Urfi Javed : పదిహేనేళ్ళకు పోర్న్ స్టార్ అన్నారు, నాన్న కూడా అలాగే చూశాడు - ఉర్ఫీ జావేద్
15 ఏండ్ల వయసులోనే ఎన్నో ఇబ్బందులు పడినట్లు వెల్లడించింది ఉర్ఫీ జావేద్. తన ఫోటో ఎవరో పోర్న్ సైట్ లో అప్ లోడ్ చేయడంతో ఇంట్లో తీవ్రంగా హింసించారని చెప్పింది. అందుకే ఇంట్లో నుంచి పారిపోయానంది.
ఉర్ఫీ జావేద్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఓటీటీ బిగ్ బాస్ షో ద్వారా బాగా పాపులర్ అయ్యింది. షో నుంచి ఎలిమినేట్ అయిన తొలి BB OTT కంటెస్టెంట్ ఆమె. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు వివాదాలతో బాగా ఫేమస్ అయ్యింది. ముఖ్యంగా ఆమె వేసుకునే డ్రెస్సులు.. ఉఫ్.. ఉర్ఫీ.. ఇవేం డ్రెస్సులు అనిపించేలా ఉంటాయి. ఆమె వెరైటీ దుస్తుల వల్లే నిత్యం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తాజాగా తన బాల్యంలో ఎదుర్కొన్ని కష్టాల గురించి వెల్లడించింది. 17 ఏండ్ల వయసులోనే ఇంట్లో నుంచి ఎందుకు పారిపోవాలనే నిర్ణయం తీసుకుందో వివరించింది.
15 ఏండ్ల వయసులోనే ఎన్నో ఇబ్బందులు
15 ఏండ్ల వయసులోనే తన ఫోటోలను ఎవరో పోర్న్ సైట్‌లో ఉంచడంతో అసలు సమస్య మొదలయ్యిందని ఉర్ఫీ వివరించింది. ‘‘నాకు 15 ఏళ్లు ఉన్నప్పుడు నా ఫొటోను ఎవరో పోర్న్ సైట్‌లో అప్‌లోడ్ చేశారు. అది మామూలు ఫోటోనే. ట్యూబ్ టాప్ వేసుకుని ఫేస్‌బుక్ ప్రొఫైల్ ఫోటోగా అప్‌లోడ్ చేశాను. ఎవరో వాటిని డౌన్‌లోడ్ చేసి మార్ఫింగ్ లేకుండా పోర్న్ సైట్‌లో అప్‌లోడ్ చేశారు. మెల్లగా ఆ విషయం అందరికీ తెలిసిపోయింది. అందరూ నన్ను తిట్టడం మొదలుపెట్టారు. తనను పోర్న్ స్టార్ అని ప్రచారం చేశారు” చెప్పింది.
17 ఏండ్ల వయసులో ఇంట్లో నుంచి పారిపోయిన ఉర్ఫీ
అంతేకాదు, “మా నాన్న కూడా తనను పోర్న్ స్టార్ లా చూసేవారు. అంతేకాదు, ఆ ఫోటోలతో సానుభూతి పొందేందుకు ప్రయత్నించారు. పోర్న్ సైట్స్ రూ. 50 లక్షలు అడుగుతున్నాయని అందరికీ చెప్పేవాడు. మా బంధువులకు చెప్పాడు. వాటితో కలిసి పని చేయడం కుదరదని చెప్పడంతో ఇంట్లో వాళ్ళు నన్ను కొట్టేవారు. రెండేళ్లు భరించాను. బంధువులు, తండ్రి నుంచి కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాను. 17 ఏండ్ల వయసులో నేను ఇంట్లో నుంచి పారిపోవాలనే నిర్ణయం తీసుకున్నాను” అని చెప్పుకొచ్చింది.
టీవీలో అవకాశం ఎలా వచ్చిందంటే?
ఉర్ఫీ ఆ తర్వాత లక్నోకు చేరుకుంది. అక్కడ పిల్లలకు ట్యూషన్ చెప్పేది. వచ్చే డబ్బులతో ఇంటి అద్దె చెల్లించేది. ఆ తరువాత ఢిల్లీకి వెళ్లింది. అక్కడ మిత్రుడి ఫ్లాట్ లో ఉంటూ కాల్ సెంటర్ ఉద్యోగం చేసింది. అనంతరం ముంబైకి వెళ్లి పలు టీవీ సీరియల్స్ పాత్రల కోసం ఆడిషన్ చేసింది. టెలివిజన్‌లో చిన్న చిన్న పాత్రలకు సెలెక్ట్ అయ్యింది. చిన్నగా పాపులర్ అయ్యింది. బిగ్ బాస్ షోతో బాగా పాపులర్ అయ్యింది. ఇక ఆమె వేసుకునే దుస్తుల ద్వారా మరింత గుర్తింపు తెచ్చుకుంది.బిగ్ బాస్ OTT షో తర్వాత ఉర్ఫీ పలు టీవీ షోలలో నటించింది. ‘బడే భయ్యా కి దుల్హనియా’లో అవనీ పాత్రను పోషించి బాగా పేరు సంపాదించింది. ALT బాలాజీలో ప్రసారమైన ‘మేరీ దుర్గా’లో ఆర్తిగా, ‘బేపన్నా’లో బెల్లాగా, ‘పంచ్ బీట్’ సీజన్ 2లో మీరాగా కనిపించింది. 2016 నుండి 2017 వరకు, ఉర్ఫీ స్టార్ ప్లస్ ‘చంద్ర నందిని’లో ఛాయా పాత్రను పోషించింది. 2018లో SAB TV ‘సాత్ ఫేరో కి హెరా ఫెరీ’లో కామినీ జోషి పాత్రను పోషించింది. 2020లో ఉర్ఫీ జావేద్ ‘యే రిష్తా క్యా కెహ్లతా హై’లో శివాని భాటియాగా చేసింది. ఆ తర్వాత ‘కసౌతి జిందగీ కే’లో తనీషా చక్రవర్తి పాత్ర పోషించింది.
View this post on Instagram
Read Also: వానిటీ వ్యాన్ TO ప్రైవేట్ జెట్, అల్లు అర్జున్ దగ్గరున్న 5 అత్యంత ఖరీదైన వాహనాలు ఇవే!