Pushpa: సుకుమార్ పై ట్రోలింగ్.. దెబ్బకి సీన్ డిలీట్..
'పుష్ప' సినిమాలో ఓ సీన్ పై సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'పుష్ప' సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది ఈ సినిమా విపరీతంగా నచ్చుతుంది. కొందరు మాత్రం ఏవరేజ్ అని అంటున్నారు. టాక్ ఎలా ఉన్నా.. సినిమా కలెక్షన్స్ పరంగా మాత్రం సత్తా చాటుతోంది. మొదటిరోజు ఈ సినిమా ఓవరాల్ గా రూ.36.72 కోట్ల భారీ షేర్ ను రాబట్టింది. ఒక్క ఓవర్సీస్ లోనే నాలుగున్నర కోట్లు కలెక్ట్ చేసి సత్తా చాటింది.
ఇదిలా ఉండగా.. సినిమాలో ఓ సీన్ పై సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. దర్శకుడు సుకుమార్ ని కూడా ఈ సీన్ విషయంలో ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ ఆ సీన్ ఏంటంటే.. శ్రీవల్లి భుజంపై చేయి వేసి ఫోన్ మాట్లాడుతుంటాడు హీరో. ఆ తరువాత పుష్పరాజ్ తన చేతిని శ్రీవల్లి ప్రైవేట్ పార్ట్స్ పై వేస్తున్నట్లుగా ఆ షాట్ ను కన్వే చేశారు. ఈ సీన్ చూడడానికి కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది. అది కూడా సుకుమార్ లాంటి దర్శకుడి నుంచి అలాంటి సీన్స్ ను ఊహించలేం.
సినిమాలో ఈ సీన్ పెట్టకుండా ఉండాల్సిందనే అభిప్రాయాలు వినిపించాయి. ఈ ఫీడ్ బ్యాక్ సుకుమార్ వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన ఆయన సదరు సన్నివేశాన్ని తొలగించాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం నుంచి థియేటర్లలో ఎడిట్ చేసిన వెర్షన్ ను ప్రదర్శించనున్నారు. మొత్తానికి సుకుమార్ మంచి నిర్ణయం తీసుకున్నాడంటూ ఆయన్ను కొనియాడుతున్నారు.
ఇక వీకెండ్ లో ఈ సినిమా మరిన్ని వసూళ్లను సాధిస్తుందని నమ్ముతున్నారు. ఆంధ్రలో పలు చోట్ల టికెట్ రేట్లు పెరిగాయి కాబట్టి 'పుష్ప' సినిమాకి హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది.
Also Read: ట్రోఫీ మరిచిపో.. అతడికి హింట్ ఇచ్చి కవర్ చేసిన హరితేజ..
Also Read: రవితేజతో గొడవలు.. బాలయ్య క్లారిటీ ఇస్తాడా..?
Also Read:అప్పుడు హోస్ట్ గా.. ఇప్పుడు గెస్ట్ గా.. బిగ్ బాస్ స్టేజ్ పై నాని..
Also Read: 'బిగ్ బాస్' విన్నర్ ఎవరు? నాగార్జున ఏమన్నారంటే...
Also Read: 'పుష్ప' రివ్యూ: సినిమా ఎలా ఉందంటే...?
Also Read: 'పుష్ప'లో ఆ రాజకీయ నాయకుడు ఎవరు?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి