తినడానికి ఉపయోగించే బంగారు షీట్ కొద్ది మొత్తంలో తినడం వల్ల పెద్ద నష్టమేమీ లేదు. ఎందుకంటే దీన్ని జీర్ణవ్యవస్థ శోశించుకోదు. అలాగా దాటి వెళ్లిపోతుంది. నిజానికి బంగారంతో మానవ శరీర కణాలు ఎలాంటి చర్య జరపవు. ఇతర పదార్థాల వల్ల జరిగినట్టు హాని జరగదు. అయినా సరే తినే బంగారం పెద్ద మొత్తంలో తినకూడాదనే చెబుతున్నారు. దీని వల్ల జీర్ణసంబంధ సమస్యలు రావచ్చట. కొంత మందికి బంగారం అలర్జీ ఉంటుంది. కనుక నిపుణుల సలహా లేకుండా వీరు బంగారం తినకపోవడమే మంచిది. ఆహారానికి ఒక విలాసవంతమైన భావన కలిగించేందుకు అలంకరణగా ఈ తినగలిగే బంగారాన్ని ఉపయోగిస్తారు. తినగలిగే బంగారంలో ఎలాంటి ప్రత్యేక పోషకాలు ఉండవు. వీలైనంత వరకు వాడకుండా ఉండడమే మంచిది. అన్నింటి కంటే ముఖ్యం ఏమిటంటే ఆహారంలో ఉపయోగించే బంగారం కచ్చితంగా మంచి క్వాలిటితో ఉండాలి. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే