Romantic Web Series: రొమాన్సే కాదు, అంతకు మించి - ఈ వెబ్ సీరిస్‌లు పెద్దలకు మాత్రమే, పిల్లలతో చూడొద్దు!
ఓటీటీల్లో అడల్ట్ కంటెంట్‌పై ఏ క్షణంలోనైనా వేటు పడవచ్చు. కాబట్టి, ఈ వెబ్ సీరిస్‌లను ఆలస్యం లేకుండా చూసేయండి.
Adult Web Series | ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ (Game Of Thrones) వంటి వెబ్ సీరిస్‌లు చాలా గొప్పగా ఉంటాయి. కాసేపు మనల్ని ఆ ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. అలాంటి సీరిస్‌లను ఎన్ని సీజన్లు చిత్రీకరించినా చూసేయడానికి జనాలు సిద్ధమే. ఎందుకంటే.. అలాంటి వెబ్ సీరిస్‌ల్లో దాపరికాలు ఉండవు. ఉన్నది ఉన్నట్లు చూపించేస్తారు. అది సెక్స్ అయినా సరే, మనుషులను క్రూరంగా చంపేసే సీన్లయినా సరే.. రాజీ పడకుండా రియల్‌గా ఉండేలా చేస్తారు. కాబట్టి, ఆయా వెబ్ సీరిస్‌లు లేదా టీవీ షోస్ చూస్తున్నప్పుడు మీ పెద్దలు లేదా పిల్లలు దగ్గర లేకుండా చూసుకోండి. ఎందుకంటే అలాంటి వెబ్ సీరిస్‌లను చూడాలంటే గుండె ధైర్యం ఉండాలి. కొన్ని సన్నివేశాలను చూస్తే వాంతులు కూడా అయిపోతాయి. మరి, అలాంటి భయానకమైన, దాపరికాల్లేని రొమాంటిక్ వెబ్ సీరిస్‌లను మీకు కూడా చూడాలని ఉందా? అయితే, తప్పకుండా ఈ లిస్ట్ ఫాలో అయిపోండి.
1. Game Of Thrones (గేమ్ ఆఫ్ థ్రోన్స్): ఇప్పటికే మీరు ఈ వెబ్ సీరిస్‌ను చూసి ఉంటారు. దీన్ని ఇంకా చూసి ఉండకపోతే ఈ రోజే మొదలుపెట్టండి. ఈ సీరిస్‌ను ముగించాలంటే కనీసం రెండు నెలలు పడుతుంది. ఎందుకంటే దీన్ని మొత్తం 8 సీజన్లుగా విడుదల చేశారు. ఒక్కో సీజన్‌లో 6 నుంచి 10 వరకు ఎపిసోడ్స్ ఉంటాయి. కాబట్టి.. చాలా ఓపిగ్గా చూడాలి. యుద్ధాలు, సెక్స్, రాజనీతి, హింస, గుండె దడ పుట్టించే సన్నివేశాలెన్నో ఈ సీరిస్‌లో ఉన్నాయి. (OTT: Disney Plus HotStar)
2. The Witcher (ది విచర్): ఇది కూడా ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ తరహాలోనే ఉంటుంది. అయితే, ఇది మంత్రగాళ్ల నేపథ్యంలో సాగుతుంది. ఇందులో భారత సంతతికి చెందిన అన్నా చలోత్రా కీలక పాత్ర పోషిస్తోంది. మొదటి సీజన్‌లో ఏ మాత్రం రాజీ పడకుండా అందాలు మొత్తం ప్రదర్శించింది. అయితే, అలాంటి సన్నివేశాలను పక్కన పెడితే, ఈ సీరిస్‌లో ప్రతి ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా ఉంటుంది. కానీ, రెండో సీరిస్‌లో మాత్రం నగ్న సన్నివేశాలు ఉండవు. కథనం మాత్రం చాలా బాగుంటుంది. కాబట్టి, మీరు ఎలాంటి సందేహం లేకుండా ‘ది విచర్’ రెండు సీరిస్‌లను చూడవచ్చు. (OTT: Netflix)
3. Virgin River (వర్జిన్ రివర్): కొత్త జీవితాన్ని వెతుక్కుంటూ ఓ ట్రైనీ నర్సు లాస్ ఎంజిలాస్ నుంచి నార్త్ కాలిఫోర్నియాలోని చిన్న పట్టణానికి వెళ్తుంది. అక్కడ ఆమెకు ఎలాంటి వ్యక్తులు పరిచయమయ్యారు? ఆ తర్వాత ఆమె జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందనేది ఈ టీవీ షోలో చూడవచ్చు. మొత్తం 3 సీజన్లు నెట్ ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్నాయి. (OTT: Netflix)
4. DOM (డామ్): వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన బ్రెజిలియన్ క్రైమ్ వెబ్ సిరీస్ ఇది. అమెజాన్‌కు చెందిన మొదటి స్క్రిప్ట్ ఒరిజినల్ షో ఇదే. తండ్రి కొడుకుల మధ్య జరిగే సంఘర్షణలతో ఈ వెబ్ సీరిస్ సాగుతుంది. తండ్రి విక్టర్ ఒక పోలీసు అధికారి. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అంతం చేయడానికి అంకితభావంతో పనిచేస్తాడు. కానీ, అతని కుమారుడు పెడ్రో డ్రగ్స్, నేర జీవితాన్ని గడుపుతాడు. చివరికి పెడ్రో.. బ్రెజిల్‌లో మోస్ట్ వాంటెడ్ నేరస్థులలో ఒకడిగా మారతాడు. సెక్స్, డ్రగ్స్, ఇతరాత్ర నేరాలకు సంబంధించిన కంటెంట్‌తో చాలా బోల్డ్‌గా ఈ సీరిస్ ఉంటుంది. ఇది తెలుగులో కూడా అందుబాటులో ఉంది. (OTT: Amazon Prime Video)
5. ELITE (ఎలైట్): నెట్‌ఫ్లిక్స్‌లోని ఈ స్పానిష్ టీన్ థ్రిల్లర్ సిరీస్‌కు భలే క్రేజ్ ఉంది. ఎందుకంటే, ఇది కళాశాల చుట్టూ తిరిగే కథ. ముఖ్యంగా మధ్యతరగతి, సంపన్న వర్గాలకు చెందిన విద్యార్థుల మధ్య జరిగే మానసిక సంఘర్షణను ఇందులో చూపించారు. ఇందులో విద్యార్థుల మధ్య జరిగే కలయిక సన్నివేశాలను చాలా బోల్డ్‌గా చూపించారు. టీనేజ్ రొమాన్స్, థ్రిల్లర్‌లను ఇష్టపడేవారు ఈ వెబ్ సీరిస్‌ను చూడవచ్చు. ‘మనీ హీస్ట్’ వెబ్ సీరిస్‌లో ఉన్న ఇద్దరు టీనేజ్ నటులు ఈ వెబ్ సీరిస్‌కు ప్రత్యేక ఆకర్షణ. ఇది తెలుగులో కూడా అందుబాటులో ఉంది. (OTT: Netflix)
6. I Love Dick (ఐ లవ్ డిక్): టైటిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది.. ఇది పక్కా అడల్ట్ వెబ్ సీరిస్ అని. టైటిల్‌కు తగినట్లే ఈ వెబ్ సీరిస్‌లో రొమాన్స్ మోతాదు ఎక్కువే. క్రిస్ (కాథరిన్ హాన్) అనే ఆర్టిస్ట్-కమ్-ఫిల్మ్‌మేకర్ జీవితం చుట్టూ తిరుగుతుంది. ఆమె తన భర్త యొక్క ఫెలోషిప్ పని కోసం టెక్సాస్‌లోని మార్ఫాకు వెళ్తుంది. ఆ తర్వాత ఫెలోషిప్ స్పాన్సర్ డిక్ (కెవిన్ బేకన్) ప్రేమలో పడుతుంది. క్రిస్ తన భావాలను మనసులోనే ఉంచుకుంటుంది. తన లైంగిక కోరికలను సూచించే లేఖలను రాస్తుంది. కానీ, అతడికి ఇవ్వకుండా తన వద్దే ఉంచుకుంటుంది. ఈ సిరీస్‌లో సెక్స్, నగ్న సన్నివేశాలు చాలానే ఉన్నాయి. ఇందులో కొన్ని లైంగిక సన్నివేశాలను సహజత్వం కోసం ఆ పాత్రలతో నిజంగానే సెక్స్ చేయించారట. (OTT: Amazon Prime Video)
7. Sex Education (సెక్స్ ఎడ్యుకేషన్): అడల్ట్ కామెడినీ ఇష్టపడే టీనేజర్లకు ఇది బాగా నచ్చేస్తుంది. ఒకసారి చూస్తే.. అలా చూస్తుండిపోతారంతే. లైంగికంగా ఇబ్బందిపడే ఓ టీనేజర్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. టైటిల్‌కు తగినట్లే.. ఇందులో సెక్స్ మాత్రమే కాదు. సెక్స్ విజ్ఞానం కూడా ఉంటుంది. కాబట్టి, మిస్ కాకుండా చూడండి. ఈ సీరిస్ మిమ్మల్ని నవ్వించడమే కాదు, విజ్ఞానం కూడా అందిస్తుంది. (OTT: Netflix)
8. The Affair (ది అఫైర్): ఇది రెండు జంటల మధ్య జరిగే ఏరోటిక్ డ్రామా. టీచర్‌గా పనిచేసే నోహ్, వెయిట్రెస్‌గా పనిచేసే అలిసన్ కుటుంబంలో ఎలాంటి అలజడులు నెలకొంటాయనేది కథనం. అక్రమ, లైంగిక సంబంధాల చుట్టూ తిరుగుతుంది. అయితే, సెక్స్ సన్నివేశాలను కావాలని చొప్పించినట్లుగా ఉండవు. కథలో భాగంగానే ఉంటాయి. అవి కథకు ప్రాణం పోస్తాయి. (OTT: Amazon Prime Video)
9. OUTLANDER (ఔట్‌ల్యాండర్): డయానా గబాల్డన్ రాసిన ఐదవ పుస్తకం ‘ది ఫియరీ క్రాస్’ ఆధారంగా ‘అవుట్‌ల్యాండర్’ వెబ్ సీరిస్‌ను తెరకెక్కించారు. ఇందులో మొత్తం ఐదు సీజన్‌లు ఉంటాయి. ఇది కాలాతీత ప్రేమ కథ. రెండు ముక్కల్లో చెప్పడం కంటే చూస్తేనే బెటర్. ఎందుకంటే, ఈ సీజన్ ఒక్కసారి మొదలుపెడితే చాలు, మీరు తప్పకుండా ఈ షోకు బానిసలైపోతారు. ఇప్పటివరకు 5 సీజన్లు అందుబాటులో ఉన్నాయి. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ తరహాలోనే ఇందులోనూ లొకేషన్లు చాలా బాగుంటాయి. రొమాన్స్ కూడా బోలెడంత ఉంటుంది. అంతేకాదు, మాంచి ఫీల్ గుడ్ సీరిస్ కూడా ఇది. (OTT: Netflix)
Also Read: ‘యుద్ధం’ చూడాలని ఉందా? ఈ 8 వెబ్‌సీరిస్‌లు కట్టిపడేస్తాయ్, డోన్ట్ మిస్!
10. Dexter (డెక్స్టర్): ఇదో మిస్టరీ వెబ్ సీరిస్. ఓ సీరియల్ కిల్లర్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఫోరెన్సిక్ ల్యా్బ్‌లో పనిచేసే డెక్స్టర్ మార్గన్ అనే బ్లడ్ ప్యాటరన్ అనాలసిస్ట్ చుట్టూ తిరుగుతుంది. పోలీసులతో కలిసి మర్డర్ కేసులను ఛేదిస్తూ మంచిగా కనిపించే డెక్స్టర్ కూడా ఓ సీరియల్ కిల్లర్. అయితే, ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్‌లో ఉండటం వల్ల ఎలాంటి ఆధారాలు లభించకుండా జాగ్రత్తపడతాడు. అయితే, అతడికి మరో సీరియల్ కిల్లర్ నుంచి ఊహించని పరీక్ష ఎదురవుతుంది. గుండె ధైర్యం ఉంటేనే ఈ వెబ్ సీరిస్ చూడగలరు. ఎందుకంటే, ఇందులో మనుషులను ముక్కలు చేసే సన్నివేశాలు సెన్సార్ చేయకుండా చూపించారు. అలాగే బోల్డ్ సన్నివేశాలు కూడా బోలెడున్నాయి. అయితే, అవి కథలో భాగంగానే వస్తాయి. (OTT: Amazon Prime Video)
Also Read: బాక్స్ నిండా మనుషుల తలలు, నగలనుకుని ఎత్తుకెళ్లిన దొంగలు - ఇంతకీ అవి ఎవరి తలలు?