అన్వేషించండి

Dark Night OTT : వివాహేతర సంబంధం... షాకింగ్ ఇన్సిడెంట్ - ఓటీటీలోకి పూర్ణ ఎమోషనల్ థ్రిల్లర్ డార్క్ నైట్... ఎందులో చూడొచ్చంటే?

Dark Night OTT Platform : రీసెంట్ ఎమోషనల్ థ్రిల్లర్ డార్క్ నైట్ ఓటీటీలోకి వచ్చేసింది. పూర్ణ ప్రధాన పాత్రలో నటించిన మూవీ మార్చి 13న థియేటర్లలోకి వచ్చి మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది.

Poorna's Dark Night OTT Streaming : సీనియర్ హీరోయిన్ పూర్ణ ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ ఎమోషనల్ థ్రిల్లర్ డార్క్ నైట్. జీఆర్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చి... మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. అనుకున్నంతగా ఆడియన్స్‌కు రీచ్ కాలేదు. దాదాపు నెల రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది.

ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ఈ మూవీ ప్రముఖ ఓటీటీ 'ఆహా' బుధవారం అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. పూర్ణతో పాటు త్రిగుణ్, విదార్థ్, శుభశ్రీ రాయగురు తదితరులు కీలక పాత్రలు పోషించారు. పట్లోళ్ల వెంకట్ రెడ్డి సమర్పణలో పి 19 స్టూడియోస్ బ్యానర్‌పై సురేష్ రెడ్డి కొవ్వూరి నిర్మించారు. థియేటర్లలో అంతగా ఆకట్టుకోలేకపోయినా మరి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాల్సి ఉంది.

Also Read : శ్రీరాముడిగా మహేశ్ బాబు - వారణాసి నుంచి బిగ్ సర్ప్రైజ్‌ డేట్ ఫిక్స్?

స్టోరీ ఏంటంటే?

వివాహేతర సంబంధాల వల్ల జీవితాల్లో ఎలాంటి అనర్థాలు జరుగుతాయి? అనేదే ప్రధానాంశంగా ఈ మూవీని తెరకెక్కించారు. లాయర్ అయిన అలెక్స్ (విదార్థ్)కు హేమ (పూర్ణ)తో పెళ్లవుతుంది. పెద్దలు కుదిర్చిన పెళ్లి కావడంతో తన భర్తతో అందమైన జీవితం ఊహించుకుంటుంది. అయితే, అలెక్స్ తన ఆఫీస్‌లో పని చేసే సోఫియా (శుభశ్రీ రాయగురు)తో అఫైర్ పెట్టుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న హేమ... తన భర్తను వదిలేసి వెళ్లిపోతుంది.

మరోవైపు, సోఫియా వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండడం చూసి అలెక్స్ తాను మోసపోయానని గ్రహిస్తాడు. పశ్చాత్తాపంతో తన భార్య దగ్గరకు వెళ్తాడు. అయితే, హేమ జీవితంలోకి అప్పటికే ఆమె ఫ్రెండ్ రోషన్ (త్రిగుణ్) వస్తాడు. అతన్ని ఫ్రెండ్‌లానే హేమ భావించినా... రోషన్ మాత్రం వేరే ఉద్దేశంతో చూస్తాడు. తన భర్తను అర్థం చేసుకున్న హేమ తిరిగి అలెక్స్‌కు దగ్గరవుతుందనుకుంటున్న టైంలో ఊహించని ఘటన జరుగుతుంది. హేమ కోసం రోషన్ ఏం చేశాడు? సోఫియాపై అలెక్స్ పగ తీర్చుకున్నాడా? అసలు అతీంద్రియ శక్తులకు వీరి జీవితాలకు సంబంధం ఏంటి? అలెక్స్, హేమ మళ్లీ కలిశారా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

This Week OTT Movies : థియేటర్లలో పెద్ది...ఓటీటీలో ధురంధర్ 2 - జూన్ ఫస్ట్ వీక్‌లో ఈ మూవీస్ డోంట్ మిస్
థియేటర్లలో పెద్ది...ఓటీటీలో ధురంధర్ 2 - జూన్ ఫస్ట్ వీక్‌లో ఈ మూవీస్ డోంట్ మిస్
Seat Edge Horror Thriller OTT : ఓటీటీలోకి సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ - సీట్ ఎడ్జ్ మూవీ రియల్లీ డోంట్ మిస్
ఓటీటీలోకి సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ - సీట్ ఎడ్జ్ మూవీ రియల్లీ డోంట్ మిస్
OTT Movies : గోదారి గట్టుపైన, సరస్వతి వెరీ స్పెషల్ - రెండు ఓటీటీల్లోకి వచ్చేశాయ్
గోదారి గట్టుపైన, సరస్వతి వెరీ స్పెషల్ - రెండు ఓటీటీల్లోకి వచ్చేశాయ్
29 Movie OTT : ఓటీటీలోకి రీసెంట్ తమిళ రొమాంటిక్ డ్రామా - ఐఎండీబీలో 9.1 రేటింగ్... ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి రీసెంట్ తమిళ రొమాంటిక్ డ్రామా - ఐఎండీబీలో 9.1 రేటింగ్... ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
Advertisement

వీడియోలు

Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం
Masterplan Behind RCB's IPL 2026 Victory | ఆర్సీబీ విజయానికి కారణం ఇదే
Reason for GT Lost The IPL 2026 Final | గుజరాత్ పతనం వెనుక అసలు నిజాలు
RCB Celebrations With Family IPL 2026 | ఫ్యామిలీతో ఆర్సీబీ ప్లేయర్స్ సెలబ్రేషన్
RCB Wins IPL 2026 Final | రెండోసారి ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకున్న ఆర్సీబీ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
K Annamalai launch new party Tamil Nadu: బీజేపీకి అన్నామలై గుడ్‌బై? తమిళనాడులో సరికొత్త పార్టీ స్థాపనకు మాజీ ఐపీఎస్ స్కెచ్!
బీజేపీకి అన్నామలై గుడ్‌బై? తమిళనాడులో సరికొత్త పార్టీ స్థాపనకు మాజీ ఐపీఎస్ స్కెచ్!
Kalvakuntla Kavitha: జగన్ MAVIGUN బాంబు! ఏపీ సీఎం సీటు కిందకు నీళ్లు రాకుండా చూసుకో: కవిత సంచలన వ్యాఖ్యలు
జగన్ MAVIGUN బాంబు! ఏపీ సీఎం సీటు కిందకు నీళ్లు రాకుండా చూసుకో: కవిత సంచలన వ్యాఖ్యలు
JEE Advanced 2026 Result: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం
Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్ రిలీజ్ డేట్... రవితేజలో మార్పు చూసేందుకు రెడీనా?
ఇరుముడి గ్లింప్స్ రిలీజ్ డేట్... రవితేజలో మార్పు చూసేందుకు రెడీనా?
Chiranjeevi : నాని మూవీలో మెగాస్టార్... నెక్స్ట్ సినిమాతో లింక్ - శ్రీకాంత్ ఓదెల సినిమాటిక్ యూనివర్స్ ప్లాన్?
నాని మూవీలో మెగాస్టార్... నెక్స్ట్ సినిమాతో లింక్ - శ్రీకాంత్ ఓదెల సినిమాటిక్ యూనివర్స్ ప్లాన్?
Nandus World Insta Couple Scam: సోషల్ మీడియా సెలబ్రిటీ జంటపై యూకే వీసా స్కాం ఆరోపణలు - ఎందుకు స్పందించడం లేదు?
సోషల్ మీడియా సెలబ్రిటీ జంటపై యూకే వీసా స్కాం ఆరోపణలు - ఎందుకు స్పందించడం లేదు?
Bajaj Chetak 2026 Updates: బజాజ్‌ చేతక్‌ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు సీ 35, సి30 సిరీస్‌ ధరలు ఫీచర్స్‌ ఎలా ఉన్నాయి?
బజాజ్‌ చేతక్‌ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు సీ 35, సి30 సిరీస్‌ ధరలు ఫీచర్స్‌ ఎలా ఉన్నాయి?
Space Science Secretes: ఆ రెండు గ్రహాలపై వజ్రాల వాన! శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం గురించి తెలిస్తే షాక్ అవుతారు? 
ఆ రెండు గ్రహాలపై వజ్రాల వాన! శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం గురించి తెలిస్తే షాక్ అవుతారు? 
Embed widget