కీరదోసలో 95 శాతం నీరే ఉంటుంది. కనుక ఇది చాలా మంచి హైడ్రేషన్ అందించే ఆహారం.

కీరదోసలో చాలా రకాల విటమిన్లు, ఖనిజలవణాలు, యాంటీఆక్సిడెంట్లు ఇతర పోషకాలు ఉంటాయి.

తక్కువ క్యాలరీలు కలిగి, ఫైబర్, నీరు ఎక్కువగా కలిగిన కీరదోస బరువు తగ్గేందుకు కూడా దోహదం చేస్తుంది.

కీరదోసలో సిలికా అనే సమ్మేళనం చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తికి దోహదం చేస్తుంది. అందువల్ల చర్మం యవ్వనంగా మెరుస్తూ ఉంటుంది.

పొటాషియం, మెగ్నీషియం ఉండడం వల్ల కీరదోసతో బీపి అదుపులో ఉంటుంది.

నీటి శాతం ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలో టాక్సిన్లు బయటకు పంపి డీటాక్సిఫికేషన్ కు తోడ్పడుతుంది.

కీరదోసలోని ఫ్లవనాయిడ్స్, టానిన్స్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి.

కీరదోసలోని ఫైబర్, నీరు వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యకరంగా ఉంటుంది. బలబద్దకాన్ని నివారిస్తుంది.

Image Source: Pexels

ఈ సమాచారం కేవలం అవగాహన కోసమే.