By: ABP Desam | Updated at : 08 Jan 2022 07:11 PM (IST)
శిరీష్, 'దిల్' రాజు, ఎన్టీఆర్, ఆశిష్, శ్రీహర్ష, హర్షిత్ రెడ్డి
'రౌడీ బాయ్స్'... ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు సోదరుడి (శిరీష్) కుమారుడు ఆశిష్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా. ఇందులో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్. నిర్మాత లగడపాటి శిరీష్ తనయుడు సహిదేవ్ విక్రమ్ మరో కీలక పాత్ర చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ చూసిన తర్వాత బావుందని, 'నైస్ నైస్' అంటూ హీరో ఆశిష్, దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటిని అభినందించారు. "ఎప్పుడో 'ప్రేమదేశం' అప్పుడు ఇలా ఉండింది కదా" అని 'దిల్' రాజుతో ఎన్టీఆర్ అన్నారు. "యూత్ కంటెంట్! ఫస్టాఫ్ అంతా కాలేజీలో! తర్వాత స్టోరి ముందుకు వెళుతూ ఉంటుంది" అని 'దిల్' రాజు సమాధానం ఇచ్చారు.
ట్రైలర్ విడుదల చేసిన అనంతరం ఎన్టీఆర్ మాట్లాడుతూ "నాకు 'దిల్' రాజు గారితో, శిరీష్ గారితో 'ఆది' సినిమా అప్పుడు అసోసియేషన్ స్టార్ట్ అయ్యింది. అప్పుడు ఆశిష్ నాకు పరిచయం కాలేదు. బహుశా... చిన్న పిల్లోడు ఏమో! ఈ రోజు మా శిరీష్ అన్న కుమారుడి ట్రైలర్ నేను విడుదల చేయడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఆశిష్ గురించి నేను ఎక్కువ మాట్లాడకూడదు. మాట్లాడితే... నా ఇంట్లో వ్యక్తి గురించి నేను మాట్లాడినట్టు ఉంటుంది. ఆశిష్‌కు ఆల్ ద బెస్ట్. తను ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని, మంచి మంచి చిత్రాల్లో భాగం కావాలని, నటుడిగా బాగా చేయాలని దేవుడిని మనసారా కోరుకుంటున్నాను" అని అన్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు 'దిల్' రాజు, శిరీష్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని ఎన్టీఆర్ వివరించారు. అలాగే, సినిమా ఘన విజయం సాధించాలని కోరుకున్నారు. "నాకు వాళ్లిద్దరూ చాలా ఇంపార్టెంట్ వ్యక్తులు. రాజుతో నాకు ఎప్పుడూ స్క్రిప్ట్స్, ఆన్ సెట్స్ డిస్కషన్స్ ఎక్కువ ఉంటాయి. సరదాగా కామెడీ చేసుకోవడం వంటివి శిరీష్‌తో ఉంటాయి. ఆయన నవ్వు ఎప్పుడూ అలా ఉండాలంటే ఆశిష్ బావుండాలి. ఈ సినిమా ఘన విజయం సాధించాలని, ఈ కొవిడ్ టైమ్‌లో ఒక మంచి చిత్రంగా మన అందరికీ ఆహ్లాదకరంగా ఉండాలని ఆ దేవుడిని మనసారా కోరుకుంటున్నాను. 'హుషారు'లో 'ఉండిపోరాదే...' నాకు ఇష్టమైన పాట. దర్శకుడు శ్రీహర్షతో ఆ విషయం చెప్పాను. 'హుషారు' కంటే ఈ సినిమా ప్రామిసింగ్ గా ఉంది. నాకు 'ప్రేమ దేశం' చూసిన ఎగ్జైట్‌మెంట్ కలిగింది. మీ అందరికీ ఆ ఎగ్జైట్‌మెంట్ కలిగాలని, కలుగుతుందని నమ్ముతున్నాను. కొత్త సినిమాలను, కొత్త నటీనటులను సపోర్ట్ చేసే గొప్ప హృదయం తెలుగు ప్రేక్షకులది. ఈ సినిమాను థియేటర్లలో చూడండి" అని ఎన్టీఆర్ కోరారు. కరోనా నేపథ్యంలో ప్రేక్షకులకు, ప్రజలకు ఎన్టీఆర్ జాగ్రత్తలు చెప్పారు. భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్క్ ధరించమని, వ్యాక్సిన్స్ వేయించుకోమని ఆయన సూచించారు.
Also Read: రానా... వెంకటేష్ బట్టలు ఇప్పేశావ్ నువ్వు!
Also Read: మగాళ్లకు మంచి టిప్... అదీ పెళ్లి తర్వాత భార్యతో బాలకృష్ణ చేసుకున్న అగ్రిమెంట్!
Also Read: చచ్చిపోతా, మంట పెట్టేస్తారనుకున్నా - రాజశేఖర్ భావోద్వేగం... జీవిత కన్నీరు
Also Read: డేంజర్ ముందుంది... ఆ డేంజర్ పేరు రాకీ భాయ్... వేసవిలో!
Also Read: 'చచ్చిపో.. నీకు నరకంలో కూడా చోటుండదు..' కోవిడ్‌తో బాధపడుతున్న హీరోయిన్‌కు శాపనార్థాలు..
Also Read: నా మైండ్ పని చేయలేదు.. గుర్తుపట్టలేనంతగా మారిపోయా.. స్టార్ హీరోయిన్ కామెంట్స్..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.
Ranga Ranga Vaibhavanga: ఆర్జే కాజల్, మెహబూబ్‌తో జతకట్టిన వైష్ణవ్ తేజ్, కేతిక - కొత్తగా లేదేంటో!
Manasanamaha: గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో మన తెలుగు షార్ట్ ఫిలిం 'మనసానమః'!
Samrat Reddy: తండ్రి కాబోతున్న ‘బిగ్ బాస్’ సామ్రాట్
Urfi Javed: వీడియో - అయ్యో, పువ్వు అనుకుని ఫోన్ పడేసిందే, పిచ్చి ముదిరితే ఇంతే!
Madhavan Rocketry: మాధవన్ 'రాకెట్రీ' - తెలుగు సాంగ్స్ విన్నారా?
Telangana SSC Exam Results: గురువారం తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాలు
Janasena Janavani : " జనవాణి " ప్రారంభిస్తున్న పవన్ కల్యాణఅ ! ఇక నుంచి ప్రతి ఆదివారం ..
Privatisation of PSU Banks: బ్యాంకుల ప్రైవేటీకరణ! పార్లమెంటులో కొత్త బిల్లు పెట్టనున్న కేంద్రం
Optical Illusion: ఈ బొమ్మలో ఒక జంతువు దాక్కొని ఉంది, 30 సెకన్లలో దాన్ని కనిపెడితే మీ కంటి చూపు భేష్