అన్వేషించండి

Dhurandhar 2 OTT : ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ ఆలస్యం! - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?

Dhurandhar 2 OTT Platform : రణవీర్ సింగ్ రీసెంట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే, ఈ మూవీలో డిజిటల్ రిలీజ్ ఆలస్యమయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.

Ranveer Singh's Dhurandhar 2 OTT Release Date : బాలీవుడ్ లెజెండ్ రణవీర్ సింగ్ రీసెంట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్ 2' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా రూ.1,650 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

ఓటీటీ రిలీజ్ ఆలస్యం!

ధురంధర్ 2 డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ జియో హాట్ స్టార్ సొంతం చేసుకోగా... మే లాస్ట్ వీక్ లేదా జూన్ ఫస్ట్ వీక్‌లో ఓటీటీలోకి వచ్చే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా 8 వారాల తర్వాత ఓటీటీలోకి రావాల్సి ఉండగా... ఇప్పటికీ మూవీ క్రేజ్ తగ్గకపోవడంతో ఓటీటీ రిలీజ్ ఆలస్యం కావొచ్చని బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు, ఐపీఎల్ సీజన్ కూడా ఓ కారణమని అంటున్నాయి. త్వరలోనే ఓటీటీ రిలీజ డేట్‌పై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. 

గతేడాది వచ్చిన ధురంధర్‌కు సీక్వెల్‌గా ధురంధర్ 2 రివెంజ్ తెరకెక్కింది. ఫస్ట్ పార్ట్ ఇంటర్నేషనల్ ఓటీటీ నెట్ ఫ్లిక్స్‌లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీకి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించగా... రణవీర్‌తో పాటు అర్జున్ రాంపాల్, సారా అర్జున్, ఆర్ మాధవన్, సంజయ్ దత్, రాకేష్ బేడీ, అక్షయ్ ఖన్నా తదితరులు కీలకపాత్రలు పోషించారు.

Also Read : వివాహేతర సంబంధం... షాకింగ్ ఇన్సిడెంట్ - ఓటీటీలోకి పూర్ణ ఎమోషనల్ థ్రిల్లర్ డార్క్ నైట్... ఎందులో చూడొచ్చంటే?

స్టోరీ ఏంటంటే?

ఫస్ట్ పార్ట్‌లో సస్పెన్స్‌గా మిగిలిన ఎన్నో ప్రశ్నలకు ధురంధర్ 2లో ఆన్సర్ రివీల్ చేశారు. పంజాబ్‌కు చెందిన జస్కరిత్ సింగ్ రంగీ (రణవీర్) దేశభక్తితో సైన్యంలో చేరాలని భావిస్తాడు. అయితే, సొంతూరిలో జరిగిన గొడవలో ఎమ్మెల్యే ఇండిపై దాడి చేసి 15 మందిని హతమార్చిన కేసులో జైలుకు వెళ్తాడు. ఆ తర్వాత ఆపరేషన్ ధురంధర్‌లో భాగంగా తన పేరు హమ్జా అలీ మజారీగా (రణవీర్ సింగ్) మార్చుకుని పాక్ వెళ్తాడు.

అక్కడ ల్యారీ పట్టమంలో బలోచ్ తెగ నాయకుడు రెహమాన్ డెకాయిత్ (అక్షయ్ ఖన్నా)ను చంపేస్తాడు. ఇదే అదనుగా భావించి మరో తెగ నాయకుడు అర్షద్ పప్పు (అశ్విన్ ధర్) ల్యారీకి తనను తాను కింగ్ అని ప్రకటించుకుంటాడు. అన్న చావుకు అర్షద్ పప్పు కారణమని తెలుసుకున్న ఉజెయిర్ బలోచ్ (డానిష్) అతనిపై ఎలా పగ తీర్చుకున్నాడు? ఉజెయిర్ ల్యారీ పీఠం ఎక్కకుండా హమ్జా వేసిన ప్లాన్ ఏంటి? అసలెందుకు హమ్జాగా పేరు మార్చుకోవాల్సి వచ్చింది? ఉగ్ర దాడులను హమ్జా ఎలా అడ్డుకున్నాడు? తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

ధురంధర్ 2... మరో కాంట్రవర్సీ

ధురంధర్ 2 స్టోరీపై ఇప్పటికే ఓ వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో కాంట్రవర్సీ తెరపైకి వచ్చింది. ఇది తన కథే అని కాపీ కొట్టారంటూ రీసెంట్‌గా డైరెక్టర్ సంతోష్ కుమార్ ఆరోపించారు. ఇక ఈ మూవీలో తమ పర్మిషన్ లేకుండా పాత సాంగ్ వాడుకున్నారంటూ నిర్మాణ సంస్థ త్రిమూర్తి ఫిల్మ్స్ కోర్టులో దావా వేసింది.

1989లో వచ్చిన సూపర్ హిట్ మూవీ 'త్రిదేవ్'లోని 'హమ్ ప్యార్ కర్నే వాలే' సాంగ్ రైట్స్ తమ వద్దే ఉన్నా... ఎలాంటి అనుమతి తీసుకోకుండా ఈ పాటను ధురంధర్ 2లో వాడినట్లు ఆరోపిస్తోంది. దీన్ని మూవీ నుంచి తొలగించాలని లేదా నష్ట పరిహారం ఇవ్వాలని కోరింది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
This Week OTT Movies : ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు - ఒకే రోజు 7 సినిమాలు స్ట్రీమింగ్... ఈ మూవీస్ డోంట్ మిస్
ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు - ఒకే రోజు 7 సినిమాలు స్ట్రీమింగ్... ఈ మూవీస్ డోంట్ మిస్
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget