Balakrishna: బాలయ్య 'అన్ స్టాపబుల్' షోలో చిరంజీవి - ఫ్యాన్స్ వెయిటింగ్
బాలయ్య టాక్ షోలో చిరంజీవిని గెస్ట్ గా తీసుకురానున్నారు.
తెలుగులో మొదలైన ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ మొదటి నుంచి సరికొత్త షోలతో ఆడియన్స్ ను అలరిస్తోంది. అన్నిటికంటే 'అన్ స్టాపబుల్' షో పెద్ద హిట్ అయింది. తొలిసారి బాలయ్య హోస్ట్ చేసిన షో కావడంతో దీనిపై విపరీతమైన బజ్ వచ్చింది. బాలయ్య లాంటి అగ్ర హీరో మిగిలిన స్టార్స్ ను ఇంటర్వ్యూ చేయడంతో ఈ షోకి భారీ పాపులారిటీ వచ్చింది. ఈ ఒక్క షో చూడడానికే సబ్ స్క్రిప్షన్ తీసుకున్నవారు చాలా మంది ఉన్నారు. ఒక్కో సెలబ్రిటీని బాలయ్య హ్యాండిల్ చేసిన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆయన పంచ్ లు, జోక్స్ బాగా వర్కవుట్ అయ్యాయి.
నిజానికి మొదటి సీజన్ లో చిరంజీవిని గెస్ట్ గా తీసుకురావాలనుకున్నారు. ఈ మేరకు అల్లు అరవింద్.. చిరంజీవితో కన్ఫర్మేషన్ కూడా తీసుకున్నారు. కానీ చిరు వేరే కమిట్మెంట్స్ తో బిజీగా ఉండడంతో బాలయ్య షోకి రాలేకపోయారు. అయితే త్వరలోనే మొదలుపెట్టనున్న 'అన్ స్టాపబుల్' సీజన్ 2కి మాత్రం చిరు పక్కా వస్తారని ప్రచారం జరుగుతోంది. మొదటి ఎపిసోడ్ కి చిరుని గెస్ట్ గా తీసుకొస్తే మరింత బజ్ వస్తుందని ప్లాన్ చేస్తున్నారు.
ఆ తరువాత వెంకటేష్, నాగార్జున కూడా ఈ సీజన్ లో కనిపిస్తారట. బాలయ్యకి నాగార్జునకి అప్పట్లో గొడవ జరిగిందని ప్రచారం జరిగింది. ఆ తరువాత వీరిద్దరూ ఓ ఈవెంట్ కలుసుకొని ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఇప్పుడు బాలయ్య షోలో నాగ్ కనిపిస్తే.. ఆ ఎపిసోడ్ హాట్ టాపిక్ అవ్వడం ఖాయం. అలానే చిరంజీవి-బాలయ్యలు కొన్నాళ్లుగా దూరంగా ఉంటున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు బాలయ్య-చిరు కలిసి ఒకే షోలో కనిపిస్తే ఆ వివాదం ముగుస్తుంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నుంచి 'అన్ స్టాపబుల్' సీజన్ 2 మొదలుకానుంది.
Also Read: ఛార్మితో రిలేషన్, భార్యకు పూరి విడాకులు - ఆకాష్ పూరి ఏమన్నారంటే?
Also Read: పరశురామ్ ని హోల్డ్ లో పెట్టిన చైతు - మరో టాలెంటెడ్ డైరెక్టర్ తో!
View this post on Instagram