Unstoppable: రవితేజతో గొడవలు.. బాలయ్య క్లారిటీ ఇస్తాడా..?
బాలయ్య షోలో రవితేజ గెస్ట్ గా కనిపించబోతున్నారని సమాచారం.

నందమూరి బాలకృష్ణ రాజకీయాలతో, సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. 'అన్ స్టాపబుల్' అనే షోని హోస్ట్ చేయడానికి అంగీకరించారు. తొలిసారి బాలయ్య హోస్ట్ గా షో అనేసరికి జనాల్లో ఎగ్జైట్మెంట్ పెరిగిపోయింది. పైగా సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేయడమనేసరికి.. ఆయన ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో తెలుసుకోవాలనే కుతూహలం ప్రేక్షకుల్లో కలిగింది. దానికి తగ్గట్లుగానే పేరున్న తారలను గెస్ట్ లుగా తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఇప్పటివరకు మోహన్ బాబు, నాని, బ్రహ్మానందం లాంటి తారలను తీసుకొచ్చారు.
త్వరలోనే ఈ షోలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా కనిపించబోతున్నారు. ఈ ఎపిసోడ్ ని సీజన్ లాస్ట్ లో టెలికాస్ట్ చేయాలని నిర్ణయించుకున్నారట. రీసెంట్ గా రాజమౌళి కూడా ఈ షోలో కనిపించారు. ఇప్పుడు మాస్ మహారాజా రవితేజను గెస్ట్ గా తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఇంట్రెస్టింగ్ విషయమేమిటంటే.. బాలయ్యకి, రవితేజకి పెద్దగా పడదని ఇండస్ట్రీలో మాటలు వినిపిస్తుంటాయి. వీరి మధ్య గొడవకి సంబంధించి మీడియాలో కూడా వార్తలొచ్చాయి.
రవితేజ మెగాఫ్యామిలీకి దగ్గరగా ఉండడమే బాలయ్యతో గొడవకు కారణమంటూ ప్రచారం జరిగింది. అయితే ఇప్పటివరకు ఈ వ్యవహారం గురించి అటు బాలయ్య కానీ.. ఇటు రవితేజ కానీ ఎక్కడ మాట్లాడలేదు. వీరిద్దరూ ఎక్కడా మాట్లాడుకోవడం కానీ కలుసుకోవడం కానీ జరగలేదు. అలాంటిది ఇప్పుడు ఇద్దరూ కలిసి ఒకే స్టేజ్ పై కనిపించబోతున్నారు. అది కూడా బాలయ్య హోస్ట్ చేస్తోన్న 'అన్ స్టాపబుల్' షో కావడం విశేషం.
మరి ఈ షోలో బాలయ్య, రవితేజ.. తమపై వచ్చిన రూమర్స్ పై స్పందిస్తారేమో చూడాలి. రవితేజతో పాటు గోపీచంద్ మలినేని కూడా ఈ షోకి గెస్ట్ గా రానున్నారు. ఇటీవల 'అఖండ'తో హిట్ అందుకున్న బాలయ్య తన తదుపరి సినిమాను గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయనున్నారు.
Also Read:అప్పుడు హోస్ట్ గా.. ఇప్పుడు గెస్ట్ గా.. బిగ్ బాస్ స్టేజ్ పై నాని..
Also Read: 'బిగ్ బాస్' విన్నర్ ఎవరు? నాగార్జున ఏమన్నారంటే...
Also Read: 'పుష్ప' రివ్యూ: సినిమా ఎలా ఉందంటే...?
Also Read: 'పుష్ప'లో ఆ రాజకీయ నాయకుడు ఎవరు?
Also Read: బన్నీ ఫ్యాన్స్ బీభత్సం.. పుష్ప థియేటర్లపై అల్లు అర్జున్ అభిమానుల రాళ్ల దాడులు
Also Read: 'అంతఃపురం'తో ఈ ఏడాదికి వీడ్కోలు చెప్పనున్న రాశీ ఖన్నా!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Before You Go
Allu Arjun Graces Forbes India 2026 Cover | ఫోర్బ్స్ ఇండియా కవర్‌పై అల్లు అర్జున్
ట్రెండింగ్ వార్తలు





















