అన్వేషించండి

Parthiban: బాధపెట్టి ఉంటే క్షమించండి - తమన్నా వివాదంపై స్పందించిన పార్తిబన్

తమన్నా డ్యాన్స్ గురించి సీనియర్ నటుడు పార్తిబన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో ఆయన క్షమాపణలు చెప్పారు.

Parthiban Apologizes Tamannaah: తమిళ సీనియన్ నటుడు, దర్శకుడు పార్తిబన్ వివాదంలో చిక్కుకున్నారు. తమన్నా గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. పలువురు సినీ ప్రముఖులు ఆయనపై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన వెనక్కి తగ్గారు. తన మాటలతో ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే క్షమించాలని కోరారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

తమన్నాపై పార్తిబన్ వివాదాస్పద వ్యాఖ్యలు

తాజాగా పార్తిబన్ ఓ సినిమా వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమన్నా డ్యాన్స్ గురించి కామెంట్స్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాలో కథ ఉందా? లేదా? అనేది ఆడియెన్స్ చూడట్లేదని, తమన్నాడ్యాన్స్‌ చేస్తే హిట్ అయిపోతుందన్నారు. సినిమాలో కథ లేకపోయినా ఫర్వాలేదన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయన్నారు. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఆయన మాటలను పలువురు తప్పుబట్టారు. కళాకారులను అవమానించేలా ఉన్నాయని, ముఖ్యంగా తమన్నాను టార్గెట్ చేసినట్లు ఉన్నాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.  

క్షమాపణలు చెప్పిన పార్తిబన్

సినిమా పరిశ్రమ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో పార్తిబన్‌ క్షమాపణలు చెప్పారు. ఇండస్ట్రీలో పని చేస్తున్న అందరి పైనా తనకు గౌరవం ఉందన్నారు. ఏ ఒక్కరినీ కించపరిచే ఉద్దేశం తనకు లేదని వెల్లడించారు. తన మాటలు ఎవరినైనా ఇబ్బంది పెట్టి క్షమించాలని కోరారు. ‘‘సినిమా ఇండస్ట్రీలో ఉన్న వారిపై నాకు చాలా గౌరవం ఉంది. నటీనటులను తక్కువ చేసే ఉద్దేశం నాకు లేదు. నా మాటలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించండి’’ అంటూ వివరణ ఇచ్చారు.

‘టిన్జ్’ సక్సెస్ మీట్ లో పార్తిబన్ వ్యాఖ్యలు

నటుడు పార్తిబన్ తమిళంతో పాటు తెలుగు సినిమాల్లోనూ సందడి చేశారు. మెగా హీరో రామ్ చరణ్ నటించిన ‘రచ్చ’ సినిమాలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన యాక్టింగ్ పై పలువురు ప్రశంసలు కురిపించారు. రీసెంట్ గా ఆయన ‘టిన్జ్’ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. అడ్వెంచరస్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కింది. జులై 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా చక్కటి విజయాన్ని అందుకుంది. ఆ సినిమా సక్సెస్ మీట్ ను తాజాగా నిర్వహించారు. ఈ వేడుకలోనే ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమన్నా పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘‘ప్రస్తుత రోజుల్లో ప్రేక్షకులు సినిమాలో కథ ఉందా? లేదా? అనే విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. హీరోయిన్ డ్యాన్స్ కోసమే చూస్తున్నారు. తమన్నా సినిమాలో ఉందంటే చాలా ఆ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది” అన్నారు. ఆయన వ్యాఖ్యలు ‘జైలర్’, ‘బాక్’ సినిమాల గురించేనని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన క్షమాపణలు చెప్పి, వివాదానికి ఫుల్ స్టాఫ్ పెట్టే ప్రయత్నం చేశారు.   

Read Also: వ్యక్తి ప్రాణాలు కాపాడిన ఇనయా బాయ్‌ఫ్రెండ్, నెట్టింట్లో వీడియో వైరల్

Read Also: విడాకుల పోస్టుకు లైక్ కొట్టిన అభిషేక్ బచ్చన్, అసలు విషయం తెలిసి ఊపిరి పీల్చుకుంటున్న ఫ్యాన్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
Mohan babu Hospital : బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
Nagababu: నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
Pushpa 2 Collection: 1000 కోట్లు క్లబ్‌లో సినిమా... పుష్పరాజ్ వసూళ్ల జాతర... సామి నువ్వు ఆడాలా బాక్సాఫీస్ బద్దలవ్వాలా
1000 కోట్లు క్లబ్‌లో సినిమా... పుష్పరాజ్ వసూళ్ల జాతర... సామి నువ్వు ఆడాలా బాక్సాఫీస్ బద్దలవ్వాలా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mohan babu Audio on Manchu Manoj | నా గుండెల మీద తన్నావ్ రా మనోజ్ | ABP DesamMohan babu Attack Media | మీడియా ప్రతినిధిని దారుణంగా కొట్టిన మోహన్ బాబు | ABP DesamManchu Mohan babu Attack | కొడుకును, మీడియాను తరిమి కొట్టిన మోహన్ బాబు | ABP Desamముంబయిలో బస్ బీభత్సం, ఏడుగురు మృతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
Mohan babu Hospital : బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
Nagababu: నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
Pushpa 2 Collection: 1000 కోట్లు క్లబ్‌లో సినిమా... పుష్పరాజ్ వసూళ్ల జాతర... సామి నువ్వు ఆడాలా బాక్సాఫీస్ బద్దలవ్వాలా
1000 కోట్లు క్లబ్‌లో సినిమా... పుష్పరాజ్ వసూళ్ల జాతర... సామి నువ్వు ఆడాలా బాక్సాఫీస్ బద్దలవ్వాలా
Mohan Babu Attacks Journalist: మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
Sana Sathish: చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
Mohanbabu Gun:  గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
Vijayawada News: దేవినేని ఉమ, టీడీపీ నేతలకు ఊరట, కేసును కొట్టేసిన విజయవాడ కోర్టు
Vijayawada News: దేవినేని ఉమ, టీడీపీ నేతలకు ఊరట, కేసును కొట్టేసిన విజయవాడ కోర్టు
Embed widget