అన్వేషించండి

Save The Tigers 3 OTT : సేవ్ ది టైగర్స్ 3 వచ్చేస్తోంది - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

Save The Tigers 3 OTT Platform : సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ సీజన్ 3 వచ్చేస్తోంది. లేటెస్ట్ ట్రైలర్ నవ్వులు పూయిస్తుండగా... స్ట్రీమింగ్ డేట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.

Save The Tigers Web Series Season 3 OTT Release Date Locked : సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వెబ్ సిరీస్ 'సేవ్ ది టైగర్స్' గత రెండు సీజన్స్ బ్లాక్ బస్టర్స్‌గా నిలవగా... సరికొత్తగా మూడో సీజన్ వచ్చేస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. రియల్ లైఫ్‌లో భార్యాభర్తల మధ్య జరిగిన చిన్న చిన్న తగాదాలనే రీల్ లైఫ్‌లో నవ్వించేలా చూపించారు. 

ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

ఈ సిరీస్ జూన్ 19 నుంచి ప్రముఖ ఓటీటీ జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. అభినవ్ గోమఠం, ప్రియదర్శి, చైతన్య కృష్ణతో కలిసి దేవియాని శర్మ, పావని గంగిరెడ్డి, జోర్దార్ సుజాత, రోహిణి తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ సీజన్‌లో వెన్నెల కిశోర్ కీలకపాత్ర పోషిస్తున్నారు. శ్రీరామ్ ఎరగం దర్శకత్వం వహిస్తుండగా... మహి వి.రాఘవ్, ప్రదీప్ అద్వైతం షో రన్నర్స్‌గా వ్యవహరిస్తున్నారు. 

నవ్వులు పూయిస్తున్న ట్రైలర్

'ఎవరన్నా... చిన్నప్పటి నుంచి పెళ్లి గురించి మనకు ఇన్ని అబద్ధాలు చెప్పింది. పెళ్లంటే పండు వెన్నెల. పెళ్లాం అంటే నిండు పున్నమి అని...' అంటూ అభినవ్ గోమటం చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభం కాగా... బార్‌లో ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి పెళ్లి, జీవితం గురించి మాట్లాడుకుంటుంటారు. ఇక్కడ ఇంద్రుడి పాత్రలో వెన్నెల కిశోర్ ఎంట్రీ అద్భుతం. 'పెళ్లి అనేది గాలికి వెళ్లిపోయే ముళ్లకంప అని తెలిసినా, ఎగిరి ఎగిరి మరీ అడ్డం పడతారు. ఆ తర్వాత ముళ్ల లాక్కోలేక ఏడుస్తారు.' అంటూ ఆయన చెప్పే డైలాగ్ నవ్వులు పూయిస్తోంది.

అక్కడి నుంచి కథ వేరే ట్రాక్ ఎక్కుతుంది. ఘంటా రవి (ప్రియదర్శి) ఎమ్మెల్యేగా ఎదుగుతాడు. రాహుల్ గొప్ప స్క్రీన్ ప్లే రైటర్ అవుతాడు. విక్రమ్ ఓ పెద్ద కంపెనీకి సీఈవో అవుతాడు. కోర్టులో, ఇంట్లో జరిగే చిన్న చిన్న తగాదాలతో నవ్వులు పూయించింది ట్రైలర్. ఫుల్ ఫన్, ఎంటర్టైన్మెంట్ ఇచ్చేలా మూడో సీజన్ నెక్స్ట్ లెవల్‌లో రూపొందించారని ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by JioHotstar Telugu (@jiohotstartelugu)

Also Read : సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు

సేవ్ ది టైగర్స్ నటీనటులు : ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ, జోర్దార్ సుజాత, పావని గంగిరెడ్డి, దేవియాని శర్మ, వెన్నెల కిషోర్, రోహిణి, హర్షవర్ధన్, శ్రీకాంత్ అయ్యంగార్, గుండు సుదర్శన్, మిర్చి కిరణ్, అభయ్ బేతిగంటి, ముక్కు అవినాష్ తదితరులు.

టెక్నికల్ టీం : క్రియేటర్స్ : ప్రదీప్ అద్వైతం, మహి వి. రాఘవ్, నిర్మాతలు: శివ మేక, సాహితీ చింతలపూడి, దర్శకత్వం : శ్రీరామ్ ఎరగం
సినిమాటోగ్రఫీ : విశ్వేశ్వర్ సిలకోటి, సంగీతం : అజయ్ అరసాడ, రచయితలు : విజయ్ నామోజు, డిఎస్ గౌతమ్.

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

The Court OTT : ఓటీటీలోకి సరికొత్త కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - తండ్రీ కూతుళ్ల మధ్య వార్... ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సరికొత్త కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - తండ్రీ కూతుళ్ల మధ్య వార్... ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
Friday OTT Movies : ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
Memu Copulam Series OTT : మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget