Telugu Web Series Releases: ఈ వీకెండ్ ఓటీటీల్లో పండగే - అందరి దృష్టి ఆ రెండు తెలుగు వెబ్ సిరీస్‌లపైనే, వచ్చేశాయ్.. చూసేయండి
Telugu Web Series Releases on otts: ఈవారం ఓటీటీ అంతా ఆసక్తికరమైన సినిమాల, వెబ్ సిరీస్‌ల రిలీజ్‌తో నిండిపోయింది. అందులో ముఖ్యంగా రెండు తెలుగు వెబ్ సిరీస్‌పైనే చాలామంది ప్రేక్షకుల ఫోకస్ ఉంది.
This Week OTT Releases: సమ్మర్ అంతా దాదాపుగా పెద్దగా హైప్ ఉన్న సినిమాలు లేకుండానే గడిచిపోయింది. పోనీ వెబ్ సిరీస్‌లు చూడాలనుకున్నా కూడా చాలావరకు అన్నీ చూసిన సిరీస్‌లే చూడాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇక చాలాకాలం తర్వాత ఎన్నో హైప్ ఉన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఈ వారం ఓటీటీ ఫుల్ అయిపోయింది. జూన్ 14న విడుదల అవుతున్న సినిమాలు, సిరీస్‌లపై చాలా హైప్ క్రియేట్ అయ్యింది.
యక్షిణి..
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో జూన్ 14 నుంచి ‘యక్షిణి’ స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్యాంటసీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్‌లో క్యాస్టింగ్ కూడా భారీగానే ఉంది. మంచు లక్ష్మి, వేదిక, రాహుల్ విజయ్, అజయ్.. ఈ సిరీస్‌లో లీడ్ రోల్స్‌లో నటించారు. వీరితో పాటు శ్రీనివాస్, తేజ కాకుమాను, దయానంద్ రెడ్డి, లలిత కుమారి, జెమిని సురేశ్, త్రినాథ్, ప్రణీత కూడా ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలయిన ‘యక్షిణి’ ట్రైలర్.. ఆడియన్స్‌లో ఆసక్తిని పెంచేసింది. తేజ మర్ని దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌తో చాలాకాలం తర్వాత ఒక లీడ్ రోల్‌లో వేదిక అందరినీ పలకరించనుంది.
పరువు..
‘పరువు’ వెబ్ సిరీస్ గురించి ప్రేక్షకులకు తెలియక ముందే.. ఇందులో హీరోయిన్‌గా నటించిన నివేదా పేతురాజ్ ఒక ప్రాంక్ వీడియోతో ఆసక్తి క్రియేట్ చేసింది. పరువు హత్యల నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. జూన్ 14న జీ5లో విడుదలయిన ‘పరువు’ కూడా ఆ కేటగిరికి చెందినదే. సిద్ధార్థ్ నాయుడు, రాజశేఖర్ వడ్లపాటి దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో నివేదాతో పాటు నరేశ్ అగస్త్య, నాగబాబు కీలక పాత్రల్లో నటించారు.
ఓటీటీల్లోకి వచ్చేసిన కొత్త చిత్రాలు
మరోవైపు ఓటీటీల్లో కూడా కొత్త చిత్రాలు సందడి చేస్తున్నాయి. థియేటర్లలో భారీ అంచనాలతో విడుదలై చతికిలపడ్డ సినిమాలు.. ఈ వారం ఓటీటీలో అగ్ని పరీక్షకు సిద్ధమవుతున్నాయి. మరి, తెలుగు ప్రేక్షఖులు ఏ మూవీకి ఎక్కువ ఓట్లేస్తారో చూడాలి.
నెట్‌ఫ్లిక్స్
- మహారాజ్ (హిందీ సినిమా) - 14
- మిస్టరీస్ ఆఫ్ టెర్రకోట వారియర్స్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సినిమా) - జూన్ 12
- బ్రిడ్జ్‌టన్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) - జూన్ 13
- గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (తెలుగు సినిమా) - జూన్ 14
ఆహా
- పారిజాత పర్వం (తెలుగు సినిమా) - జూన్ 12
జియో సినిమా
- గంత్ (హిందీ వెబ్ సిరీస్) - జూన్ 11
యాపిల్ టీవీ ప్లస్
- ప్రిజ్యూమ్డ్ ఇన్నోసెంట్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) - జూన్ 12
బుక్ మై షో
- ది ఫాల్ గై (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 14
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
- ప్రొటెక్టింగ్ ప్యారడైజ్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సిరీస్) - జూన్ 10
నెట్ డెడ్ యెట్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) - జూన్ 12
జీ5
- లవ్ కీ అరేంజ్ మ్యారేజ్ (హిందీ సినిమా) - జూన్ 14
అమెజాన్ ప్రైమ్
- ది బాయ్స్ 4 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) - జూన్ 13
- లవ్ మీ (తెలుగు సినిమా) - జూన్ 14