అన్వేషించండి

NTR's New Movie Update: ఎన్టీఆర్, కొరటాల శివ సినిమా అప్డేట్ - ఇక ఫ్యాన్స్ కు పండగే !

ఎన్టీఆర్, కొరటాల సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ఆగిపోలేదని త్వరలోనే సెట్స్ పైకి వస్తుందని ఆ సినిమా పి.ఆర్.ఓ సోషల్ మీడియాలో అనౌన్స్ చేయడంతో మళ్ళీ ఈ సినిమా చర్చనీయాంశంగా మారింది.

'ఆర్ఆర్ఆర్' సినిమా తర్వాత ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా ఏంటి అనే దానిపై చర్చలు జరిగాయి. 'ఆర్ఆర్ఆర్'తో ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా ప్రపంచస్థాయిలో భారీ వసూళ్లను రాబట్టింది. అయితే 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో సినిమా రాబోతుందని వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి రాలేదు. నెలలు గడుస్తున్నా మూవీ ఇంకా పట్టాలెక్కకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొరటాల-ఎన్టీఆర్ సినిమా ఆగిపోయిందని వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి..

అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. సినిమా ఆగిపోలేదని త్వరలోనే సెట్స్ పైకి వస్తుందని ఆ సినిమా పీఆర్వో సోషల్ మీడియాలో అనౌన్స్ చేయడంతో మళ్ళీ ఈ సినిమా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే సినిమాకు సంబంధించి వచ్చిన పోస్టర్, డైలాగ్ రిలీజ్ లు అభిమానుల్లో మరింత జోష్ నింపాయి. ఇలాంటి టైంలో సినిమా రద్దు అయిందనే వార్తలు పుట్టుకొస్తుండటంతో వాటికి చెక్ పెట్టే విధంగా తాజాగా ఈ అనౌన్స్మెంట్ ఇచ్చింది మూవీ టీమ్. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. 

సాధారణంగా ఎస్.ఎస్ రాజమౌళి తో సినిమా చేసిన హీరోలకు తర్వాత సినిమా ఫ్లాప్ అనే సెంటిమెంట్ ఒకటి ఇండస్ట్రీలో సర్కిల్ అవుతూ ఉంటుంది. 'ఆర్ఆర్ఆర్' సినిమాలో రామ్ చరణ్ నటించారు. ఆ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమా చేశారు చరణ్. ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద ఘోర పరాజయం పాలైంది. చిరంజీవి, రామ్ చరణ్ కలసి నటించినా ఆ క్రేజ్ కూడా సినిమాను గట్టెక్కించలేకపోయింది. ఈ సినిమా ఫలితం పూర్తిగా కొరటాల మీద పడింది. దీంతో ఎన్టీఆర్- కొరటాల కాంబో లో వస్తున్న సినిమాపై ఎన్టీఆర్ పునరాలోచన చేశారని, కొరటాల తో సినిమాను ప్రస్తుతం వాయిదా వేసినట్టు వార్తలు కూడా వచ్చాయి. మొన్నటి వరకూ ఇలాంటి వార్తలే సర్కులేట్ అవుతూ వచ్చాయి. అయితే తాజా అనౌన్స్మెంట్ తో వాటన్నిటికీ చెక్ పడిందనే చెప్పొచ్చు. 

ఇక కొరటాల శివ, డీఓపీ రత్నవేలు, ప్రొడక్షన్‌ డిజైనర్‌ సాబు సిరిల్ ప్రీ ప్రొడక్షన్‌ పనులను కూడా వేగవంతం చేస్తున్నారట. ఈ సినిమాను ఎన్‌టీఆర్‌ ఆర్స్ట్, యువసుధ ఆర్స్ట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా లెవల్ లో ప్లాన్ చేస్తున్నారట మూవీ టీమ్. గతంలో ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో వచ్చిన 'జనతా గ్యారేజ్' ఎంత హిట్ అయిందో చెప్పక్కర్లేదు. ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద భారీ విజయం సాధించింది. ఇప్పుడు వీరిద్దరి కాంబో లో వచ్చే సినిమా కావడంతో  సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.  భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా కనిపించంనుందట, అనురుధ్ రవిచంద్రన్‌ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. సినిమా పై రూమార్స్ అన్ని తొలగి పోవడంతో సినిమా ఎప్పుడు పూర్తవుతుందా, ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు.

Also Read : మెగాస్టార్ కోసం కదిలొచ్చిన కాలేజ్ - ఆరు వేల మంది విద్యార్థులతో చిరు 'వాల్తేర్ వీరయ్య' లుక్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు చేసిన ఓయూ జేఏసీ నేతలు
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు చేసిన ఓయూ జేఏసీ నేతలు
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Minister Komatireddy: 'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు చేసిన ఓయూ జేఏసీ నేతలు
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు చేసిన ఓయూ జేఏసీ నేతలు
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Minister Komatireddy: 'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Embed widget