By: ABP Desam | Updated at : 23 Feb 2022 09:21 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
భీమ్లా నాయక్‌లో పవన్‌కల్యాణ్, రానా (Image Credits: Sithara Entertainments)
Bheemla Nayak Pre Release Event: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి నటించిన ‘భీమ్లా నాయక్’ రెండో ట్రైలర్‌ను చిత్ర బృందం ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో విడుదల చేసింది. మొదటి ట్రైలర్‌ను మించే రేంజ్‌లో మాస్ ఎలిమెంట్స్‌తో ఈ ట్రైలర్‌ను కట్ చేశారు. మొదటి ట్రైలర్‌పై మిశ్రమ స్పందన రావడంతో రెండో ట్రైలర్‌ను బృందం విడుదల చేసినట్లు ఉంది. భీమ్లా నాయక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు తెలంగాణ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
ఈ నెల 25వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో పవన్ కల్యాణ్‌కు జోడిగా నిత్యా మీనన్, రానాకు జోడిగా సంయుక్త మీనన్ నటించారు. సముద్రఖని, మురళి శర్మ, రఘుబాబు, బ్రహ్మానందం కీలక పాత్రల్లో నటించారు. మలయాళ సినిమా అయ్యప్పనుం కోషియుంకు అఫీషియల్ రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. మాతృకకు బోలెడన్ని మార్పులు చేసినట్లు నిర్మాతలు తెలిపారు.
అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు వంటి సక్సెస్‌ఫుల్ సినిమాలకు దర్శకత్వం వహించిన సాగర్ చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించాడు. థమన్ సంగీతం అందించాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ భీమ్లా నాయక్ నిర్మించారు.
ప్రస్తుతం ఫాంలో ఉన్న థమన్ సంగీతం అందించిన ‘భీమ్లానాయక్’ టైటిల్ సాంగ్, ‘లా లా భీమ్లా’, ‘అంత ఇష్టం ఏందయ్య’, ‘అడవి తల్లి మాట’, ‘లా లా భీమ్లా డీజే వెర్షన్’... ఇలా బయటకు వచ్చిన పాటలన్నీ పెద్ద హిట్ అయ్యాయి. క్యారెక్టర్ ఇంట్రడక్షన్ టీజర్లకు ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా పవర్‌ఫుల్‌గా ఉండటంతో ఆడియన్స్, ఫ్యాన్స్‌కు సినిమాపై అంచనాలు ఎక్కువయ్యాయి.
మొదట ఈ సినిమా జనవరి 12వ తేదీన విడుదల కావాల్సి ఉంది. కానీ ఆర్ఆర్ఆర్‌ను జనవరి ఏడో తేదీన విడుదల చేస్తామని మొదట ప్రకటించడంతో దీన్ని ఫిబ్రవరి 25వ తేదీకి వాయిదా వేశారు. ఆ తర్వాత కరోనావైరస్ థర్డ్ వేవ్ కారణంగా ఆర్ఆర్ఆర్ వాయిదా పడ్డప్పటికీ... పెండింగ్ వర్క్ ఉండటం, థర్డ్ వేవ్ పీక్స్‌లో ఉండటంతో సినిమాను ఫిబ్రవరి 25వ తేదీనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. మధ్యలో ఏప్రిల్‌కు వాయిదా వేయాలనుకున్నా... ఏపీలో 100 శాతం ఆక్యుపెన్సీ, నైట్ కర్ఫ్యూ ఎత్తేయడంతో ఫిబ్రవరి 25కే ఫిక్సయ్యారు. తెలంగాణలో ఈ సినిమాకు ఐదు షోలకు, టికెట్ రేట్ల పెంపునకు అనుమతి దక్కింది. ఏపీలో మాత్రం ఎటువంటి అదనపు అనుమతులు లభించలేదు.
NTR: ‘ఈ గుండెని ఒక్కసారి తాకిపో తాతా’ - జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్
Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!
The Warriorr: రామ్ 'ది వారియర్' షూటింగ్ పూర్తి - రిలీజ్ కు ఏర్పాట్లు
Black Movie Review - 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?
RRR in Netflix: రామ్, భీమ్ ఫుట్‌బాల్ - ఏందయ్య ఇది మేమెక్కడా సూడలే!
Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు
Redmi 11 5G Launch: రెడ్మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!
Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?
Tirumala News : తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!