Balakrishna: తాగినా.. తాగకపోయినా నేను స్టడీ.. బాలయ్య కామెంట్స్..
నందమూరి బాలకృష్ణ తన మందు అలవాటు గురించి 'Unstoppable' షోలో మాట్లాడారు.
చాలా మందికి మద్యం అలవాటు ఉంటుంది. ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్లు కూడా మద్యం సేవిస్తుంటారు. కానీ ఆ విషయాలను ఎవరూ బయటకు చెప్పుకోరు. కొంతమంది మాత్రమే ఓపెన్ గా మాట్లాడుతుంటారు. వీరిలో నందమూరి బాలకృష్ణ ఒకరు. ఆయన తాగే బ్రాండ్ ఏంటో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. తాజాగా 'Unstoppable' షోలో ఆయన మంచు మోహన్ బాబుతో కలిసి మందు ముచ్చట్లు పెట్టారు. ఎవరు ఏ బ్రాండ్ తాగుతారో మాట్లాడుకున్నారు.
Also Read:పటాసుల్లా పేలుతాయనుకుంటే.. తుస్సుమన్నాయే..
ముందుగా మోహన్ బాబు తన సారా స్టోరీ చెప్పుకొచ్చారు. మద్రాసులో కోడంబాకం బ్రిడ్జ్ కింద వరుసగా సారా దుకాణాలుండేవట. తన స్నేహితుడితో కలిసి మోహన్ బాబు అక్కడకు వెళ్లి చెరో 25 పైసలు పెట్టి సారా తాగేవాళ్లట. ఆ తరువాత దేవుడి దయతో కాస్త డబ్బులు వచ్చాయని.. ఇప్పుడు రాయల్ గా సెల్యూట్ చేస్తూ విస్కీ తాగుతున్నామని అన్నారు. ఇలా తన మందు అలవాటు గురించి బయటపెట్టారు మోహన్ బాబు.
ఆ తరువాత బాలయ్య.. తాగినా.. తాగకపోయినా స్టడీగా ఉంటానని కామెడీగా చెప్పారు. 'నా మందు అలవాటు గురించి అందరికీ తెలిసిందే.. నేను మేన్షన్ హౌస్ తాగుతాను' అంటూ చెప్పుకొచ్చారు బాలయ్య. తనకొక ఇల్లు ఉందని.. అది కూడా పెద్ద మేన్షన్ హౌస్ అని.. రాత్రికి 'మామ ఏక్ పెగ్ లా' ఉంటుందని అన్నారు.పొద్దున్నే మూడున్నర లేదా 4 గంటలకు లేస్తానని.. ఎదురుగా ఉన్న కేబీఆర్ పార్క్ లోకి జాగింగ్ కు వెళ్తానని చెప్పారు. అప్పటికి అది తెరవరని.. నేను గోడదూకి అందులోకి వెళ్లిపోయేవాడ్ని అని అన్నారు. అప్పట్లో చాలామందికి అలా గోడ దూకడం నేర్పించానని కామెడీ చేశారు.
Balayya babu bringing weekend vibes 🤩#UnstoppableWithNBK Episode 1 streaming now.
— ahavideoIN (@ahavideoIN) November 5, 2021
▶️ https://t.co/dwGhQp1iHP#NandamuriBalakrishna @themohanbabu @iVishnuManchu @LakshmiManchu #MansionHouse @swargaseema #NandGokulGhee #TilakNagarIndustries pic.twitter.com/UCgKqyFrTt
Also Read: ఇద్దరమ్మాయిలతో అఖిల్ రొమాన్స్.. వర్కవుట్ అవుతుందా..?
Also Read: మెగా ఫ్యామిలీ to ఎన్టీఆర్.. సెలబ్రిటీల ఇంట దీపావళి సందడి చిత్రాలు
Also Read: 'మంచి రోజులు వచ్చాయి' సమీక్ష: మంచి నవ్వులు వచ్చాయి! కానీ...
Also Read: 'పెద్దన్న' సమీక్ష: ఇదేంటన్నయ్యా... ఇలాగైతే కష్టమే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి