మీకు తెలుసా? ఈ జంతువులు అత్యంత దుర్వాసనను వెదజల్లుతాయి భూమిపై నివసించే కొన్ని జంతువులు అత్యంత దుర్వాసనను వెదజల్లుతుంటాయి. కొన్ని జాతులు ఆహారం లేదా ఆహార వనరులను గుర్తించేందుకు వాటి వాసనను కూడా ఉపయోగిస్తాయి. స్టింక్ బర్డ్ అనే పక్షి నుంచి అసహ్యకరమైన వాసన వస్తుంది. స్కంక్ నుంచి ఒక మైలు దూరం వరకు దుర్వాసన వస్తుంది. తన రక్షణ కోసం రాన్సిడ్ స్ప్రేను ఉపయోగిస్తుంది. దుర్వాసనగల జీవులలో బగ్ ఒకటి. భయానికి గురైనప్పుడు పొత్తికడుపులోని గ్రంథుల నుంచి దుర్వాసన ఉత్పత్తి చేస్తాయి. వుల్వరైన్ అత్యంత దుర్వాసన గల జంతువు. దీని వాసన ఒక మైలు వరకు ఉంటుంది. చారల పోల్కాట్ జంతువులను వేటాడేందుతుంది. ఆసన గ్రంథిని వాసన కోసం ఉపయోగిస్తుంది. టాస్మానియన్ డెవిల్స్ ఒత్తిడిలో ఉన్నప్పుడు దుర్వాసనను వెదజల్లుతుంది. బొంబార్డియర్ బీటిల్ 2 రసాయనాలను విడుదల చేస్తుంది. అవి భరించలేనంత కంపు కొడతాయి.