Image Source: The Chennai Gourmand/Instagram

కొబ్బరికాయ దేవుడి ముందు కొట్టినపుడు అందులో పువ్వొస్తే అదృష్టమని ఆనంద పడతాం. అయితే అది ఆరోగ్యానికీ మంచిదేనట.

ఇందులో పొటాషియం ఉంటుంది కనుక బీపీ, కొలెస్ట్రాల్ తగ్గస్తుంది.

శరీరంలో అదనపు వేడి తగ్గించి చల్లగా ఉంచుతుంది.

ఇమ్యూనిటి పెంచి ఇన్ఫెక్షన్ల బారి నుంచి కాపాడుతుంది.

దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ప్రమాదం తప్పిస్తుంది.

ఇందులో ఫైబర్ ఎక్కువ కనుక జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. బలబద్దకం నివారిస్తుంది.

పోషకాలు ఎక్కువ కనుక కొబ్బరి పువ్వు తీసుకున్నపుడు తక్షణ శక్తి లభిస్తుంది.

ఫైబర్ వల్ల కడుపు నిండుగా ఉన్న భావన కలిగి బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది.

కొబ్బరి పువ్వుతో జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి.

ఫైబర్ ఎక్కువ కనుక రక్తంలో చక్కెర కూడా అదుపులో ఉంచుతుంది.

Image Source: Pexels

కొబ్బరి పువ్వులో కాల్షియం ఎక్కువ కనుక ఎముకలు, కీళ్ల ఆరోగ్యం బావుంటుంది.