By: ABP Desam | Updated at : 11 Apr 2022 08:26 PM (IST)
Edited By: Suresh Chelluboyina
Image Credit: The Walking Dead/Netflix
జోంబీ వైరస్.. ఇన్నాళ్లు మనం దీని గురించి సినిమాల్లో చూడటమే గానీ, నేరుగా ఎప్పుడూ ఎదుర్కోలేదు. కానీ, సినిమాల్లో చూపించిన కరోనా వైరస్‌ను ఇప్పటికే చూశాం. త్వరలోనే ‘జోంబీ’ వైరస్‌ను చూసే పరిస్థితి కూడా రావచ్చనే భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే.. కెనడాలోని జింకల్లో జోంబీ వైరస్ బయటపడింది. ఈ వైరస్ సోకిన జింకలో మరో జింకను చంపి తింటున్నాయట. 1996లోనే ఈ వైరస్‌ను పసువుల్లో గుర్తించారు. వైద్యులు వెంటనే అది ఇతరులకు వ్యాప్తి చెందకుండా దాన్ని అణచివేశారు. మళ్లీ ఇది ఎలా మొదలైందనేది అంతుబట్టడం లేదు. అయితే, ఇది మనుషులకు వ్యాప్తి చెందుతుందా? లేదా అనేది తెలియరాలేదు. కానీ, ఒక వేళ ఆ వ్యాధి మనుషులకు వ్యాపిస్తే పరిస్థితి దయనీయంగా ఉంటుంది. అదెంత భయానకంగా ఉంటుందో తెలుసుకోవాలంటే.. తప్పకుండా మీరు ఈ రోజు నుంచే ఈ కింది జోంబీ వెబ్ సీరిస్‌లు, టీవీ షోలను చూడాల్సిందే. వీటిని చూసిన తర్వాత నిద్రలో కూడా వణికిపోతారు. ఎవరిని చూసినా జోంబీల్లాగే కనిపిస్తారు.
1. Game of Thrones (గేమ్ ఆఫ్ థ్రోన్స్): ఈ వెబ్ సీరిస్ పేరు వినగానే మీరు.. ఇది రాజుల మధ్య జరిగే యుద్ధం కదా అని మీరు భావిస్తారు. కానీ, ఇది కూడా జోంబీ చిత్రమే. ఈ చిత్రం ఆరంభమే జోంబీలతో మొదలవుతుంది. అయితే, ఈ చిత్రంలో జోంబీలను ‘వైట్ వాకర్స్’ అని పిలుస్తారు. ఇవి అత్యంత ప్రమాదకర, తెలివైన జోంబీలు. వీటిని ఎదిరించడానికి శత్రు దేశాలన్నీ కలిసి పొరాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది రెగ్యులర్ జోంబీ చిత్రాలకు అత్యంత భిన్నంగా ఉంటుంది. ఇది Disney Plus Hotstarలో స్ట్రీమ్ అవుతోంది.
2. The Walking Dead (వాకింగ్ డెడ్); Fear The Walking Dead(ఫియర్ ది వాకింగ్ డెడ్): మీరు జోంబీ చిత్రాలను బాగా ఇష్టపడుతున్నట్లయితే.. ఈ వెబ్ సీరిస్ చూడవచ్చు. ప్రజలు జోంబీలతో కలిసి జీవించాల్సిన రోజులు వస్తే ఎలా ఉంటుందనేది ఈ వెబ్ సీరిస్‌లో చూపించారు. ఇందులోని ప్రతి ఎపిసోడ్ మిమ్మల్ని తప్పకుండా అలరిస్తుంది. ఇది Netflix Ottలో అందుబాటులో ఉంది. Amazon Prime Video OTTలో ‘Fear The Walking Dead’ వెబ్ సీరిస్ కూడా ఉంది. అయితే, అది సుదీర్ఘంగా సాగుతూనే ఉంటుంది. కానీ, ఇది కూడా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది.
3. The Returned (ది రిటర్న్‌డ్): ఎవరైనా ఆప్తులు చనిపోతే.. వారు మళ్లీ తిరిగి రావాలని కోరుకుంటారు. కానీ, మరణం మరణమే, చనిపోయిన వ్యక్తులు తిరిగి వస్తే.. ఎంత ప్రమాదకరంగా ఉంటారనేది ఈ వెబ్ సీరిస్‌లో చూడవచ్చు. ఈ అమెరికా టీవీ షో ఫ్రెంచ్‌కు చెందిన ‘లెస్ రివెనాంట్స్’కు రీమేక్. Netflixలో ప్రసారమవుతున్న ఈ షో మీకు బాగా నచ్చేస్తుంది.
4. Kingdom (కింగ్ డమ్): మీకు కొరియా వెబ్ సీరిస్‌లు ఇష్టమైతే.. తప్పకుండా ఈ షో చూడండి. వైద్య సదుపాయాలు అందుబాటులో లేని రోజుల్లో జోంబీ వైరస్ వ్యాప్తి చెందితే ఏ విధంగా ఉంటుంది. అప్పటి రాజులు, ప్రజలు దాన్ని ఎదుర్కోడానికి ఎలాంటి సాహసాలు చేశారు. వాటిని ఎలా అంతం చేశారనేది చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ఒక్కసారి మొదలుపెడితే.. టీవీ ఆపడం కూడా కష్టమే. ఈ వెబ్ సీరిస్ ఇప్పుడు Netflixలో స్ర్టీమ్ అవుతోంది.
5. iZombie (ఐజోంబీ): మీకు హర్రర్ కామెడీలు ఇష్టమైతే. ఈ టీవీ షో తప్పకుండా మీకు నచ్చేస్తుంది. ఇది ఒక పక్కన మిమ్మల్ని భయపెడుతూనే.. మరో పక్కన నవ్వులు పూయిస్తుంది. అయితే, ఇందులో మీరు ఊహించినన్ని జాంబీలు ఉండవు. ఇందులోని ప్రధాన పాత్రే ఓ జోంబీ. పోస్ట్ మార్టం చేసే యువతి.. చనిపోయిన వ్యక్తుల మెదళ్లు తింటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మీరే చూడండి. ఇది Netflixలో స్ట్రీమ్ అవుతోంది.
6. Ash vs Evil Dead (ఆష్ vs ఎవిల్ డెడ్): ‘ఎవిల్ డెడ్’ మూవీ సీరిస్‌లకు దర్శకత్వం వహించిన శామ్ రామీ ఈ టీవీ షోను తెరకెక్కించారు. ఇది కూడా ఫన్నీగా, సరదాగా సాగుతుంది. ఈ వెబ్ సీరిస్ Netflixలో అందుబాటులో ఉంది.
7. American Gods (అమెరికన్ గాడ్స్): ఇందులో జోంబీ పదాలు వినపడవు. కానీ, కాన్సెప్ట్ మాత్రం అదే. చనిపోయి మళ్లీ బతికే భయానక వ్యక్తులు చేసే బీభత్సాన్ని ఈ వెబ్ సీరిస్‌లో చూడవచ్చు.
8. Black Summer (బ్లాక్ సమ్మర్): జోంబీ వైరస్ వ్యాప్తితో సైన్యం ఆరోగ్యంగా ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించి.. జోంబీలు ఉన్న ప్రాంతాన్ని నాశనం చేయాలని భావిస్తారు. ఈ క్రమంలో ఓ మహిళ తన కూతురి నుంచి విడిపోతుంది. ఆమె జోంబీలతో పోరాడుతూ తన కూతురి కోసం వెతకడం ప్రారంభిస్తుంది. ఈ వెబ్ సీరిస్ Netflixలో స్ట్రీమ్ అవుతోంది.
9. All Of Us Are Dead (ఆల్ ఆఫ్ అజ్ ఆర్ డెడ్): జోంబీ చిత్రాల్లో ఇది కాస్త భిన్నమైనది. ప్రతి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగుతుంది. కొరియాకు చెందిన ఈ వెబ్ సీరిస్‌కు ఇప్పటికే మంచి రివ్యూస్ లభించాయి. స్కూల్‌లో ర్యాగింగ్ ఎదుర్కొంటున్న తన కొడుకును బలవంతుడిగా మార్చాలనే ఉద్దేశంతో అదే స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్న టీచర్ చేసిన ప్రయోగం వికటిస్తుంది. ఆ తర్వాత ఆ వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుందనేది ఈ వెబ్ సీరిస్‌లో చూడవచ్చు. ఇది Netflixలో స్ట్రీమ్ అవుతోంది.
Also Read: ‘యుద్ధం’ చూడాలని ఉందా? ఈ 8 వెబ్‌సీరిస్‌లు కట్టిపడేస్తాయ్, డోన్ట్ మిస్!
10. Betaal (బేతాల్): ఇది తొలి భారతీయ ‘జోంబీ’ చిత్రం. మే, 2020న విడుదలైన ఈ వెబ్ సీరిస్‌కు షారుఖ్ ఖాన్ సహ నిర్మాత. వినీత్ కుమార్ సింగ్, అహానా కుమ్రా ఈ వెబ్ సీరిస్‌లో ప్రధాన పాత్రల్లో నటించారు. దీనికి ఉత్తమ భారతీయ జోంబీ చిత్రంగా ప్రశంసలు లభించాయి.
Also Read: రొమాన్సే కాదు, అంతకు మించి - ఈ వెబ్ సీరిస్‌లు పెద్దలకు మాత్రమే, పిల్లలతో చూడొద్దు!
The Great Indian Suicide : ఆహాలో 'ది గ్రేట్ ఇండియన్ సూసైడ్' - హెబ్బా పటేల్ సినిమా ఎక్స్‌క్లూజివ్ రిలీజ్!
Upcoming OTT Movies: ఈవారం థియేటర్లలో పెద్ద సినిమాల సందడి, ఓటీటీలో ఏకంగా 35కు పైగా చిత్రాల విడుదల
RDX OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ - తెలుగులో ఎప్పుడంటే?
DD Returns: తెలుగులో సంతానం తమిళ్ బ్లాక్ బస్టర్ మూవీ - ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోందంటే?
Kushi OTT Release Date: 'ఖుషి' ఓటీటీలోకి వచ్చేస్తోంది - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!
Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి
IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు రెడీ!
Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?
/body>