Sweet Karam Coffee Trailer: 'స్వీట్ కారం కాఫీ' ట్రైలర్ - ముగ్గురు మహిళల అందమైన రోడ్ జర్నీ, స్ట్రీమింగ్ ఆ ఓటీటీలోనే!
అలనాటి సీనియర్ అంటి లక్ష్మి, మధుబాల, శాంతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా వెబ్ సిరీస్ 'స్వీట్ కారం కాఫీ'. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్న ఈ వెబ్ సిరీస్ కి సంబంధించి తాజాగా ట్రైలర్ విడుదలైంది.
ఓటీటీ మాధ్యమాలు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సినీ ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా కంటెంట్ ఉన్న సినిమాలన్నింటినీ ఎంచక్కా ఇంట్లో కూర్చుని మరి చూసేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఓటీటీ కల్చర్ పెరిగిన తర్వాత నుంచి వెబ్ సిరీస్ లకు బాగా అలవాటు పడిపోయారు సినీ ప్రియులు. ఒకప్పుడు టీవీలో సీరియల్స్ చూసే జనరేషన్ నుంచి ఇప్పుడు ఓటీటీలో సినిమాలు చూసే జనరేషన్ కి ఆడియన్స్ అప్డేట్ అవ్వడంతో మేకర్స్ కూడా మంచి మంచి కంటెంట్ తో ఓటిటిలో సినిమాలు, వెబ్ సిరీస్ లను అందిస్తున్నారు. దీంతో టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే ఈ ఓటిటి కల్చర్ పెరుగుతూ వస్తోంది. రెండు గంటల్లో చెప్పలేని కథల్ని వెబ్ సిరీస్ గా తెరకెక్కిస్తూ వాటిని ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ ఓ డిఫరెంట్ స్టోరీ తో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సిరీస్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. ఆ సిరీస్ పేరే 'స్వీట్ కారం కాఫీ'. మూడు జనరేషన్లకు చెందిన మహిళల కథగా ఈ సిరీస్ ఉండబోతోంది. మురారి, నిన్నే పెళ్ళాడుతా, నాని గ్యాంగ్ లీడర్ సినిమాల్లో నటించిన అలనాటి సీనియర్ నటి లక్ష్మి ఇందులో సీనియర్ జనరేషన్ పాత్రలో కనిపించనుండగా, రోజా మూవీతో కుర్రాళ్ళ మనసు దోచుకున్న మధుబాల మిడిల్ జనరేషన్ పాత్రలో కనిపించనుంది. దీనితో పాటు తమిళ నటి శాంతి మిడిల్ జనరేషన్ రోల్ లో నటించింది. జూలై 6 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్న ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
ట్రైలర్ చూస్తుంటే ఎంతో ఆసక్తికరంగా ఉంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళల కథే ఈ వెబ్ సిరీస్. ఒక విధంగా ఒకే ఫ్యామిలీకి చెందిన మూడు తరాలకు సంబంధించిన కథ అని చెప్పవచ్చు. ఇక ఇందులో బామ్మ పాత్రను పోషించిన లక్ష్మి తన వృద్ధాప్యంలో ఇంట్లో నుంచి ఎక్కడికైనా బయటికి వెళ్లి గడపాలని అనుకుంటుంది. కానీ అతని కొడుకు మాత్రం ఆమెను ఇంట్లోనే ఓ చిన్న పిల్లలా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. ఇక కుమార్తె పాత్రను పోషించిన శాంతి ఓ క్రికెటర్ గా తన కెరియర్ తో సమానంగా తనను గౌరవించే భాగస్వామి కోసం వెతుకుతుంటుంది. ఇక గృహిణి పాత్ర పోషించిన మధుబాల తనకు ఇళ్లే ప్రపంచం. కానీ సొంత ఇంట్లో తన భర్త, కొడుకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోవడంతో ఆమె విసిగిపోతుంది.
అలా ఒకే ఫ్యామిలీకి చెందిన లక్ష్మీ, మధు, శాంతి ఈ ముగ్గురు ఇంట్లో తమ వ్యక్తిగత సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. దాంతో ఇంటికి దూరంగా ఎక్కడికైనా బయటికి గడపాలని అనుకుంటారు. అలా ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఆ ముగ్గురు ఓ రోడ్ ట్రిప్ వేస్తారు. ఆ ట్రిప్ లో స్వేచ్ఛగా తమ ప్రయాణాన్ని ఎలా కొనసాగించారు? ఆ జర్నీలో వాళ్లకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనేది ఈ ట్రైలర్ లో చూపించారు. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ ఒక్కసారిగా వెబ్ సిరీస్ పై అంచనాలను పెంచేసింది. కాగా 8 ఎపిసోడ్లు కలిగిన ఈ వెబ్ సిరీస్ జూలై 6 నుండి అమెజాన్ ప్రైమ్ లో తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
Also Read : 'బేబీ' రిలీజ్ డేట్ పోస్టర్ వివాదం - క్షమాపణలు కోరిన దర్శకుడు!
View this post on Instagram