అన్వేషించండి

Isakapatnam OTT : ఓటీటీలోకి ఇసాకపట్నం - అవెయిటెడ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

Isakapatnam OTT Platform : లేటెస్ట్ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఇసాకపట్నం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. స్పెషల్ పోస్టర్‌తో అఫీషియల్‌గా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు మేకర్స్.

Sunil's Isakapatnam OTT Release Date Locked : క్రైమ్ థ్రిల్లర్స్‌కు తెలుగులో ఉండే క్రేజ్ గురించి  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి జానర్‌లో రాబోతోన్న అవెయిటెడ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ఇసాకపట్నం'. ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.

ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

7 ఎపిసోడ్స్‌తో ఇసాకపట్నం వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జులై 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 'మూడు శక్తులు ఢీ కొన్నప్పుడు ఏం జరుగుతుంది?' అంటూ పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించగా... సముద్ర ఖని, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించారు.

అలాగే, సునీల్, నరేష్ అగస్త్య, మెరిన్ ఫిలిప్, సుధాకర్ కోమకుల, రాజీవ్ కనకాల, మైమ్ గోపి, రోహిణి, బెనర్జీ, జ్వాలా కోటి, రవివర్మ తదితరులు కీలకపాత్రలు పోషించారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో డబ్బింగ్ వెర్షన్, ఇంగ్లీష్ సహా 15 భాషల్లో సబ్ టైటిల్స్‌తో అందుబాటులోకి రానుంది. తామాడ మీడియా బ్యానర్‌పై రాహుల్ తమడ, సాయిదీప్ రెడ్డి బొర్రా నిర్మించారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by prime video IN (@primevideoin)

Also Read : Vishwak Sen : రెండు సినిమాలు... కార్నర్ సీట్... OYOలో ఎండింగ్ - ప్రజెంట్ లవ్ ట్రెండ్‌పై అల్లు అరవింద్

స్టోరీ ఏంటంటే?

1990నాటి బ్యాక్ డ్రాప్ కోస్తాంధ్రలో కల్పిత పోర్ట్ టౌన్ నేపథ్యంలో ఈ సిరీస్ స్టోరీ సాగుతుంది. అధికారం కోసం జరిగే పోరాటాలు, కుటుంబ విభేదాలు, రాజకీయకుట్రలు, గ్యాంగ్‌స్టర్ సంఘర్షణలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. పోర్టులో పవర్ ఫుల్ వ్యక్తి సామ్రాజ్యంపై ముగ్గురు వ్యక్తులు చేసే పోరాటమే ఈ స్టోరీ అని తెలుస్తోంది. న్యాయం కోసం తపించే ఓ మహిళ,  ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్న ఓ సామాన్యుడు అందరి పోరాటం హైలెట్‌గా నిలవనుంది.

'ఇసాకపట్నం' కేవలం రివేంజ్ థ్రిల్లర్ మాత్రమే కాదని... రాజకీయ ఆధిపత్య పోరాటం, వ్యక్తిగత నష్టం, కుటుంబ విభేదాలు వంటి అంశాలు ఎమోషనల్ మిళితం చేసిన కథ ఇదేనని నిర్మాతలు రాహుల్ తమడా, సందీప్ రెడ్డి బొర్రా తెలిపారు. పోర్ట్ టౌన్ ప్రపంచాన్ని సహజంగా తెరపై ఆవిష్కరించడానికి తమ టీం ఎంతో కృషి చేసిందని చెప్పారు.

Also Read : Pawan Kalyan : ధురంధర్‌పై పవన్ కల్యాణ్ రివ్యూ - పవర్ స్టార్‌కు ఏ జానర్ మూవీస్ ఇష్టమో తెలుసా?

 

 

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pyaar Prema Kalyanam OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Janhvi Kapoor: ఓటీటీలోకి జాన్వీ కపూర్... తమిళ వెబ్ సిరీస్‌లో ఆమె పాత్ర అదేనా?
ఓటీటీలోకి జాన్వీ కపూర్... తమిళ వెబ్ సిరీస్‌లో ఆమె పాత్ర అదేనా?
Love Drama OTT : సంతోష్ శోభన్ లవ్ రొమాంటిక్ మూవీ - ఐదేళ్ల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్
సంతోష్ శోభన్ లవ్ రొమాంటిక్ మూవీ - ఐదేళ్ల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget