News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Asvins: ఓటీటీలోకి హార్రర్ మూవీ ‘అశ్విన్స్’ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తరుణ్ తేజ్ దర్శకత్వంలో తెరకెక్కిన హార్రర్ థ్రిల్లర్ సినిమా ‘అశ్విన్స్’. ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి విడుదల కానుంది. ఈ మేరకు ఒక అధికారిక ప్రకటన చేసింది మూవీ టీమ్.

FOLLOW US: 
Share:

Asvins: తరుణ్ తేజ్ దర్శకత్వంలో తెరకెక్కిన హార్రర్ థ్రిల్లర్ సినిమా ‘అశ్విన్స్’. ఈ సినిమా తెలుగు, తమిళ్ లో ఒకేసారి విడుదల అయిది. ఈ మూవీను ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఇందులో వసంత్ రవి ప్రధాన పాత్ర పోషించగా విమల రామన్ మరో కీలక పాత్రలో కనిపించింది. ఈ సినిమా ఒక కొత్త తరహా హార్రర్ సినిమాను ప్రేక్షకులకు పరిచయం చేసిందనే చెప్పాలి. ఈ మూవీ జూన్ 23వ తేదీన థియేటర్స్ లో విడుదల అయింది. కానీ ఆశించనంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కథలో ఉన్న చిన్న చిన్న లోపాల తప్పితే ఓవరాల్ గా సినిమా ప్రేక్షకులని భయపెట్టడంలో కొంత సక్సెస్ అయిందనే చెప్పొచ్చు. అందుకే ఈ మూవీను ఓటీటీలో ఎక్కువగా చూడటానికి ఇష్టపడుతున్నారు హార్రర్ మూవీ లవర్స్. ఇప్పుడీ మూవీ ఓటీటీలో విడుదల కానుంది. ఈ మేరకు ఓటీటీ స్ట్రీమింగ్ డీటైయిల్స్ ను వెల్లడించారు మేకర్స్. 

నెట్ ఫ్లిక్స్ లో ‘అశ్విన్స్’..

ఈ మధ్య కాలంలో ఓటీటీలకు ప్రాధాన్యత బాగా పెరిగింది. కొన్ని సినిమాలు థియేటర్లలో అంతగా సక్సెస్ కాకపోయినా తర్వాత ఓటీటీలలో ఆకట్టుకుంటున్నాయి. కొన్ని సినిమాలను నేరుగా ఓటీటీలలో చూడటానికే ఇష్టపడుతున్నారు ప్రేక్షకులు. గతంలో వచ్చిన ‘మసూద’ లాంటి హార్రర్ సినిమాలు కూడా థియేటర్లలో కంటే ఓటీటీలోనే ఎక్కువగా ఆదరణ పొందాయి. ఇప్పుడీ కోవలోకి మరో హార్రర్ సినిమా రాబోతోంది అదే ‘అశ్విన్స్’. ఆత్మకీ ఆశ్వీనీలు అనే దేవతలకూ లింక్ చేస్తూ రూపొందించిన ఈ సినిమా జులై 20 నుంచీ ఓటీటీలో అందుబాటులో ఉంటుంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఈ మూవీను స్ట్రీమింగ్ చేయనుంది. ఈ మేరకు మూవీ మేకర్స్ అధికారిక ప్రకటనను విడుదల చేశారు. 

‘అశ్విన్స్’ కథేంటంటే?

అశ్విన్స్ అనే దేవతలకు సంబంధించిన కథే ఈ ‘అశ్విన్స్’. ఈ మూవీ కథ విషయానికొస్తే.. ఒక ఐదుగురు స్నేహితులు డార్క్ టూరిజం మీద వీడియోలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఒక ఇంగ్లాండ్ లోని ఓ పాడుబడ్డ బంగళాను వీడియో తీయడానికి బయలుదేరతారు. వీరందరినీ అర్జున్(వసంత్ రవి) లీడ్ చేస్తూ ఉంటాడు. అయితే ఈ బంగళాలో ఒక ఆత్మ తిరుగుతూ ఉంటుంది. అంతకు ముందే కొంతమందిని ఆ ఆత్మ చంపేస్తుంది. అయితే ఆ బంగళాలో ఉండే ఆత్మలను, వాటి అరుపులను కెమెరాలలో బంధించడానికి వెళ్లిన అర్జున్ టీమ్ అక్కడ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంది. ఆ బంగళాలో తిరిగే ఆత్మ ఎవరు? ఎందుకు చనిపోయింది? అనేది మూవీలో చూడొచ్చు.  

వాస్తవానికి ఇలాంటి ఆత్మలు సబ్జెక్ట్ తో వచ్చే సినిమాలు మాక్సిమం ప్రేక్షకులను భయపెడతాయి. అందులో ఈ మూవీ దర్శకుడు కూడా కాస్త సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. అయితే కథ కథనాల పరంగా చూస్తే మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా ఆత్మకీ.. అశ్వినీ దేవతలకీ ముడిపెట్టడంలో  దర్శకుడు విఫలం అయినట్టు అనిపిస్తుంది. అయితే హాలీవుడ్ సినిమాల ప్రభావం మాత్రం ఈ మూవీలో బాగా కనబడుతుంది. మరి ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఎంతమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. 

Also Read: హాలీవుడ్ రేంజ్‌లో దీపిక ‘ప్రాజెక్ట్ కే’ లుక్ - అంచనాలు పెంచేస్తున్న మేకర్స్!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 18 Jul 2023 11:11 AM (IST) Tags: OTT Movies Horror Movies Vasanth Ravi Asvins Movie Asvins OTT Tarun Tej

ఇవి కూడా చూడండి

'పాపం పసివాడు' వెబ్ సీరిస్ సాంగ్ రిలీజ్ - ఆహాలో స్ట్రీమింగ్, ఎప్పుడంటే?

'పాపం పసివాడు' వెబ్ సీరిస్ సాంగ్ రిలీజ్ - ఆహాలో స్ట్రీమింగ్, ఎప్పుడంటే?

ఓంకార్ హారర్ వెబ్ సిరీస్ 'మాన్షన్ 24'లో సత్యరాజ్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఓంకార్ హారర్ వెబ్ సిరీస్ 'మాన్షన్ 24'లో సత్యరాజ్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ANR పంచలోహ విగ్రహం ఆవిష్కరణ, పెళ్లికి చావుకు లింకుపెట్టిన నిత్య - ఈ రోజు సినీ విశేషాలివే!

ANR పంచలోహ విగ్రహం ఆవిష్కరణ, పెళ్లికి చావుకు లింకుపెట్టిన నిత్య - ఈ రోజు సినీ విశేషాలివే!

Annie: నాగార్జున నన్ను దత్తత తీసుకుంటా అన్నారు, ఇప్పుడు గుర్తుపట్టలేదు: నటి యానీ

Annie: నాగార్జున నన్ను దత్తత తీసుకుంటా అన్నారు, ఇప్పుడు గుర్తుపట్టలేదు: నటి యానీ

Athidhi Web Series Review - 'అతిథి' రివ్యూ : హీరో వేణు తొట్టెంపూడి నటించిన హారర్ థ్రిల్లర్ సిరీస్

Athidhi Web Series Review - 'అతిథి' రివ్యూ : హీరో వేణు తొట్టెంపూడి నటించిన హారర్ థ్రిల్లర్  సిరీస్

టాప్ స్టోరీస్

Chandrayaan-3: 'చంద్రయాన్-3' రీయాక్టివేషన్ ప్రక్రియ వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?

Chandrayaan-3: 'చంద్రయాన్-3' రీయాక్టివేషన్ ప్రక్రియ వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?

చంద్రబాబుకు హైకోర్టులో షాక్- క్వాష్ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం

చంద్రబాబుకు హైకోర్టులో షాక్- క్వాష్ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం

BC Survey In Telangana: తెలంగాణలో త్వరలో బీసీ సర్వే- స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం కసరత్తు

BC Survey In Telangana: తెలంగాణలో త్వరలో బీసీ సర్వే- స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం కసరత్తు

NDA కూటమిలో చేరిన జేడీఎస్, అమిత్‌షాతో భేటీ తరవాత అధికారిక ప్రకటన

NDA కూటమిలో చేరిన జేడీఎస్, అమిత్‌షాతో భేటీ తరవాత అధికారిక ప్రకటన