సమ్మర్లో చాలామంది చల్లని నీటితో స్నానం చేస్తారు. దీనివల్ల బెనిఫిట్స్ ఉన్నాయా? లేదా అంటే.. కచ్చితంగా ఉన్నాయనే అంటున్నారు నిపుణులు. కోల్డ్ షవర్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. ఇది మొత్తం ఆరోగ్యానికి మంచిది. చల్లని నీటితో స్నానం చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నీరసాన్ని తగ్గిస్తుంది. ఒత్తిడి తగ్గించుకుని.. మూడ్ బెటర్‌గా అవ్వాలంటే మీరు చల్లని నీటితో స్నానం చేయండి. ఇది హెల్తీ స్కిన్‌ను, హెల్తీ హెయిర్‌ను ప్రమోట్ చేస్తుంది. మెటబాలీజంను పెంచి.. కెలరీలు బర్న్ చేయడానికి కావాల్సిన హీట్‌ని జెనరేట్ చేస్తుంది. కీళ్లు పట్టేయడం, కండరాల నొప్పులు వంటివి దూరమవుతాయి. ఇవి కేవలం అవగాహన కోసమే. మెరుగైన ఫలితాల కోసం వైద్యుడిని సంప్రదించండి. (Images Source : Unsplash)