10 Buzz : ఆట కాదు వేట... బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గెట్ రెడీ - బజ్ హోస్ట్‌గా శివాజీ
ఆట కాదు వేట... బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గెట్ రెడీ - బజ్ హోస్ట్‌గా శివాజీ
హైవేపై మురికి టాయిలెట్ కనిపించిందా? ఫొటో తీసి ₹1,000 FASTag క్రెడిట్ పొందండి!
రూ.1,000 ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్ "ఫ్రీ"గా పొందే ఛాన్స్‌ - మీ ఫోన్‌తో ఫొటో తీస్తే చాలు!
Embed widget