News
News
X

Yadamma Raju Engagement: ఓ ఇంటివాడు కాబోతున్న కమెడియన్ యాదమ్మ రాజు, ఎంగేజ్మెంట్ పోటోలు వైరల్

యాదమ్మరాజు గత కొంత కాలంగా స్టెల్లా అనే యువతితో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. చాలా సందర్భాల్లో వీరిద్దరూ కామెడీ ప్రోగ్రాంలలో కనిపించారు కూడా. త్వరలోనే ఈ బుల్లితెర జంట పెళ్లి పీటలెక్కనుంది.

FOLLOW US: 
Share:

తెలుగు బుల్లితెర కమెడియన్ యాదమ్మరాజు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. పటాస్ షో ద్వారా బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చిన యాదమ్మరాజు తన కామెడి టైమింగ్, యాటిట్యూడ్ తో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రాజు గత కొంత కాలంగా స్టెల్లా అనే యువతితో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. చాలా సందర్భాల్లో వీరిద్దరూ కామెడీ ప్రోగ్రాంలలో కనిపించారు కూడా. అయితే త్వరలోనే ఈ బుల్లితెర జంట పెళ్లి పీటలెక్కనుంది. ఇటీవల వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలను యాదమ్మరాజు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు. 

యాదమ్మరాజు అనుకోకుండా బుల్లితెర వైపు వచ్చాడు. జబర్ధస్త్, ఎక్స్ట్రా జబర్ధస్త్ షో లు ఎంత పాపులర్ అయ్యాయో అప్పట్లో పటాస్ కామెడీ షో కూడా అంతే క్రేజ్ తెచ్చుకుంది. ఓసారి పటాస్ కార్యక్రమంలో స్టూడెంట్ గా షోలో అడుగుపెట్టిన రాజు ఓ జోక్ వేసి బాగా హైలెట్ అయిపోయాడు. రాజు బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్ బాగుండటంతో పటాస్ షోలో కామెడీ చేసే అవకాశం లభించింది. ప్రస్తుతం కమెడియన్స్ గా పేరుతెచ్చుకున్న సద్దాం, నూకరాజు, ఫైమా, ఇమ్మాన్యూయల్.. ఇలాంటి వారంతా పటాస్ షో నుంచి వచ్చిన వారే. 

గతేడాది ‘అదిరింది’ షో తో మరింత క్రేజ్ తెచ్చుకున్నాడు యాదమ్మ రాజు. ముఖ్యంగా స్టేజీ మీద యాదమ్మ రాజు, సద్దాం కాంబినేషన్ లో చేసిన కామెడీ స్కిట్ లు మంచి హిట్ అయ్యాయి. వీరిద్దరూ స్టేజీపైన ఉంటే కామెడీ వేరే లెవల్ లో ఉంటుంది. ప్రస్తుతం కామెడీ షోలలో చేస్తోన్న చాలామందికి సినిమాల్లో కూడా అవకాశాలు వస్తున్నాయి. యాదమ్మరాజు కూడా ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్నాడు. ఇక తన ప్రియురాలు స్టెల్లా గురించి కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. స్టెల్లాతో ప్రేమలో ఉన్నట్టు యాదమ్మరాజు ఓసారి ప్రోగ్రాం మధ్యలో ఆమెను స్టేజీ పైకి తీసుకొచ్చి అందరికీ పరిచయం చేశాడు. అంతేకాకుండా వీరిద్దరూ కలసి యూట్యూబ్ వీడియోలు కూడా చేస్తున్నారు. 

Read Also: రష్మికపై బ్యాన్, ఇక ఆమె సినిమాలు కూడా విడుదలకావట!

View this post on Instagram
 
A post shared by YADAMMA RAJU (@yadamma_raju)

Published at : 28 Nov 2022 05:10 PM (IST) Tags: Yadamma Raju Stella Yadamma Raju Engagment

సంబంధిత కథనాలు

Trivikram - Surya Vashistta : కో డైరెక్టర్ కుమారుడిని హీరో చేసిన త్రివిక్రమ్

Trivikram - Surya Vashistta : కో డైరెక్టర్ కుమారుడిని హీరో చేసిన త్రివిక్రమ్

Sidharth Kiara Wedding: సిద్ధార్థ్, కియారా పెళ్లికి ముహూర్తం ఫిక్స్ - జైసల్మేర్‌లో వెడ్డింగ్, ముంబై రిసెప్షన్!

Sidharth Kiara Wedding: సిద్ధార్థ్, కియారా పెళ్లికి ముహూర్తం ఫిక్స్ - జైసల్మేర్‌లో వెడ్డింగ్, ముంబై రిసెప్షన్!

Pathaan Movie: ‘పఠాన్’ మూవీ గురించి మీకు తెలియని 8 ఇంట్రెస్టింగ్ విషయాలు

Pathaan Movie: ‘పఠాన్’ మూవీ గురించి మీకు తెలియని 8 ఇంట్రెస్టింగ్ విషయాలు

Monica Barbaro: ‘RRR’ తెలుగులోనే చూస్తా - ‘నెట్‌ఫ్లిక్స్’కు ప్రముఖ హాలీవుడ్ నటి రిక్వెస్ట్, ‘ఎత్తర జెండా’కు ఫిదా!

Monica Barbaro: ‘RRR’ తెలుగులోనే చూస్తా - ‘నెట్‌ఫ్లిక్స్’కు ప్రముఖ హాలీవుడ్ నటి రిక్వెస్ట్, ‘ఎత్తర జెండా’కు ఫిదా!

Unstoppable 2 Finale Episode : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దెబ్బకు ఆహా ఓటీటీ పని చేస్తుందా?

Unstoppable 2 Finale Episode : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దెబ్బకు ఆహా ఓటీటీ పని చేస్తుందా?

టాప్ స్టోరీస్

Telangana budget 2023 : రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ సరే - నిధుల సమీకరణ ఎలా ? తెలంగాణ సర్కార్‌కు ఇదే పెద్ద టాస్క్

Telangana budget 2023 : రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ సరే - నిధుల సమీకరణ ఎలా ? తెలంగాణ సర్కార్‌కు ఇదే పెద్ద టాస్క్

Perni Nani On Kotamreddy : జగన్ పిచ్చి మారాజు అందర్నీ నమ్మేస్తారు, కోటంరెడ్డి నమ్మక ద్రోహం చేశారు - పేర్ని నాని

Perni Nani On Kotamreddy : జగన్ పిచ్చి మారాజు అందర్నీ నమ్మేస్తారు, కోటంరెడ్డి నమ్మక ద్రోహం చేశారు - పేర్ని నాని

PROJECT-K 2 Parts | ప్రాజెక్ట్-K పై నమ్మకంతో Prabhas రిస్క్ చేస్తున్నారా..?| ABP Desam

PROJECT-K 2 Parts | ప్రాజెక్ట్-K పై నమ్మకంతో Prabhas రిస్క్ చేస్తున్నారా..?| ABP Desam

ఇమేజ్‌ డ్యామేజ్ చేస్తే డొక్క పగలదీస్తాం- దుట్టా, యార్లగడ్డకు వంశీ స్ట్రాంగ్ వార్నింగ్!

ఇమేజ్‌ డ్యామేజ్ చేస్తే డొక్క పగలదీస్తాం- దుట్టా, యార్లగడ్డకు వంశీ స్ట్రాంగ్ వార్నింగ్!