Bhimaa OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న గోపీచంద్ ‘భీమా’ - స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Bhimaa OTT Release: గోపీచంద్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భీమా’ ఫైనల్‌గా ఓటీటీలో విడుదలకు సిద్ధమయ్యింది. దీని స్ట్రీమింగ్ గురించి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్రకటించింది.
![Bhimaa OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న గోపీచంద్ ‘భీమా’ - స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే? Disney plus Hotstar announces streaming date of Gopichand starrer Bhimaa movie Bhimaa OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న గోపీచంద్ ‘భీమా’ - స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/13/e07bdea96011ea9980737abe74be38851713013115399802_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Bhimaa OTT Release Date: ఫిబ్రవరీ, మార్చ్‌లో థియేటర్లలో విడుదలయిన ఎన్నో సినిమాలు ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కోసం క్యూ కడుతున్నాయి. ఇప్పటికే ఫిబ్రవరీలో విడుదలయిన పలు హిట్ చిత్రాలు ఓటీటీ ప్రేక్షకులను పలకరించగా.. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి గోపీచంద్ నటించిన ‘భీమా’ కూడా యాడ్ అయ్యింది. ఈ యాక్షన్ మూవీ ఫిబ్రవరీలో థియేటర్లలో విడుదలయ్యి నెలరోజుల దాటిపోయింది. ఇక ఇప్పుడు దీనిని ఓటీటీ రిలీజ్‌పై మేకర్స్.. అప్డేట్‌ను విడుదల చేశారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ హాట్‌స్టార్.. ‘భీమా’ ఓటీటీ రైట్స్‌ను సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా హాట్‌స్టార్ కూడా ఈ ఓటీటీ రిలీజ్‌పై సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఫ్లాప్ అయినా కూడా..
శివరాత్రి సందర్భంగా మార్చి 8న థియేటర్‌లో విడుదయ్యింది ‘భీమా’. అంతకు ముందే విడుదలయిన టీజర్, ట్రైలర్.. సినిమాపై ఆసక్తిని క్రియేట్ అయ్యేలా చేశాయి. దీంతో హైప్ కూడా పెరిగింది. కానీ ‘భీమా’ విడుదలయిన తర్వాత ఆ హైప్‌ను అందుకోలేకపోయింది. అందుకే ఈ మూవీ కనీసం హిట్‌ను కూడా సాధించలేకపోయింది. ఇక థియేటర్లలో విడుదలయ్యి సూపర్ హిట్ సాధించిన సినిమాలే నెలరోజులు పూర్తవ్వగానే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అలాంటిది ‘భీమా’ ఫ్లాప్ అయినా కూడా ఇంకా దీనిని ఓటీటీ రిలీజ్‌పై ఎలాంటి అప్డేట్ రాలేదని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. అదే సమయంలో హాట్‌స్టార్.. ఈ విషయంపై ఒక ప్రకటనను విడుదల చేసింది.
రొటీన్ కథ..
‘భీమా’ నుంచి కొన్ని స్టిల్స్‌ను షేర్ చేసింది ఏప్రిల్ 25 నుంచి ఓటీటీలో మూవీ స్ట్రీమ్ అవుతుందని ప్రకటించింది డిస్నీ ప్లస్ హాట్‌స్టార్. ఈ మూవీ పూర్తిగా ఒక యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. అయితే యాక్షన్ జోనర్‌లో గోపీచంద్ ఎప్పుడూ టాప్‌లో ఉంటాడు కాబట్టి ఈ మూవీ యాక్షన్ లవర్స్‌కు ఫీస్ట్‌గా ఉంటుందని మేకర్స్ భావించారు. కానీ అలా జరగలేదు. కథ రొటీన్‌గా ఉందని, అవన్నీ ఎన్నో ఏళ్ల నుంచి చూస్తున్న యాక్షన్ సీన్సే అని ప్రేక్షకులు విమర్శించడం మొదలుపెట్టారు. అలా ఫస్ట్ షో నుంచే ‘భీమా’కు నెగిటివ్ టాక్ రావడంతో అసలు ఈ మూవీ థియేటర్లలో ఎప్పుడు వచ్చి వెళ్లిపోయిందో చాలామంది ప్రేక్షకులకు తెలియదు.
View this post on Instagram
కమ్ బ్యాక్ కోసం ఎదురుచూపులు..
కన్నడ డైరెక్టర్ ఎ హర్ష దర్శకత్వం వహించిన ‘భీమా’ సినిమాలో ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మలు హీరోయిన్లుగా నటించారు. పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్ చూస్తుంటే బోయపాటి చిత్రానికి మించేలా ఉన్నాయని కూడా కొందరు ప్రేక్షకులు వ్యంగ్యంగా వ్యాఖ్యాలు చేశారు. గోపీచంద్ హీరోగా మళ్లీ ఒక బ్లాక్‌బస్టర్ హిట్ కొడితే చూడాలి అనుకున్న ఫ్యాన్స్‌ను ‘భీమా’ మరోసారి నిరాశపరిచింది. యంగ్ డైరెక్టర్ అయినా కూడా హర్ష కన్నడలో తెరకెక్కించిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ‘భీమా’ కూడా హిట్ అవుతుందని చాలామంది అనుకున్నారు. కానీ ఇది గోపీచంద్ డిసాస్టర్ చిత్రాల లిస్ట్‌లో ఒకటిగా మిగిలిపోయింది.
Also Read: జీ5 టీం వినూత్న ఆలోచన - గడ్డకట్టే చలిలో 'గామి' ప్రెస్ మీట్, ఇండియాలోనే తొలిసారి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)