Rashmika Mandanna: రష్మికపై బ్యాన్, ఇక ఆమె సినిమాలు కూడా విడుదలకావట!
రష్మిక మందన్నకు గట్టి షాక్ తగిలినట్లు తెలుస్తోంది. కన్నడ సినిమా పరిశ్రమ ఆమెను బ్యాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె నటించిన సినిమాలు కూడా కన్నడ నాట విడుదలకావనే ప్రచారం నడుస్తోంది.
![Rashmika Mandanna: రష్మికపై బ్యాన్, ఇక ఆమె సినిమాలు కూడా విడుదలకావట! Rashmika Mandanna to get banned by Kannada film industry for ungrateful to Rakshit Shetty's production house Rashmika Mandanna: రష్మికపై బ్యాన్, ఇక ఆమె సినిమాలు కూడా విడుదలకావట!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/25/aca25d71d4c38694be1d664ead9e57031669352995793544_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
దక్షిణాదిలో మంచి ఫామ్ లో ఉన్న హీరోయిన్ రష్మిక మందన్న. కన్నడ సినిమా పరిశ్రమలో కెరీర్ మొదలు పెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది. తెలుగులో చక్కటి గుర్తింపు తెచ్చుకున్న రష్మిక.. కోలీవుడ్, బాలీవుడ్ సినిమాలు చేసింది. ప్రస్తుతం అన్ని చోట్లా రష్మిక హీరోయిన్ గా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. తాజాగా కన్నడ సినిమా రష్మికపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పరిస్థితి ఏకంగా ఆమెపై బ్యాన్ విధించే స్థాయికి చేరింది. ఇంతకీ అసలు ఏం జరిగిందటే?
రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం, పెళ్లి క్యాన్సిల్
కన్నడలో రష్మిక ‘కిరాక్ పార్టీ’ సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యింది. ఈ సినిమాకు రిషబ్ శెట్టి దర్శకత్వం వహించారు. హీరోగా రక్షిత్ శెట్టి నటించాడు. తొలి సినిమా తర్వాత రక్షిత్ శెట్టి, రష్మిక ప్రేమలో పడ్డారు. ఇద్దరికి నిశ్చితార్థం కూడా జరిగింది. ఏం జరిగిందో తెలియదు కానీ, చివరకు వీరి పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. అప్పటి నుంచి వీరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.
‘కాంతార’పై రష్మిక కామెంట్
తాజాగా ‘కాంతార’ సినిమా గురించి రష్మిక చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదం అయ్యాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘కాంతార’ సినిమా చూశారా? అని ఎదురైన ప్రశ్నకు ‘‘చూడలేదు, అంత టైమ్ లేదు’’ అని సమాధానం చెప్పింది. అటు మీకు సినిమాల్లో తొలి ఛాన్స్ ఎలా వచ్చింది? అని అడిగిన ప్రశ్నకు దర్శకుడు రిషబ్ శెట్టి పేరు చెప్పకుండా, తన ఫోటోను చూసి ఓ ప్రొడక్షన్ హౌస్ వాళ్లు పిలిచారు అని చెప్పింది. “నేను ఫ్రెష్ నెస్ అనే ఓ కాంపిటీషన్ లో పాల్గొన్నాను. మా టీచర్ చెప్పడంతో ఇందులో పార్టిసిపేట్ చేశాను. తొలుత రాష్ట్ర స్థాయిలో, ఆ తర్వాత జాతీయ స్థాయిలో పాల్గొని టైటిల్ గెచ్చుకున్నాను. అప్పుడు నా ఫోటో టైమ్స్ ఆఫ్ ఇండియాలో వేశారు. ఒక రోజు ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ వచ్చింది. సినిమాలో అవకాశం ఇస్తున్నట్లు చెప్పింది. కానీ, నేను నమ్మలేకపోయాను” అని చెప్పింది. ఇదే సమయంలో తనకు అవకాశం ఇచ్చిన ప్రొడక్షన్ హౌస్ పేరు చెప్పకుండా ఏదో ఒక ప్రొడక్షన్ హౌస్ అనేలా సైగలు చేసింది.
View this post on Instagram
రష్మికకు రిషబ్ కౌంటర్
ఇటీవలే రష్మిక కామెంట్స్ పై రిషబ్ శెట్టి రియాక్ట్ అయ్యాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఏ హీరోయిన్ తో సినిమాలు చేయాలి అనుకుంటున్నారు? అనే ప్రశ్నకు రష్మిక మినహా మిగతా హీరోయిన్ల పేర్లను చెప్పాడు. దీంతో ఇన్ డైరెక్ట్ గా రిషబ్ రష్మికకు గట్టి కౌంటర్ ఇచ్చాడు.
సంచలనం కలిగిస్తున్న ఉమైర్ సంధు ట్వీట్
మరోవైపు రష్మిక వ్యవహారంపై కన్నడ నాట తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. కన్నడకు చెందిన అమ్మాయి అయినా అక్కడి సినిమాలు చేయకపోవడం, అక్కడి సినిమా పరిశ్రమను అవమాన పర్చేలా మాట్లాడం పట్ల ప్రేక్షకులు, సినిమా పెద్దలు, సినిమా థియేటర్ల యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అమెరికాలో ఇండియన్ సినిమాల సెన్సార్ బోర్డు మెంబర్, ఫిలిం క్రిటిక్ ఉమైర్ సంధు చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కన్నడ సినీ పరిశ్రమకి రష్మిక సరైన గౌరవం ఇవ్వకపోవడంతో పాటు అవమానపర్చేలా మాట్లాడుతున్నందున ఆమెను కన్నడ పరిశ్రమ బ్యాన్ చేసినట్లు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. మరికొంత మంది దీన్ని ఫేక్ న్యూస్ గా చెప్తున్నారు.
#RashmikaMandanna officially “ BANNED ” in Kannada Movies due to disrespect Kannada movies !!!
— Umair Sandhu (@UmairSandu) November 24, 2022
News from Karnataka that Kannada Theatre Owners, Organizations and Film Industry will soon going to take an action on #RashmikaMandanna !!!
— Daily Culture (@DailyCultureYT) November 24, 2022
They may go to the extent banning @iamRashmika's films permanently from #Karnataka
Worrying thing for #PushpaTheRule and #Varisu Teams
అయితే, ఈ ప్రకటనపై రష్మిక ఎలాంటి కామెంట్ చేయలేదు. ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రతో కలిసి రష్మిక ‘మిషన్ మజ్ను’ అనే సినిమా చేస్తోంది. అటు తమిళ హీరో దళపతి విజయ్‌తో కలిసి నటించిన ‘వారిసు’ చిత్రంలో యాక్ట్ చేస్తున్నది. మరోవైపు అల్లు అర్జున్ తో ‘పుష్ప 2’లో చేస్తోంది.
Also Read : లవ్ టుడే రివ్యూ: ఈ తరం ప్రేమకథ ఆకట్టుకుందా? ప్రదీప్ అరుదైన జాబితాలో చేరాడా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)