News
News
వీడియోలు ఆటలు
X

O Kala Movie Trailer: డిస్నీలో ఓ కల - 'దిల్' రాజు చేతుల మీదుగా ట్రైలర్ విడుదల 

గౌరీష్ యేలేటి, రోషిణి, ప్రాచీ టక్కర్ కలిసి నటించిన తాజా సినిమా ‘ఓ కల’. దీపక్ కొలిపాక దర్శకత్వం వహించిన ఈ సినిమా నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను దిల్ రాజు లాంచ్ చేశారు.

FOLLOW US: 
Share:

చక్కటి ప్రేమ కథాంశంతో రూపొందిన సినిమా ‘ఓ కల’. గౌరీష్ యేలేటి, రోషిణి, ప్రాచీ టక్కర్ కలిసి నటించారు. దీపక్ కొలిపాక దర్శకత్వం వహించారు. ఎటిర్నిటి ఎంటర్‪టైన్‪మెంట్, అహం అస్మి ఫిల్మ్స్ బ్యానర్లపై లక్ష్మీ నవ్య, రంజిత్ కుమార్, ఆదిత్య రెడ్డి నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 13 నుంచి నేరుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు రానుంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్ విడుదలైంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు. ప్రేమ ఉన్నా, ఆ విషయాన్ని చెప్పకపోవడంతో ఎంత నరకం అనుభవించాల్సి ఉంటుందో ఈ ట్రైలర్ లో చూపించారు. సినిమాపై ఈ ట్రైలర్ అంచనాలను పెంచేసింది.

ఈ సినిమా తప్పకుండా మంచి విజయాన్ని అందుకుంటుంది- దిల్ రాజు

ఈ సందర్భంగా దిల్ రాజు చిత్ర బృందాన్ని అభినందించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని  ఆకాంక్షించారు. ‘‘ఓ కల ట్రైలర్ చూశాను. చాలా బాగుంది. టీమ్ మొత్తానికి ఆల్ ది బెస్ట్. ఏప్రిల్ 13 నుంచి ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో విడుదల కాబోతోంది. తప్పకుండా అందరూ చూసి టీమ్‌ని ఆశీర్వదించండి’’ అని దిల్ రాజు ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు.

మంచి ప్రేమ కథను చూశామనే ఫీలింగ్ కలిగిస్తుంది- దర్శకుడు దీపక్

ఈ సందర్భంగా దర్శకుడు దీపక్ కొలిపాక మాట్లాడుతూ.. ‘‘తెలుగు సినిమాకి ప్రపంచ స్థాయి గుర్తింపుని తీసుకువచ్చిన దర్శకధీరుడు రాజమౌళిగారి చేతుల మీదుగా ఫస్ట్ లుక్ విడుదల చేశాం. ఆయన ఆశీస్సులు మాకు ఎంతో బలాన్నిచ్చాయి. ఇప్పుడు సక్సెస్‌ఫుల్ నిర్మాత దిల్ రాజుగారు ట్రైలర్ విడుదల చేసి.. సినిమా విజయవంతం కావాలని ఆశీర్వదించారు. మా టీమ్ తరపున ఆయనకు ధన్యవాదాలు. సినిమా విషయానికి వస్తే.. ఒక మంచి కథని తెలుగు ప్రేక్షకులకు చెప్పే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు నా ధన్యవాదాలు. వారిచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. హీరో హీరోయిన్లు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ ఎంతగానో సహకరించారు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‪తో.. ఔట్ అండ్ ఔట్ ఎంటర్‪టైనర్‪గా ఈ సినిమాని తెరకెక్కించాం. ఏప్రిల్ 13 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. మంచి ప్రేమ కథను మనవాళ్ళు చూసి చాలా కాలం అవుతుంది. ఆ లోటును మా చిత్రం తీరుస్తుందని ఖచ్చితంగా చెప్పగలను. తప్పకుండా అందరూ చూసి విజయవంతం చేస్తారని భావిస్తున్నాను’’ అని తెలిపారు.

ఈ సినిమాలో అలీ, వైవా రాఘవ్, దేవి ప్రసాద్, శక్తి, రవితేజ సహా పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషించారు. నీలేష్ మందలపు సంగీతాన్ని అందించగా,  అఖిల్ వల్లూరి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.

View this post on Instagram
 
A post shared by Roshni Sahota (@roshni_sahota)

Read Also: 'మై బేబీ, మై బొమ్మా' - జాక్వెలిన్‌కు తీహార్ జైలు నుంచి సుఖేష్ ప్రేమలేఖ

Published at : 09 Apr 2023 12:09 PM (IST) Tags: Dil Raju O Kala Movie Trailer Gourish Yeleti Roshni Sahota O Kala On Hotstar

సంబంధిత కథనాలు

మామతో అల్లుడి పోజు, పవన్ మూవీ సెట్‌లో మంటలు, చెర్రీపై అక్కినేని ఫ్యాన్స్ అలక - మరిన్ని సినీ విశేషాలు మీ కోసం!

మామతో అల్లుడి పోజు, పవన్ మూవీ సెట్‌లో మంటలు, చెర్రీపై అక్కినేని ఫ్యాన్స్ అలక - మరిన్ని సినీ విశేషాలు మీ కోసం!

Prasanth Varma: 8 మంది సూపర్ హీరోస్ మూవీస్ తీస్తా, ‘ఆది పురుష్’ ప్రభావం ‘హనుమాన్’ మీద ఉండదు: ప్రశాంత్ వర్మ

Prasanth Varma: 8 మంది సూపర్ హీరోస్ మూవీస్ తీస్తా, ‘ఆది పురుష్’ ప్రభావం ‘హనుమాన్’ మీద ఉండదు: ప్రశాంత్ వర్మ

సాయి పల్లవిపై మనసు పారేసుకున్న బాలీవుడ్ హీరో - ఆమెపై క్రష్ ఉందంటూ కామెంట్స్!

సాయి పల్లవిపై మనసు పారేసుకున్న బాలీవుడ్ హీరో - ఆమెపై క్రష్ ఉందంటూ కామెంట్స్!

Arjun Kapoor-Malaika Arora: బెడ్‌పై అర్ధనగ్నంగా బాయ్‌ ఫ్రెండ్ - మలైకా అరోరాపై మండిపడుతున్న నెటిజన్స్!

Arjun Kapoor-Malaika Arora: బెడ్‌పై అర్ధనగ్నంగా బాయ్‌ ఫ్రెండ్ - మలైకా అరోరాపై మండిపడుతున్న నెటిజన్స్!

‘బిచ్చగాడు’ పెద్ద మనసు - క్యాన్సర్ రోగులకు విజయ్ ఆంటోని గుడ్ న్యూస్

‘బిచ్చగాడు’ పెద్ద మనసు - క్యాన్సర్ రోగులకు విజయ్ ఆంటోని గుడ్ న్యూస్

టాప్ స్టోరీస్

AP Politics: ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి భగవంత్ కుబా

AP Politics: ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి భగవంత్ కుబా

Jogi Ramesh: డర్టీ బాబు, టిష్యూ మేనిఫెస్టో - మంత్రి వ్యాఖ్యలు, చించేసి చెత్తబుట్టలో వేసి మరీ

Jogi Ramesh: డర్టీ బాబు, టిష్యూ మేనిఫెస్టో - మంత్రి వ్యాఖ్యలు, చించేసి చెత్తబుట్టలో వేసి మరీ

Andhra News : జీతం బకాయిల కోసం ఆత్మహత్యాయత్నం - ఏపీలో విషాదం !

Andhra News  :  జీతం బకాయిల కోసం ఆత్మహత్యాయత్నం - ఏపీలో విషాదం  !

Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!

Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!