ఈ ఫుడ్స్ ఖాళీ కడుపుతో తినాలని మీకు తెలుసా గ్రీక్ పెరుగులో ప్రొటీన్, ప్రొబయోటిక్స్ అధికంగా ఉంటాయి. ఇది గట్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గుడ్డులో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. ఖాళీ కడుపుతో గుడ్డును తినవచ్చు. బ్రేక్ ఫాస్ట్ కు మంచి ఫుడ్. వోట్మీల్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఉదయం బ్రేక్ ఫాస్టులో తినవచ్చు. బెర్రీస్ లో తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ ఉంటుంది. బరువు తగ్గేందుకు మంచి ఎంపిక . బాదంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు, ఫైబర్ ఉంటుంది. ఖాళీ కడుపు చిరుతిండిగా తినవచ్చు. చియా సీడ్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. బ్రేక్ ఫాస్టులో చేర్చుకుంటే పోషకాలన్నీ అందుతాయి. అరటిపండులో పొటాషియం ఉంటుంది. ఎలక్ట్రోలైట్స్ ను సమతుల్యం చేస్తుంది. కండరాల పనితీరును కాపాడుతుంది. ఆపిల్ జీర్ణక్రియలో సహాయపడుతుంది. ఆకలిని తగ్గిస్తుంది. క్వెర్సెటివ్ వంటి యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. పుచ్చకాయలో యాంటీ ఆక్సిడెంట్లు, లైకోపీన్ అధికంగా ఉంటుంది. ఖాళీకడుపుతో పుచ్చకాయ తింటే హైడ్రేట్ గా ఉండవచ్చు.