వేసవిలో మీ కడుపును చల్లగా ఉంచే చట్నీలు భారతీయ వంటకాల్లో చట్నీలది ప్రముఖ పాత్ర. సీజన్ ప్రకారం చట్నీలు కూడా ఉంటాయి. సమ్మర్ డైట్ కు అనుమైన..మీ కడుపును చల్లగా ఉంచే కొన్ని చట్నీల గురించి తెలుసుకుందాం. దోసకాయ చట్నీలో చింతపండు గుజ్జు, కరివేపాకు, మసాలలతో తురిమిన కొబ్బరి వేసి చేస్తారు. ఇది కడుపును చల్లగా ఉంచుతుంది. కొబ్బరి చట్నీ ఎవర్ గ్రీన్. అన్ని కాలలోనూ కొబ్బరి చట్నీ తినవచ్చు. వేసవిలో కొబ్బరి చట్నీ తింటే శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. పచ్చిమామిడి గుజ్జుతో తయారు చేసే ఆమ్ కి లాంజీ రుచి బాగుంటుంది. ఈ చట్నీని వేసవిలో తప్పకతినాల్సిందే. పుదీనా చట్నీ శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. చింతపండు చట్నీ. మన పూర్వికుల నుంచి వస్తున్న సాంప్రదాయక వంటకం. తీపి, పులుపు, కారంగా ఉండే చింతపండు చట్నీ తింటే వేసవిలో ఎంతో మేలు చేస్తుంది.