Paruchuri Gopala Krishna: అసలు ‘గుంటూరు కారం’ టైటిలే తప్పు, సినిమాలో జరిగిన పొరపాటు ఇదే - పరుచూరి గోపాలకృష్ణ
Paruchuri Gopala Krishna: మహేశ్ బాబు రీసెంట్ సినిమా ‘గుంటూరు కారం’పై పరుచూరి గోపాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా టైటిల్ అలా పెట్టకుండా ఉండాల్సింది అని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Paruchuri Gopala Krishna About Guntur Karam Movie: మహేశ్ బాబు రీసెంట్ సినిమా ‘గుంటూరు కారం’పై పరుచూరి గోపాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా టైటిల్ అలా పెట్టకుండా ఉండాల్సింది అని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మొదట మిక్స్‌డ్ టాక్ అందుకున్న ఈ సినిమా ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో మహేశ్‌బాబు వన్‌మ్యాన్ షో చేశారు. తన డ్యాన్స్, ఫైటింగ్‌తో ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించారు. 'ఆ కుర్చీని మడతబెట్టి' సాంగ్ గురించైతే చెప్పక్కర్లేదు. దాంట్లో హీరోయిన్ శ్రీలీల, మహేశ్‌బాబు ఇరగదీశారు. ఇక ఆ సాంగ్ కూడా తెగ వైరల్ అయ్యింది. ఇక ఇప్పుడు ఆ పవర్‌ప్యాక్ పర్ఫామెన్స్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఆ సినిమాని ఓటీటీలో చూసిన ప్రముఖ మాటల రచయిత పరుచూరి గోపాల కృష్ణ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినిమాలో సెంటిమెంట్ అస్సలు పండలేదని, సినిమాకి ఆ టైటిల్ పెట్టకుండా ఉండాల్సింది అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
‘‘ఈ సినిమా కథనం కాస్త కన్ ఫ్యూజన్ అనిపించింది. థియేటర్లలో చూసిన ప్రేక్షకులకు ఎలా అర్థం అయ్యిందో నాకు తెలీదు. మళ్లీ చూస్తే ఏమైనా అర్థం అవుతుందేమో చూడాలి. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లేతో ఆడుకున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా మంచి టైటిల్స్ పెడతాడు. కానీ, ఈ సినిమాకి ఈ టైటిల్ కరెక్ట్ కాదు అనిపించింది. టైటిల్ లో ఉన్నట్లుగా హీరోని ఘాటుగా చూపించారు. ఆయన అన్ని సినిమాల్లో కల్లా.. ఇది కొంచెం తేడాగా అనిపించింది. ‘గుంటూరు అబ్బాయి’ అనే టైటిల్ పెట్టి ఉంటే ఫ్యామిలీ సెంటిమెంట్ అని ప్రేక్షకులు అర్థం చేసుకునేవాళ్లు. రమ్యకృష్ణ- మహేశ్ బాబు అనగానే.. శారద- బాలకృష్ణ, వాణిశ్రీ- చిరంజీవి కాంబినేషన్‌లానే ఉంటుందని ఊహించుకున్నా. కానీ, ఇది తల్లీకొడుకుల కథ. ఇందులో కథానాయకుడు.. అమ్మను దైవంలా కొలుస్తాడు తప్ప టీజ్ చేయలేడు, ఇబ్బంది పెట్టలేడు. ఈ సినిమా విషయంలో జరిగిన పొరపాటు అదే. అద్భుతంగా కథలు రాసే త్రివిక్రమ్ ఇది చాలు అనుకున్నాడేమో. రూ.200 కోట్లు పెట్టి సినిమా తీస్తే.. రూ.300 కోట్లు వస్తేనే అన్నీ పోను.. ఒక రూపాయి లాభం అని మా ఫిలిమ్ ఇండస్ట్రీలో భావన’’ అని అన్నారు పరుచూరి.
సెంటిమెంట్ పండలేదు...
‘‘తల్లీ కొడుకు, తాతా - మనవడు సెంటింటెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. అవి విజయం సాధించాయి. కానీ, ఈ సినిమాలో అవేవీ పండలేదు. హీరోయిన్ సంతకం కోసం రావడం, దాని కోసం ప్రేమలో పడేయాలి అనుకోవడం పాజిటివ్ గా అనిపించలేదు. రమ్యకృష్ణ వాళ్లు నాటకం, మరోవైపు ప్రకాశ్ రాజ్ బృందం మరో నాటకం. అలా కాకుండా.. ఎమోషన్స్ డెవలప్ చేసుకుంటే సినిమా మరోలా ఉండేదేమో. ఒకానొక సమయంలో ఫలానా పాత్రలో మార్పు వస్తుందని ఊహించా. కానీ, అలా జరగలేదు. ఏమైనా క్యారెక్టర్ లో రియలైజేషన్ వచ్చేలా కథ ఉంటే.. కచ్చితంగా సెంటిమెంట్ పండేది. త్రివిక్రమ్, మహేశ్ కాంబో కాబట్టి కలెక్షన్స్ వస్తాయి. డబ్బులు రావడం వేరు, సంతృప్తి రావడం వేరు. త్రివిక్రమ్ అంటే నాకు అభిమానం. ఆయన మళ్లీ మంచి కథతో వస్తారని ఆశిస్తున్నా’’ అని అన్నారు పరుచూరి.
Also Read: 'భామాకలాపం - 2'కి పైరసీ దెబ్బ - రిలీజైన గంటలోనే ఆన్ లైన్‌లో లీక్