అన్వేషించండి

Papam Prathap OTT : ఓటీటీలోకి తిరువీర్ పాపం ప్రతాప్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

Papam Prathap OTT Platform : యంగ్ హీరో తిరువీర్ నటించిన లేటెస్ట్ కామెడీ డ్రామా పాపం ప్రతాప్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ 20 రోజుల్లోపే స్ట్రీమింగ్ అవుతోంది.

Thiruveer's Papam Prathap OTT Release Date Locked : టాలీవుడ్ యంగ్ హీరో తిరువీర్, పాయల్ రాథాకృష్ణ జంటగా నటించిన రీసెంట్ ఫ్యామిలీ కామెడీ డ్రామా 'పాపం ప్రతాప్'. ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు 20 రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.

ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ తెలుగు ఓటీటీ 'ఈటీవీ విన్' సొంతం చేసుకోగా... ఈ నెల 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ఈ మూవీకి ఎస్పీ దుర్గా నరేశ్ దర్శకత్వం వహించగా... తిరువీర్, పాయల్‌లతో పాటు అజయ్ ఘోష్, రాశి, దేవి ప్రసాద్, గోపరాజు రమణ, రవి ఆంటోని, రఘుబాబు, ప్రసాద్ బెహర, అవసరాల శ్రీనివాస్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కేఎం రాధాకృష్ణ మ్యూజిక్ అందించారు. థియేటర్లలో అంతంత మాత్రం రెస్పాన్స్ వచ్చిన ఈ సినిమా మరి ఓటీటీలోకి ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాల్సి ఉంది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ETV Win (@etvwin)

Also Read : రియల్ జన నాయగన్ - విజయ్ టాప్ ట్రెండింగ్ పొలిటికల్ మూవీస్... ఏ ఓటీటీల్లో చూడొచ్చంటే?

స్టోరీ ఏంటంటే?

ఓ విలేజ్‌లో భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు, అలకలు, ఫ్యామిలీ ఎమోషన్స్ ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. ప్రతాప్ (తిరువీర్)ది సీతారామపురం అనే విలేజ్. చిన్నప్పటి నుంచి బుజ్జమ్మ (పాయల్ రాధాకృష్ణ)ను ఇష్టపడతాడు. ఆమె కూడా అతన్ని ఇష్టపడుతుంది. తండ్రి వీరయ్య (అజయ్ ఘోష్)కు ఇష్టం లేకపోయినా బుజ్జమ్మతో కలిసి ఏడడుగులు వేస్తాడు. తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నావని, ఇంటి పరువు పోయేలా ఏదైనా చేస్తే చంపేస్తానని కొడుక్కి వార్నింగ్ ఇస్తాడు.

మొదటి 3 రాత్రులు గడిచిన తర్వాత ప్రతాప్‌కు సమస్య ఉందంటూ పంచాయతీ పెడుతుంది బుజ్జమ్మ. తనలోని సమస్య ఏంటో తనే తెలుసుకుని సరిదిద్దుకుంటేనే కాపురానికి వస్తానని తెగేసి చెప్పేస్తుంది. అయితే, ఆ సమస్య ఏంటి అనేది మాత్రం పంచాయతీ పెద్దలకు చెప్పదు. దీంతో ప్రతాప్‌పై ఊరి వారికి లేని పోని అనుమానాలు వస్తుంటాయి. అసలు ప్రతాప్ సమస్య ఏంటి? తన సమస్య ఏంటో తెలుసుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? చివరకు బుజ్జమ్మ, ప్రతాప్ ఒక్కటయ్యారా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

Also Read : విజయ్, త్రిష టాప్ ట్రెండింగ్ మూవీస్ - ఏ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయంటే?

Also Read : విజయ్ గ్రాండ్ విక్టరీ - ట్రెండింగ్‌లో జన నాయగన్...టైటిల్ మార్చాలంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

The Court OTT : ఓటీటీలోకి సరికొత్త కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - తండ్రీ కూతుళ్ల మధ్య వార్... ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సరికొత్త కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - తండ్రీ కూతుళ్ల మధ్య వార్... ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
Friday OTT Movies : ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
Memu Copulam Series OTT : మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
Telangana Free Sewing Machine Scheme: తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
Embed widget