News
News
వీడియోలు ఆటలు
X

Priya Banerjee: ‘కిస్’ టు ‘అసుర’ - ‘రానా నాయుడు’ బ్యూటీ ప్రియా బెనర్జీ గురించి ఈ విషయాలు తెలుసా?

‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ లో నటించిన ప్రియా బెనర్జీ వెబ్ సిరీస్ లో తన పాత్ర గురించి చెప్పుకొచ్చింది. ఈ వెబ్ సిరీస్ లో ఆమె మందిర అనే బాలీవుడ్ హీరోయిన్ పాత్రలో నటించానని చెప్పింది.

FOLLOW US: 
Share:

ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ చూసినా ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ గురించే మాట్లాడుకుంటున్నారు. విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో నటించిన ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా ట్రెండ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ లో వెంకటేష్, రానా తండ్రీకొడులుగా పరస్పర విరుద్ద పాత్రలలో కనిపించారు. మార్చి 10 నుంచి ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ వెబ్ సిరీస్ లో నటించిన నటీమణులకు కూడా ఫుల్ క్రేజ్ వచ్చేసింది. ముఖ్యంగా నటి ప్రియా బెనర్జీ నటించిన ‘మందిర’ పాత్రకు మంచి స్పందన వస్తోంది.  

View this post on Instagram
 
A post shared by Priya Banerjee (@priyabanerjee)

‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ విడుదల అయినప్పటి నుంచీ దీనిపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ సిరీస్ లో అశ్లీల సన్నివేశాలు, ఇబ్బందికర డైలాగ్ లు ఉండటంతో విమర్శలు వెల్లువెత్తాయి. కానీ ఓ వైపు విమర్శలు వస్తున్నా మరో వైపు దేశవ్యాప్తంగా ఈ వెబ్ సిరీస్ ట్రెండింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో వెబ్ సిరీస్ లో నటించిన ప్రియా బెనర్జీ వెబ్ సిరీస్ లో తన పాత్ర గురించి చెప్పుకొచ్చింది. ఈ వెబ్ సిరీస్ లో తాను మందిర అనే బాలీవుడ్ హీరోయిన్ పాత్రలో నటించానని చెప్పింది. ఇందులో తనకు రానాకు ప్రత్యకమైన ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఉంటుందని చెప్పింది. తాను ఎన్నో పాత్రలు చేశానని, కానీ మందిర పాత్ర తనకు చాలా ప్రత్యేకమైనదని చెప్పింది. ఎందుకంటే ఈ పాత్ర తాను ఇండస్ట్రీలో చూసిన కొంతమంది సెలబ్రెటీల జీవితాలను పోలి ఉంటుందని పేర్కొంది. అందుకే ఈ పాత్ర అంటే తనకు ఇష్టమని చెప్పింది. మందిర పాత్రను అర్థం చేసుకోవడం కష్టమని, అర్థమైతే చాలా నచ్చుతుందని చెప్పింది.  ఈ వెబ్ సిరీస్ కోసం తన పొడవాటి జుట్టును కత్తిరించాల్సి వచ్చిందని, అందుకు ముందు కాస్త బాధ అనిపించినా.. అలా చేయడం వలనే పాత్రలోకి త్వరగా వెళ్లగలిగానని చెప్పుకొచ్చింది. 

View this post on Instagram
 
A post shared by Priya Banerjee (@priyabanerjee)

ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తోన్న తెలుగు పరిశ్రమతోనే తన సినిమా కెరీర్ ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని ప్రియా పేర్కొంది. ఇక్కడ పరిశ్రమ మనకు చాలా నేర్పుతుందని, ప్రేక్షకులు కూడా కొత్త టాలెంట్ ను ప్రోత్సహిస్తారని చెప్పింది. తాను పరిశ్రమలో అడుగుపెట్టినపుడు తనకు తెలుగు అంతగా రాదని, కానీ ఇక్కడ తనను చాలా బాగా చూసుకున్నారని తెలిపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న పరిశ్రమలన్నీ కలసి పనిచేయాల్సిన సమయం వచ్చిందని, తాను సరైన సమయంలోనే ఇండస్ట్రీలోకి వచ్చానని చెప్పుకొచ్చింది. సినిమాల మధ్య అడ్డగోడలు తొలగిపోవడంతో మంచి కథలు కూడా వస్తున్నాయని పేర్కొంది.

View this post on Instagram
 
A post shared by Priya Banerjee (@priyabanerjee)

ఇక ప్రియా బెనర్జీ సినిమాల విషయానికొస్తే.. ఆమె బాలీవుడ్ లో రానిస్తున్నా టాలీవుడ్ లోనే తెరంగేట్రం చేసింది. 2013లో అడివి శేష్ నటించిన ‘కిస్’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత సందీప్ కిషన్‌తో ‘జోరు’, నారా రోహిత్‌తో ‘అసుర’ వంటి తెలుగు సినిమాలలో నటించింది. తర్వాత బాలీవుడ్ లో ‘జబ్బా’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అక్కడ పలు సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటించింది ప్రియా. తమిళంలోనూ ప్రియా ఓ సినిమాలో నటించింది. అయితే, సినిమాల్లో ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. పైగా ఆమె నటించిన తెలుగు సినిమాలు పదేళ్లు దాటిపోవడంతో ప్రియా బెనర్జీ ఎవరికీ గుర్తులేదు. అయితే, అప్పటికీ ఇప్పటికీ ఆమెలో ఏ మాత్రం మార్పులేదని.. పదేళ్ల కిందట సినిమాల్లో కనిపించిన లుక్‌లోనే ఆమె ఉందని ప్రేక్షకులు అంటున్నారు. 

Read Also: మహేష్ బాబు, రాజమౌళి సినిమాపై కీరవాణి కీలక వ్యాఖ్యలు - ఫ్యాన్స్‌కు పండుగే!

View this post on Instagram
 
A post shared by Priya Banerjee (@priyabanerjee)

2017లో ఓ కార్యక్రమంలో రానాతో ప్రియా బెనర్జీ

View this post on Instagram
 
A post shared by Priya Banerjee (@priyabanerjee)

Published at : 20 Mar 2023 12:04 PM (IST) Tags: Venkatesh Rana Rana Naidu Priya Banerjee Priya Banerjee Movies

సంబంధిత కథనాలు

బాలయ్య మూవీ టైటిల్ ఇదేనా, సమంత చెప్పులు చాలా కాస్ట్లీ గురూ - ఈ రోజు టాప్ 5 సినీ విశేషాలివే

బాలయ్య మూవీ టైటిల్ ఇదేనా, సమంత చెప్పులు చాలా కాస్ట్లీ గురూ - ఈ రోజు టాప్ 5 సినీ విశేషాలివే

Dheekshith Shetty : ధరణి ఫ్రెండ్ సూరిగాడికి తెలుగులో ఇంకో వెబ్ సిరీస్ - ఈసారి కాలేజీ పోరగాడిగా!

Dheekshith Shetty : ధరణి ఫ్రెండ్ సూరిగాడికి తెలుగులో ఇంకో వెబ్ సిరీస్ - ఈసారి కాలేజీ పోరగాడిగా!

2018 Movie OTT Release : నెల రోజుల్లోనే ఓటీటీలోకి రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ '2018' - ఎప్పుడు? ఎక్కడ? అంటే...

2018 Movie OTT Release : నెల రోజుల్లోనే ఓటీటీలోకి రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ '2018' - ఎప్పుడు? ఎక్కడ? అంటే...

Shaitan Web Series : గేరు మార్చిన మహి - కామెడీ కాదు, సీరియస్ క్రైమ్ గురూ!

Shaitan Web Series : గేరు మార్చిన మహి - కామెడీ కాదు, సీరియస్ క్రైమ్ గురూ!

OTT Releases in June: ఈ వారం ఓటీటీ, థియేటర్‌లలో రిలీజయ్యే మూవీస్ ఇవే

OTT Releases in June: ఈ వారం ఓటీటీ, థియేటర్‌లలో రిలీజయ్యే మూవీస్ ఇవే

టాప్ స్టోరీస్

AP Registrations : ఏపీలో రివర్స్ రిజిస్ట్రేషన్ల పద్దతి - ఇక మాన్యువల్‌గానే ! సర్వర్ల సమస్యే కారణం

AP Registrations :   ఏపీలో రివర్స్ రిజిస్ట్రేషన్ల పద్దతి - ఇక మాన్యువల్‌గానే ! సర్వర్ల సమస్యే  కారణం

KTR : జనాభాను నియంత్రించినందుకు దక్షిణాదికి అన్యాయం - కేటీఆర్ కీలక వ్యాఖ్యలు !

KTR  :   జనాభాను నియంత్రించినందుకు దక్షిణాదికి అన్యాయం  - కేటీఆర్ కీలక వ్యాఖ్యలు !

BRO Update: డబ్బింగ్ కార్యక్రమాలు షురూ చేసిన పవన్ కల్యాణ్ 'బ్రో' - మరీ ఇంత ఫాస్టా?

BRO Update: డబ్బింగ్ కార్యక్రమాలు షురూ చేసిన పవన్ కల్యాణ్ 'బ్రో' - మరీ ఇంత ఫాస్టా?

Kakani Satires On Chandrababu: మేనిఫెస్టోని వెబ్ సైట్ నుంచి డిలీట్ చేసిన ఘనత చంద్రబాబుదే- మంత్రి కాకాణి

Kakani Satires On Chandrababu: మేనిఫెస్టోని వెబ్ సైట్ నుంచి డిలీట్ చేసిన ఘనత చంద్రబాబుదే- మంత్రి కాకాణి