స్ట్రాబెర్రీలు కిడ్నీలకు మంచివేనా? స్ట్రాబెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో సహాయపడతాయి. స్ట్రాబెర్రీలు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి కిడ్నీలను రక్షించడంలో సహాయపడతాయి. పొటాషియం, భాస్వరం తక్కువగా ఉంటాయి. ఈ ఖనిజాలను పరిమితం చేయడం వల్ల కిడ్నీల వ్యాధులు ఉన్నవారికి మేలు చేస్తాయి. స్ట్రాబెర్రీలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులో ఉండే అధిక నీటి కంటెంట్ డీహైడ్రేషన్ తగ్గించడంతోపాటు మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. నిత్యం స్ట్రాబెర్రీలను తీసుకున్నట్లయితే రక్తపోటును కంట్రోల్‌లో ఉంచుతుంది. కప్పు స్ట్రాబెర్రీలను తీసుకుంటే శరీరానికి కావాల్సినంత విటమిన్ సి అందిస్తాయి. ఇమ్యూనిటీ వ్యవస్థ కణాలకు మద్దతు ఇస్తుంది. విటమిన్ సి, టి కణాలు, బి కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. తెల్లరక్తకణాలు, వ్యాధిని కలిగించే వైరస్ లు, బ్యాక్టీరియా, క్యాన్సర్ తో పోరాడానికి సహాయపడతాయి.