Yash Birthday Special: డేంజర్ ముందుంది... ఆ డేంజర్ పేరు రాకీ భాయ్... వేసవిలో!
డేంజర్ ముందుందని 'కె.జి.యఫ్ 2' చిత్ర బృందం హెచ్చరిస్తోంది. హీరో యష్ పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి ఓ పోస్టర్ విడుదల చేసింది.
"హెచ్చరిక...
ఓ డేంజర్ ముందుంది"
అంటోంది హోంబలే ఫిల్మ్స్ ప్రొడక్షన్ హౌస్.
ఆ డేంజర్ పేరు...
రాకీ భాయ్!
రాకీ భాయ్ అలియాస్ యష్!!
Caution⚠️ Danger ahead !
— Hombale Films (@hombalefilms) January 8, 2022
Birthday wishes to our ROCKY BHAI @Thenameisyash.#KGFChapter2 @prashanth_neel @VKiragandur @HombaleGroup @duttsanjay @TandonRaveena @SrinidhiShetty7 @VaaraahiCC @excelmovies@AAFilmsIndia @DreamWarriorpic @PrithvirajProd #KGF2onApr14 #HBDRockingStarYash pic.twitter.com/TVeHXcsCzx
యష్ (Yash) కథానాయకుడిగా హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న పాన్ ఇండియా సినిమా 'కె.జి.యఫ్ 2'. సూపర్ డూపర్ హిట్ 'కె.జి.యఫ్: చాప్టర్ 1'కి ఇది కొనసాగింపు. తొలి భాగానికి దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్ (Prashanth Neel), ఈ రెండో భాగానికి కూడా దర్శకుడు. ఈ రోజు యష్ పుట్టినరోజు (Yash Birthday) సందర్భంగా సినిమాలో కొత్త పోస్టర్ విడుదల చేశారు.
'కె.జి.యఫ్' విడుదల ముందు వరకు యష్ అంటే కన్నడ హీరో మాత్రమే. ఇప్పుడు అతడు పాన్ ఇండియా హీరో. 'కె.జి.యఫ్' విజయంతో యష్‌కు పాన్ ఇండియా లెవల్‌లో ఫ్యాన్స్ ఉన్నారు. ఫ్యాన్ క్లబ్స్ ఏర్పడ్డాయి. 'కె.జి.యఫ్ 2' (KGF 2) మీద మంచి అంచనాలు కూడా ఉన్నాయి. 'కె.జి.యఫ్' విజయంతో రెండో పార్ట్ కోసం బాలీవుడ్ నటులు సంజయ్ దత్ (Sanjay Dutt), రవీనా టాండన్, టాలీవుడ్ నటుడు రావు రమేష్ తదితరులను కీలక పాత్రలకు ఎంపిక చేసుకున్నారు. తొలి పార్ట్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి రెండో పార్ట్ లో కూడా నటిస్తున్నారు.
Also Read: తరుణ్ ఎందుకు సినిమాలు మానేశాడు?
కరోనా కారణంగా పలు సినిమాల షూటింగులు అనుకున్నట్టు జరగలేదు. ముందు అనుకున్న తేదీకి థియేటర్లలోకి రాలేదు. ఆ సినిమాల జాబితాలో 'కె.జి.యఫ్ 2' కూడా ఉంది. అయితే... కొన్ని రోజుల క్రితం ఈ సినిమాను ఈ ఏడాది ఏప్రిల్ 14న విడుదల చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు మరోసారి అదే విడుదల తేదీని కన్ఫర్మ్ చేశారు. వేసవిలో రాకీ భాయ్ ప్రేక్షకుల ముందుకు వస్తాడని వెల్లడించారు.
Also Read: మగాళ్లకు మంచి టిప్... అదీ పెళ్లి తర్వాత భార్యతో బాలకృష్ణ చేసుకున్న అగ్రిమెంట్!
Also Read: సౌత్ ఇండియాలో మరో స్టార్ హీరోయిన్‌కు కరోనా... న్యూ ఇయర్ కంటే ముందే!
Also Read: చచ్చిపోతా, మంట పెట్టేస్తారనుకున్నా - రాజశేఖర్ భావోద్వేగం... జీవిత కన్నీరు
Also Read: 'అతిథి దేవో భవ' రివ్యూ: ప్రేక్షకుల్ని అతిథుల్లా చూశారా? లేదా?
Also Read: ఏడిస్తే కష్టం పోతుందా? - దీప్తి సునయన లేటెస్ట్ పంచ్! బ్రేకప్ బాధ నుంచి బయటకొస్తోందా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.