అన్వేషించండి

Upcoming Movies: దీపావళి స్పెషల్ – థియేటర్లు, ఓటీటీల్లో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే!

ఈ వారం దీపావళి సందర్భంగా కొన్ని సినిమాలు థియేటర్లలో, కొన్ని ఓటీటీల్లో సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి.

దీపావళి కానుకగా పలు సినిమాలు థియేటర్లలో, ఓటీటీల్లో సందడి చేసేందుకు సిద్ధం అవుతున్నాయి. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

థియేటర్లలో విడుదలయ్యే మూవీస్

*జిన్నా

హీరో మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం 'జిన్నా'. అవా ఎంటర్టైన్మెంట్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను  ఈశాన్‌ సూర్య హెల్మ్‌ తెరకెక్కిస్తున్నాడు.  పాయల్‌ రాజ్‌ పుత్‌, సన్నీ లియోన్‌ లు హీరోయిన్స్‌ గా చేస్తున్నారు. కోన వెంకట్‌ స్క్రిప్ట్‌ ఇవ్వడంతో పాటు క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్‌ 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది. 

*ఓరి దేవుడా

విశ్వక్ సేన్, విక్టరీ వెంకటేష్ కలిసి నటించిన తాజా సినిమా ‘ఓరి దేవుడా’. అక్టోబరు 21న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.   ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టయిన ‘ఓమై కడువలే’ చిత్రానికి అఫిషియల్ రీమేక్.  ‘ఓ మై కడువలై’ దర్శకుడు అశ్వత్ మారి ముత్తునే తెలుగు సినిమాకూ దర్శకత్వం వహించాడు.  రొమాంటింక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. విశ్వక్ సేన్ సరసన మిథిలా పాల్కర్ హీరోయిన్‌గా చేసింది. లియాన్ జేమ్స్ సంగీతం అందించగా.. పీవీపీ సినిమాస్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లు ఈ సినిమాను నిర్మించాయి.

*ప్రిన్స్

కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరెక్కిన ఈ సినిమాలో  శివకార్తికేయన్‏, ఉక్రెయిన్ బ్యూటీ మారియా హీరో, హీరోయిన్లుగా చేస్తున్నారు.   ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  అక్టోబర్ 21న ప్రిన్స్ సినిమా తెలుగు, తమిళంలో విడుదల అవుతోంది. 

*సర్దార్

తమిళ నటుడు కార్తి హీరోగా పి.ఎస్‌. మిత్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్దార్‌’.  రాశీఖన్నా, రజీషా విజయన్‌ హీరోయిన్లుగా చేస్తున్నారు. చంకీ పాండే కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా దీపావళి కానుకగా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఇండియన్‌ మిలటరీ ఇంటిలిజెన్స్‌ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. 

*బ్లాక్ఆడమ్

ది రాక్‌ నటించిన తాజా చిత్రం బ్లాక్‌ ఆడమ్‌. ఈనెల 21న ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్‌ అవుతుంది. ఇంగ్లిష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళ్‌ భాషల్లోనూ విడుదల చేస్తున్నారు.   ఇతర దేశాల్లో కంటే భారత్‌తో ఒక్క రోజు ముందుగానే అంటే అక్టోబర్‌ 20నే ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. జుమీ కొల్లెట్‌ సెర్రా తెరకెక్కించిన ఈ సినిమాకు ఆడమ్‌ స్టికెల్‌, రోరో హైన్స్‌, షోరబ్‌ నోహిర్వాని స్టోరీ అందించారు. దిరాక్‌తో పాటు అల్డిస్‌ హోడ్జ్‌, నోహ్‌ సెంటినియో, క్రింటెస్సా స్విన్‌డెల్‌, పిర్సీ బ్రెస్నాన్‌  కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ వార్నర్‌ బ్రదర్స్‌ ఈ యాక్షన్‌ అడ్వెంచెరస్‌, ఫాంటసీ మూవీని నిర్మించారు.

ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు

*అమ్ము

ఐశ్వర్య లక్ష్మి కీలక పాత్రలో నటించిన సినిమా అమ్ము.  చారుకేశ్‌ శేఖర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కల్యాణ్‌ సుబ్రహ్మణ్యం, కార్తికేయ సంతానం నిర్మించారు.   అమెజాన్‌ ప్రైమ్‌లో అక్టోబర్‌ 19 నుంచి ప్రసారం కానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.  

*ఒకే ఒక జీవితం

శర్వానంద్‌ హీరోగా టైమ్‌ ట్రావెల్‌ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘ఒకే ఒక జీవితం’  శ్రీ కార్తిక్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సోనీ లివ్‌ ఓటీటీలో అక్టోబరు 20 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. అమల అక్కినేని కీలక పాత్రలో పోషించిన ఈ సినిమా సెప్టెంబరు 9న థియేటర్లలో విడుదలైంది.  

*బింబిసార

క‌ల్యాణ్‌రామ్ హీరోగా న‌టించిన ‘బింబిసార’ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  సోషియో ఫాంట‌సీ క‌థాంశంతో ద‌ర్శ‌కుడు వ‌శిష్ట్ మ‌ల్లిడి ఈ సినిమాను తెర‌కెక్కించాడు. ఈ  సినిమా దీపావ‌ళి కానుక‌గా ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ నెల 21న జీ5 ఓటీటీలో విడుదల కానున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించింది.     

*కృష్ణ వ్రింద విహారి

నాగ‌శౌర్య, షిర్లే సేతియా హీరో, హీరోయిన్లుగా నటించిన సినిమా ‘కృష్ణ వ్రింద విహారి’.  అనీష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. థియేట‌ర్ల‌లో విడుద‌లైన నెల రోజుల్లోనే డిజిట‌ల్ ప్లాట్‌ఫామ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. సెప్టెంబ‌ర్ 23న థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ చిత్రం యావ‌రేజ్ టాక్‌ తెచ్చుకున్నది.  అక్టోబ‌ర్ 23 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాను నాగ‌శౌర్య త‌ల్లిదండ్రులు శంక‌ర్‌ప్ర‌సాద్‌, ఉష నిర్మించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Vadde Naveen: వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
Clown Kohli: కింగ్ కాదు క్లౌన్.. కోహ్లీని అవమానించిన ఆసీస్ మీడియా- సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆగ్రహం
కింగ్ కాదు క్లౌన్.. కోహ్లీని అవమానించిన ఆసీస్ మీడియా- సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆగ్రహం
Gas Cylinder Price Cut: కొత్త సంవత్సరంలో గ్యాస్‌ రేట్ల నుంచి ఉపశమనం! సగానికి సగం తగ్గిన ధరలు
కొత్త సంవత్సరంలో గ్యాస్‌ రేట్ల నుంచి ఉపశమనం! సగానికి సగం తగ్గిన ధరలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Vadde Naveen: వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
Clown Kohli: కింగ్ కాదు క్లౌన్.. కోహ్లీని అవమానించిన ఆసీస్ మీడియా- సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆగ్రహం
కింగ్ కాదు క్లౌన్.. కోహ్లీని అవమానించిన ఆసీస్ మీడియా- సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆగ్రహం
Gas Cylinder Price Cut: కొత్త సంవత్సరంలో గ్యాస్‌ రేట్ల నుంచి ఉపశమనం! సగానికి సగం తగ్గిన ధరలు
కొత్త సంవత్సరంలో గ్యాస్‌ రేట్ల నుంచి ఉపశమనం! సగానికి సగం తగ్గిన ధరలు
Samantha: సింపుల్ లైఫ్... వింటర్‌లో సమంతలా దుప్పటి కప్పుకొని నిద్రపోతే ఎంత బావుంటుందో కదూ
సింపుల్ లైఫ్... వింటర్‌లో సమంతలా దుప్పటి కప్పుకొని నిద్రపోతే ఎంత బావుంటుందో కదూ
Year Ender 2024: ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్‌
ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్‌
Manmohan Singh: మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి మోదీ, సహా ప్రముఖుల నివాళులు- శనివారం మాజీ ప్రధాని అంత్యక్రియలు
మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి మోదీ, సహా ప్రముఖుల నివాళులు- శనివారం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
BJP Leader Annamalai : డీఎంకేను గద్దె దించే దీక్ష చేపట్టిన అన్నామలై - కొరడాతో కొట్టుకున్న తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు
డీఎంకేను గద్దె దించే దీక్ష చేపట్టిన అన్నామలై - కొరడాతో కొట్టుకున్న తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు
Embed widget