(Source: ECI/ABP News/ABP Majha)
Sukesh Chandrasekhar Letter : 'మై బేబీ, మై బొమ్మా' - జాక్వెలిన్‌కు తీహార్ జైలు నుంచి సుఖేష్ ప్రేమలేఖ
Sukesh Chandrasekhar Jacqueline Fernandez : జాక్వెలిన్ కు సుకేష్ మరో లేఖ రాశారు. ఈస్టర్ శుభాకాంక్షలు చెప్తూ తీహార్ జైలు నుంచి లేఖ పంపించారు. అందులో 'మై బేబీ, మై బొమ్మా' అని రాసుకొచ్చారు.
మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సుకేష్ చంద్రశేఖర్, నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు మరో లేఖ రాశారు. ఈస్టర్ సందర్భంగా ప్రత్యేక లేఖ పంపారు. పండుగ శుభాకాంక్షలు చెప్పారు. పనిలో పనిగా ఆమెపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచే ప్రయత్నం చేశారు.
'మై బేబీ, మై బొమ్మా' అంటూ...
"మై బేబీ... మై బొమ్మా జాక్వెలిన్'' అంటూ సుకేష్ చంద్రశేఖర్ లేఖ స్టార్ట్ చేశారు. ''బేబీ ఐ విష్ యు వెరీ హ్యాపీ ఈస్టర్! ఈ ఏడాది మీకు ఇష్టమైన పండుగల్లో ఇది ఒకటి” అని ఆ లేఖలో వెల్లడించారు. జైలు శిక్ష అనుభవిస్తున్న తాను ఆమె చిన్న పాప లాంటి చిరునవ్వును మిస్ అవుతున్నట్లు పేర్కొన్నారు. "మై బేబీ, నువ్వు ఎంత అందంగా ఉంటావో నీకు ఏమైనా ఐడియా ఉందా. ఈ గ్రహం మీద నీ అంత అందంగా ఎవ్వరూ లేరు. నా కుందేలు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు ఎప్పటికీ నాదానివే!” అంటూ జాక్వెలిన్ పై తన ప్రేమను వ్యక్తపరిచారు. త్వరలోనే ఈ ఇబ్బందులు తొలగిపోతాయని, అందరినీ చూడబోతున్నానని వెల్లడించారు. వచ్చే ఈస్టర్ జాక్వెలిన్ కు మరింత స్పెషల్ గా ఉండబోతుందన్నారు.
జాక్వెలిన్‌కు పాటను అంకితం చేసిన సుకేష్
సుకేష్ తన ‘బేబీ’కి రాసిన లేఖలో... ‘తు మైలే, ఔర్ దిల్ కిలే, ఔర్ జీనే కో క్యా చాహియే’ కొత్త వెర్షన్ విన్నప్పుడు నీ గురించే ఆలోచిస్తున్నాను అంటూ జాక్వెలిన్ కు చెప్పారు. అంతేకాదు, జాక్వెలిన్ తో పాటు ఆమె తల్లిదండ్రులకు కూడా శుభాకాంక్షలు చెప్పుకొచ్చారు. గతంలోనూ పలు మార్లు ఆమెకు సుకేష్ లేఖలు రాశారు. సుకేష్ బర్త్ డేతో పాటు హోలీ రోజున లెటర్స్ పంపారు. ‘‘మై బేబీ జాక్వెలిన్. నా బర్త్ డే రోజు నిన్ను చాలా మిస్ అవుతున్నా. నీ మాటలను, నీ ఎనర్జీని ఎంతగానో మిస్ అవుతున్నా. కానీ, నా మీద నీకున్న ప్రేమ ఎంతో గొప్పది. అది ఎప్పటికీ తగ్గదని నాకు తెలుసు. నీ అందమైన హృదయంలో ఏముందో నాకు బాగా తెలుసు. దానికి ఫ్రూఫ్స్ అవసరం లేదు. నా జీవితంలో వెల కట్టలేని కానుక ఏదైనా ఉంది అంటే అది నువ్వు మాత్రమే. బుట్టబొమ్మా నిన్ను నేను ఎంతో ప్రేమిస్తున్నాను” అంటూ సుకేష్ ఆ లేఖలో రాశాడు.
మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ పైనా అభియోగాలు
రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో సుకేష్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఆయన నుంచి జాక్వెలిన్ ఖరీదైన బహుమతులు అందుకున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఈ వార్తల నేపథ్యంలో ఈడీ అధికారులు దర్యాప్తు చేశారు. ఆమెను కూడా ఈ కేసులో నిందితురాలిగా చేర్చారు. పలుమార్లు ఆమెను విచారించారు కూడా. అయితే, తనను కావాలని ఈ కేసులో ఇరికించినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. సుకేష్ తన జీవితాన్ని నాశనం చేశాడని ఆరోపించింది. తన జీవితంలో ఆడుకుని, కెరీర్ ను మొత్తం చెడగొట్టాడని న్యాయస్థానం ముందు వాగ్మూలం ఇచ్చింది. హోంశాఖలో అధికారిగా పరిచయం చేసుకుని, తనను సంబంధంలేని కేసులో ఇరికించాడని బాధపడింది. సుకేష్ ఓ మోసగాడని గుర్తించలేకపోయానని చెప్పింది. తనని నయవంచనకు గురి చేసి, తప్పుదారి పట్టించాడని వెల్లడించింది. ఈ కేసులో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
View this post on Instagram
Read Also: పదిహేనేళ్ళకు పోర్న్ స్టార్ అన్నారు, నాన్న కూడా అలాగే చూశాడు - ఉర్ఫీ జావేద్